జెన్నీ లూమెట్
Jump to navigation
Jump to search
జెన్నీ లూమెట్ | |
---|---|
జననం | [1] న్యూయార్క్, యుఎస్ | 1967 ఫిబ్రవరి 2
వృత్తి | సినిమా నటి, స్క్రీన్ ప్లే రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1982–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | బాబీ కన్నవాలే
(m. 1994; div. 2003)అలెగ్జాండర్ వైన్‌స్టెయిన్
(m. 2008) |
పిల్లలు | 2, జేక్ కన్నవాలే |
తల్లిదండ్రులు |
|
బంధువులు | లీనా హార్న్ (నానమ్మ) బరూచ్ లూమెట్ (తాత) |
జెన్నీ లూమెట్ (1967, ఫిబ్రవరి 2)[2] అమెరికన్ సినిమా నటి, స్క్రీన్ ప్లే రచయిత్రి. దర్శకుడు సిడ్నీ లూమెట్ కుమార్తె, లీనా హార్న్ మనవరాలు. లూమెట్ 2008 జోనాథన్ డెమ్మే సినిమా రాచెల్ గెట్టింగ్ మ్యారీడ్ స్క్రీన్‌ప్లేను వ్రాసినందుకు ప్రసిద్ధి చెందింది.[3][4]
జననం, విద్య
[మార్చు]జెన్నీ లూమెట్ 1967, ఫిబ్రవరి 2న దర్శకుడు సిడ్నీ లూమెట్ - పాత్రికేయురాలు/రచయిత్రి గెయిల్ బక్లీ (గెయిల్ బక్లీ జోన్స్) దంపతులకు న్యూయార్క్ నగరంలో జన్మించింది. అమ్మమ్మ గాయని లీనా హార్న్.[5] 1984లో లూమెట్ డాల్టన్ స్కూల్ నుండి పట్టభద్రురాలయింది.[6]
వ్యక్తిగత జీవితం
[మార్చు]లూమెట్ 1994లో నటుడు బాబీ కన్నవాలేను వివాహం చేసుకున్నది. వారికి ఒక కుమారుడు నటుడు జేక్ కన్నవాలే ఉన్నాడు.[7] వాళ్ళు 2003లో విడాకులు తీసుకున్నారు.[8] 2008లో అలెగ్జాండర్ వైన్‌స్టెయిన్‌ను రెండవ వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె ఉంది.[9]
సినిమాలు
[మార్చు]- 1982: డెత్‌ట్రాప్
- 1988: రన్నింగ్ ఆన్ ఎంప్టీ
- 1988: టఫ్ దన్ లెదర్
- 1995: డాడ్జ్‌బాల్
- 2017: ది మమ్మీ
- 2017: స్టార్ ట్రెక్: డిస్కవరీ
- 2020: స్టార్ ట్రెక్: పికార్డ్
- 2021: క్లారిస్
- 2022: ది మ్యాన్ హూ ఫెల్ టు ఎర్త్
- 2022: స్టార్ ట్రెక్: స్ట్రేంజ్ న్యూ వరల్డ్స్[10]
అవార్డులు
[మార్చు]- 2008: ఫిల్మ్ ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్స్, ఉత్తమ మొదటి స్క్రీన్ ప్లే (నామినేషన్) రాచెల్ గెట్టింగ్ మ్యారీడ్ [11]
- 2008: న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్, రాచెల్ గెట్టింగ్ మ్యారీడ్[12] కి ఉత్తమ స్క్రీన్ ప్లే
- 2008: టొరంటో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్, రాచెల్ గెట్టింగ్ మ్యారీడ్[13] కి ఉత్తమ స్క్రీన్ ప్లే
- 2009: ఎన్ఎఎఎసిపి ఇమేజ్ అవార్డ్స్, రాచెల్ గెట్టింగ్ మ్యారేజ్ కోసం మోషన్ పిక్చర్ (థియేట్రికల్ లేదా టెలివిజన్)లో అత్యుత్తమ రచన
మూలాలు
[మార్చు]- ↑ Sidney Lumet: Interviews
- ↑ Rapf, Joanna E., ed. (2005). Sidney Lumet: Interviews. University Press of Mississippi. p. Chronology xix. ISBN 978-1578067244.
1967 ... Daughter Jenny Lumet born
- ↑ Scott, A. O. (October 2, 2008). "Anne Hathaway's Wreaking Havoc in Jonathan Demme's New Film". The New York Times.
- ↑ Gross, Terry; Lumet, Jenny; Demme, Jonathan (October 9, 2008). "Behind The Scenes Of 'Rachel Getting Married': Demme, Lumet on Getting 'Rachel' Married" (Includes audio interview). Fresh Air (in ఇంగ్లీష్). NPR.
- ↑ Brozan, Nadine (June 20, 1986). "Born in a Trunk: The Story of the Hornes". The New York Times.
- ↑ Stone, Michael (March 10, 1986). "Pressure Points: Frazzled Students at the City's Top Schools". New York (magazine) (in ఇంగ్లీష్). p. 31.
- ↑ Horyn, Cathy (June 24, 2011). "For the Screenwriter Jenny Lumet, a Childhood With Two Icons". The New York Times.
- ↑ Sperling, Nicole (2021-08-01). "Can Paramount+ Succeed? One Producer Hopes to Make It So". The New York Times. ISSN 0362-4331. Retrieved 2023-05-27.
- ↑ Cuthrell-Tuttleman, Willa (August 2, 2019). "Jenny Lumet Will Co-Showrun CBS All Access' "The Man Who Fell To Earth" Adaptation". Women in Hollywood. Retrieved 2023-05-27.
- ↑ "2008 Awards: Best Screenplay: Jenny Lumet, Rachel Getting Married". New York Film Critics Circle. 2008.
- ↑ "Author Q&A: Jenny Lumet, Screenwriter, "Rachel Getting Married"". Write On Online. Retrieved 2023-05-27.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జెన్నీ లూమెట్ పేజీ