అబ్దుల్ హఫీజ్ కర్దార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అబ్దుల్ హఫీజ్ కర్దార్
అబ్దుల్ హఫీజ్ కర్దార్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అబ్దుల్ హఫీజ్ కర్దార్
పుట్టిన తేదీ(1925-01-17)1925 జనవరి 17 [1]
లాహోర్, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ1996 ఏప్రిల్ 21(1996-04-21) (వయసు 71)[1]
ఇస్లామాబాదు, పాకిస్తాన్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుSlow left arm orthodox
బంధువులు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టులు
తొలి టెస్టు (క్యాప్ 29/7)1946 జూన్ 22 
ఇండియా - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1958 మార్చి 26 
పాకిస్తాన్ - వెస్టిండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1943–1945Northern India
1944Muslims
1947–1949Oxford University
1948–1950వార్విక్‌షైర్
1953–1954Combined సర్వీసెస్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 26 174
చేసిన పరుగులు 927 6,832
బ్యాటింగు సగటు 23.76 29.83
100లు/50లు 0/5 8/32
అత్యధిక స్కోరు 93 173
వేసిన బంతులు 2,712 24,256
వికెట్లు 21 344
బౌలింగు సగటు 45.42 24.55
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 19
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 4
అత్యుత్తమ బౌలింగు 3/35 7/25
క్యాచ్‌లు/స్టంపింగులు 16/– 110/–
మూలం: CricketArchive, 2008 డిసెంబరు 3

అబ్దుల్ హఫీజ్ కర్దార్ (1925 జనవరి 17 - 1996 ఏప్రిల్ 21) పాకిస్తాన్ క్రికెటరు, రాజకీయవేత్త, దౌత్యవేత్త. అతను పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మొదటి కెప్టెన్. అతను భారతదేశం, పాకిస్తాన్ జట్లు రెండింటి తరఫున టెస్ట్ క్రికెట్ ఆడిన ముగ్గురు ఆటగాళ్ళలో ఒకడు. [2]

అతను పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యునిగా కూడా పనిచేశాడు. భుట్టో ప్రభుత్వంలో పంజాబ్ రాష్ట్ర ఆహార మంత్రిగా చేసాడు.

అతను వార్విక్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ చైర్మన్ సిరిల్ హస్టిలో కుమార్తె హెలెన్ రోజ్మేరీ హస్టిలో అనే ఆంగ్ల మహిళను పెళ్ళి చేసుకున్నాడు. ఆ తరువాత పాకిస్థానీ క్రికెటర్ జుల్ఫికర్ అహ్మద్ సోదరి షాజాదిని కూడా పెళ్ళి చేసుకున్నాడు. [3] అతనికి ఒక కొడుకు ఉన్నాడు - ఆర్థికవేత్త షాహిద్ హఫీజ్ కర్దార్.

అతను 1952 నుండి 1958 వరకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆడిన మొదటి 23 టెస్ట్ మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. తరువాత దేశంలో ప్రముఖ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నాడు. అతన్ని పాకిస్తాన్ క్రికెట్‌కు పితామహుడిగా పరిగణిస్తారు. 1958లో పాకిస్తాన్ ప్రభుత్వం నుండి ప్రైడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అవార్డును అందుకున్నాడు [4] [5]

తొలి ఎదుగుదల[మార్చు]

కర్దార్ 1925లో పంజాబ్‌లోని లాహోర్‌లోని ఒక ప్రసిద్ధ కర్దార్ అరైన్ కుటుంబంలో జన్మించాడు.[6] ఇస్లామియా కాలేజీ, లాహోర్, యూనివర్సిటీ కాలేజ్, ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్నాడు. అతను ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఉత్తర భారతదేశం, ముస్లింలతో సహా పలు రకాల జట్లకు దేశీయ క్రికెట్ ఆడాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లలో భారత్ జట్టు తరఫున, స్వాతంత్ర్యం తరువాత పాకిస్తాన్‌ జట్టు తరఫునా ఆడిన అతికొద్ది మంది ఆటగాళ్లలో అతను ఒకడు. 1952-53లో భారత పర్యటనలో తన మొదటి అధికారిక టెస్ట్ సిరీస్ ఆడిన జట్టుకు కర్దార్ నాయకత్వం వహించాడు. లాలా అమర్‌నాథ్ భారత జట్టుపై ఆడుతూ, పాకిస్తాన్ జట్టు ఢిల్లీ, బొంబాయిలలో ఓడిపోయింది. భారత జట్టు సిరీస్‌ గెలుచుకుంది. పాకిస్తాన్ జట్టు లక్నోలో జరిగిన రెండవ టెస్టులో విజయాన్ని సాధించింది.

అతను ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్ బౌలర్, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 6,832 పరుగులు చేసాడు, 344 వికెట్లు తీసుకున్నాడు. అతని బ్యాటింగ్‌ సగటు 29.83, బౌలింగ్‌ సగటు 24.55. పాకిస్తాన్‌కు టెస్ట్ హోదా ఇవ్వడానికి ముందు సంవత్సరాలలో కర్దార్ 1948 నుండి 1952 వరకు పాకిస్తాన్ జట్టు కోసం ఆడాడు. కర్దార్ వార్విక్‌షైర్, పాకిస్తాన్ సర్వీసెస్ తరపున కూడా ఆడాడు. [7]

పాకిస్థాన్ కెప్టెన్[మార్చు]

కర్దార్ ఆనాటి అన్ని టెస్ట్ ఆడే దేశాలకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రతి ఒక్కరిపై తన జట్టును విజయపథంలో నడిపించాడు. 1954లో ఓవల్‌లో ఇంగ్లండ్‌ పర్యటనలో సాధించిన సిరీస్-స్థాయి విజయం ముఖ్యంగా ప్రసిద్ధి చెందింది. 1957లో కరాచీలో ఆస్ట్రేలియాతో జరిగిన మొట్టమొదటి, ఏకైక టెస్ట్‌లో పాకిస్తాన్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 1954-55లో తన మొదటి పాకిస్తాన్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు ఆడిన మొత్తం ఐదు టెస్టులూ డ్రాగా ముగిసినప్పుడు ఆటగాళ్ల వైఖరిపై విమర్శలు వచ్చాయి. రాజకీయ ఉద్రిక్తతలు, స్వాతంత్ర్యం యొక్క రక్తపాత వారసత్వం కారణంగా భారత పాకిస్తాన్ ఆటగాళ్లు ఎవరికి వాళ్ళే ఓడిపోతామనే భయంతో, పోటీ క్రికెట్ ఆడలేఖపోయారు. అతని హయాంలో మొత్తం 23 టెస్టుల్లో పాకిస్థాన్ ఆరు గెలిచి, ఆరు ఓడిపోయి పదకొండు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. అతని అధికార పదవుల్లో ఉండగా అతను, నియంతృత్వ ధోరణిలో ఉండేవాడూ. త్వరగా కోపం తెచ్చుకునేవాడు, ముఖ్యంగా విమర్శలపై. కానీ అతను దూరదృష్టి గలవాడు. తటస్థ అంపైర్లుండాలని వాదించేవాడు.[7] కర్దార్ 1958లో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు [7]

తర్వాత కెరీర్[మార్చు]

కర్దార్ మహమ్మద్ అలీ జిన్నాకు బలమైన మద్దతుదారు. భారతదేశంలో ముస్లిం వైభవం పట్ల కట్టుబడి ఉన్నాడు. అబ్దుల్ హఫీజ్ కర్దార్ రాజకీయాల్లోకి వెళ్లి 1972 నుండి 1977 వరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా పనిచేశాడు అతని పదవీకాలం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌తో ఆసియా, ఆఫ్రికన్ క్రికెట్ దేశాల ప్రాతినిధ్యాన్ని పెంచడంలో ప్రముఖమైనది. 1977లో ఆటగాళ్లతో ఇబ్బందికరమైన వేతన వివాదం కారణంగా కర్దార్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అతను అనేక ధార్మిక, సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పనిచేశాడు. 1996లో అతని స్వస్థలమైన లాహోర్‌లో మరణించడానికి ముందు, చివరి సంవత్సరాల్లో స్విట్జర్లాండ్‌లో పాకిస్తాన్ రాయబారిగా పనిచేసాడు. అతను 1970లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) టిక్కెట్‌పై పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీకి ఎన్నికై, ప్రావిన్షియల్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశాడు.

నివాళి[మార్చు]

2019 లో, అతని 94వ పుట్టినరోజు నాడు గూగుల్ డూడుల్‌ ప్రదర్శించింది.[2]

అవార్డులు, గుర్తింపు[మార్చు]

  • 1958లో పాకిస్తాన్ అధ్యక్షుడు [5] [2] ప్రైడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అవార్డు 2012లో, అతనికి మరణానంతరం పాకిస్తాన్ క్రికెట్‌కు చేసిన కృషికి గుర్తింపుగా హిలాల్-ఇ-ఇమ్తియాజ్ లభించింది. [8]

2012లో, అతను దేశ క్రికెట్ జట్టుకు చేసిన సేవలకు గానూ, పాకిస్తాన్ దేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన సితార-ఎ-ఇమ్తియాజ్‌ను అందుకున్నాడు. [9]

AH కర్దార్ పుస్తకాలు[మార్చు]

  • ప్రారంభ టెస్ట్ మ్యాచ్‌లు (1954)
  • విచారణలో పరీక్ష స్థితి (1954)
  • గ్రీన్ షాడోస్ (1958)
  • పీపుల్స్ కమిట్మెంట్ (1971)
  • క్రికెట్ కాన్‌స్పిరసీ (1977)
  • మన యువత ఆర్థిక భవిష్యత్తు అవుతోందా? (1985)
  • బంగ్లాదేశ్: ది ప్రైస్ ఆఫ్ పొలిటికల్ ఫెయిల్యూర్ (1985)
  • ఆల్ రౌండర్ జ్ఞాపకాలు (1987)
  • పాకిస్తాన్స్ సోల్జర్స్ ఆఫ్ ఫార్చ్యూన్ (1988)
  • యాన్ అంబాసిడర్స్ డైరీ (1994)
  • విఫలమైన అంచనాలు (1995)

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Obituary: Abdul Hafeez Kardar Independent (UK newspaper), Published 10 May 1996, Retrieved 21 June 2019
  2. 2.0 2.1 2.2 "Abdul Hafeez Kardar'okte=21 June 2019".
  3. "Cricketing dynasties: The 22 families of Pakistan Test cricket — Part 2 | Sports | thenews.com.pk". www.thenews.com.pk.
  4. The top 10 Pakistan Test cricketers The Sunday Times (London newspaper), Retrieved 21 June 2019
  5. 5.0 5.1 Pride of Performance Award for Abdul Hafeez Kardar info on Pakistan Sports Board website Archived 2018-12-26 at the Wayback Machine Retrieved 21 June 2019
  6. "Player Profile: Abdul Kardar". CricketArchive. Retrieved 15 April 2016.
  7. 7.0 7.1 7.2 Profile of Abdul Hafeez Kardar on espncricinfo.com website Retrieved 21 June 2019
  8. "President confers civil awards on Pakistani citizens and foreign nationals - Top Story". The News International. 15 August 2012. Retrieved 25 June 2020.
  9. Desk, OV Digital (2023-01-16). "17 January: Remembering Abdul Hafeez Kardar on Birthday". Observer Voice (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-16.