జెన్నిఫర్ కెండల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జెన్నిఫర్ కపూర్
జననంజెన్నిఫర్ కెండల్
(1934-02-28)1934 ఫిబ్రవరి 28
సౌత్‌పోర్ట్, లంకాషైర్, ఇంగ్లాండ్
మరణం1984 సెప్టెంబరు 7(1984-09-07) (వయసు 50)
లండన్, ఇంగ్లాండ్
వృత్తినటి
భార్య / భర్త
(m. 1958)
పిల్లలుకునాల్ కపూర్
కరణ్ కపూర్
సంజనా కపూర్
తల్లిదండ్రులుజియోఫ్రీ కెండల్
లారా లిడెల్
బంధువులుఫెలిసిటీ కెండల్ (సోదరి)
కపూర్ కుటుంబం

జెన్నిఫర్ కెండల్ (1934 ఫిబ్రవరి 28 - 1984 సెప్టెంబరు 7) ఒక ఆంగ్ల నటి, పృథ్వీ థియేటర్ స్థాపకురాలు.[1] ఆమె 36 చౌరంగీ లేన్ (1981) చిత్రానికి ప్రధాన పాత్రలో ఉత్తమ నటిగా బాఫ్టా అవార్డు గెలుచుకుంది. ఆమె నటించిన ఇతర చిత్రాలలో బొంబాయి టాకీ (1970) జునూన్ (1978) హీట్ అండ్ డస్ట్ (1983), ఘరే బైరే (1984) మొదలైనవి ఉన్నాయి.

బాల్యం[మార్చు]

జెన్నిఫర్ కెండల్ ఇంగ్లాండ్ సౌత్పోర్ట్ లో జియోఫ్రీ కెండల్, లారా లిడెల్ దంపతులకు జన్మించింది, అయితే, ఆమె యవ్వనంలో ఎక్కువగా భారతదేశంలోనే గడిపింది. ఆమెకు ఒక చెల్లెలు ఫెలిసిటీ కెండల్ ఉంది. వీరు ట్రావెలింగ్ థియేటర్ కంపెనీ "షేక్స్పియేరానా" ను నడిపారు. ఇది షేక్స్పియర్ వల్లాహ్ (1965) లో చిత్రీకరించినట్లుగా భారతదేశం అంతటా పర్యటించింది. ఇందులో ఆమెతో పాటు, ఆమె భర్త శశి కపూర్, ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరి కూడా నటించింది.[2]

కెరీర్[మార్చు]

1956లో షేక్స్పియోరానాలో భాగంగా ది టెంపెస్ట్ నాటకంలో ఆమె మిరాండా పాత్ర పోషించింది. ఆ సమయంలో, ఆమె పృథ్వీ థియేటర్ కంపెనీలో భాగంగా ఉన్న కలకత్తాలో శశి కపూర్ తో మొదటిసారి కలుసుకుంది. ఆ తరవాత, శశి కపూర్ కూడా షేక్స్పియోరానా కంపెనీతో కలిసి పర్యటించడం ప్రారంభించాడు. ఈ జంట జూలై 1958లో వివాహం చేసుకున్నారు.[3] 1978లో ముంబై నగరంలోని జుహు ప్రాంతంలో తమ థియేటర్ ను ప్రారంభించడంతో ముంబై పృథ్వీ థియేటర్ పునరుజ్జీవనంలో జెన్నిఫర్, ఆమె భర్త కూడా కీలక పాత్ర పోషించారు.[4] ఈ జంట అనేక చిత్రాలలో కలిసి నటించారు, ముఖ్యంగా మర్చంట్ ఐవరీ ప్రొడక్షన్స్ నిర్మించినవి. వారి మొదటి ఉమ్మడి పాత్రలు బాంబే టాకీ (1970) లో ఉన్నాయి, ఇది కూడా మర్చంట్ ఐవరీ నిర్మించిన చిత్రాలలో ఒకటి.]

వ్యక్తిగత జీవితం[మార్చు]

కపూర్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుమారులు కునాల్ కపూర్, కరణ్ కపూర్. కాగా, కుమార్తె సంజనా కపూర్. వీరంతా కూడా బాలీవుడ్ నటులే.[5]

ఆమె రెండేళ్లపాటు పెద్దప్రేగు క్యాన్సర్ తో బాధపడుతూ 1984లో మరణించింది.[6]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

  • షేక్స్పియర్ వల్లాహ్ (1965) -శ్రీమతి బోవెన్ [7]
  • బొంబాయి టాకీ (1970) -లూసియా లేన్
  • జునూన్ (1978) -మిరియం లబాడూర్ (రూత్ తల్లి)
  • 36 చౌరంగీ లేన్ (1981) మిస్ వైలెట్ స్టోన్హామ్
  • హీట్ అండ్ డస్ట్ (1983) -మిసెస్ సాండర్స్
  • ది ఫార్ పెవిలియన్స్ (1984) -శ్రీమతి వికారీ
  • ఘరే-బైర్ (1984) -మిస్ గిల్బీ (ది హోమ్ అండ్ ది వరల్డ్)

కాస్ట్యూమ్ డిజైన్[మార్చు]

  • ముక్తి (1977)
  • జునూన్ (1978)

అవార్డులు[మార్చు]

  • 1980: ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు - జునూన్ - నామినేట్ చేయబడింది.
  • 1982: ఈవెనింగ్ స్టాండర్డ్ బ్రిటిష్ ఫిల్మ్ అవార్డ్స్ - ఉత్తమ నటి 36 చౌరంగీ లేన్ - విజేత.
  • 1983: ప్రధాన పాత్రలో ఉత్తమ నటిగా బాఫ్టా అవార్డు - 36 చౌరంగీ లేన్ - నామినేట్ చేయబడింది.[8]

మూలాలు[మార్చు]

  1. "Jennifer Kendal". British Film Institute. Archived from the original on 13 December 2017. Retrieved 28 February 2021.
  2. "The wandering players".
  3. Jennifer Biography
  4. "Prithvi, pioneer in theatre". The Hindu. 7 November 2003. Archived from the original on 1 January 2004.
  5. Meet the Kapoors, Network 18.
  6. Piers Morgan's Life Stories, 19 October 2012
  7. Jennifer Kapoor – Filmography The New York Times
  8. Bafta Awards Nominations 1982 British Academy Film Awards official website.