జె. శివకుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జె.శివకుమార్
జె. శివకుమార్
జననం
శివకుమార్ జయకుమార్

చెన్నై, తమిళనాడు
ఇతర పేర్లుశివకుమార్ జయకుమార్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, కథా రచయిత, నిర్మాత
తల్లిదండ్రులు
  • జయకుమార్ (ఫోటోగ్రాఫర్) (తండ్రి)
బంధువులు"బాల" సోదరుడు

శివకుమార్ జయకుమార్ (జె.శివకుమార్) భారతీయ సినిమా దర్శకుడు. ఆయన "శివ" లేదా "సిరూతై శివ"గా సుప్రసిద్ధుడు. ఆయన తమిళ సినిమా రంగంలో ఛాయాగ్రాహకుడుగానూ, దర్శకునిగా, నటునిగా తన సేవలనందించాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

శివ కుమార్ చెన్నైలో డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్ అయిన జయకుమార్ కు జన్మించాడు. [1] ఆయన మాతృభాష తమిళం.[2] ప్రముఖ సినిమా నిర్మాత అయిన ఎ.కె.వేలన్ మనుమడు.[3] ఆయన సోదరుడు "బాల" కూడా మలయాళ, తమిళ సినిమా నటుడు. అతడు అనేక టెలివిజన్ కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించాడు. సినిమా ఫోటోగ్రాఫర్ కాక ముందు పైన్ ఆర్ట్స్ ముఖ్యంగా కవితలు, చిన్న నాటకాల రచయితగా మంచి ఉత్సుకత ఉండేది. తమిళనాడులో ఆయనకు ఉత్తమ ఉపన్యాసకుడు పురస్కారం మూడుసార్లు వచ్చింది. ప్రతీ రోజూ తన చుట్టూ జరుగుతున్న కొత్త విషయాలను పరిశీలించి రచనలు చేసేవాడు. ఈ విషయాలు దర్శకునిగా కావడానికి దోహదపడ్డాయి.[4]

కెరీర్[మార్చు]

ఆయన చిత్ర నిర్మాతగా కావాలని కోరుకున్నప్పటికీ ఫోటోగ్రఫీ రంగాన్ని ఎంచుకున్నాడు. ఆయన 1998లో అడయార్ ఫిలిం ఇనిస్టిట్యూట్ నుండి బంగారు పతకాన్ని పొందాడు.[1] ఆయన సినిమా ఛాయాగ్రాహకుడైన "జయన్ విన్సెంట్"తో కలసి పనిచేసాడు. తరువాత ఆయన హైదరాబాద్ వచ్చి దగ్గుబాటి వెంకటేష్ నటించిన సినిమా జయం మనదేరా (2000 సినిమా)లో ఆపరేటివ్ కెమేరామన్ గా పనిచేసాడు.[1] 2002 లో ఆయన స్వతంత్రంగా సినిమా ఛాయాగ్రాహకునిగా తన సేవలను ప్రారంభించాడు. ఆయన సోదరుడు "బాల" చిత్రపరిశ్రమలో చేరిన తరువాత, ఆయన ఛాయాగ్రాహకునిగా తన సేవలను ప్రారంభించి సుమారు 15 చిత్రాలకు పనిచేసాడు.

2008 లో తెలుగు సినిమా నటుడు గోపీచంద్ ప్రధాన పాత్రకోసం ఒక కథను చెప్పాడు.[1] గోపీచంద్, అనుష్కాశెట్టి లతో శౌర్యం సినిమాకు దర్శకత్వం వహించాడు. తరువాత సంవత్సరాలలో ఆయన రెండవ చిత్రం కూడా గోపీచంద్ తో చేసాడు. 2011లో శివ తమిళ సినిమా రంగంలో సిరుతై చిత్రంలో దర్శకునిగా ప్రవేశించాడు. తెలుగులో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన విక్రమార్కుడు సినిమా యొక్క రీమేక్ ఇది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కార్తీ నటించాడు ఈ చిత్రం ఆర్థికంగా విజయం సాధించింది. ఈ విజయంతో ఆయన "సిరుతై శివ"గా మారిపోయారు.[2] ఆయన దర్శకత్వం వహించిన నాల్గవ సినిమా దరువు 2012 మేలో విడుదలైంది.

2011 డిసెంబరులో ఆయన విజయా ప్రొడక్షన్స్ ద్వారా సంతకం చేసి అజిత్ కుమార్ ప్రధాన పాత్రతో నటించిన చిత్రానికి పనిచేసాడు.[5] అజిత్ కుమార్ ఆ చిత్రానికి స్క్రిప్టు తయారీని గ్రామీణ కథగా మలచాలని కోరాడు. కానీ దీని నిర్మాణం 2013 వరకు జరుగలేదు.[6] ఆయన అజిత్ తో "వీరం" అనే చిత్రాన్ని చేసాడు. ఆర్థికంగా ఇది అతి పెద్ద విజయం సాధించింది. ఈచిత్రం 2014 జనవరిలో విడుదల అయింది. ఆయన తమిళంలో మూడవ సినిమా "వేదాలం" అజిత్ తో పాటు నటులుగ శ్రుతి హాసన్, రాహుల్ దేవ్ లతో చేసాడు. ఇది అజిత్ తో కలసి చేసిన అతి పెద్ద సినిమా. ఇది ఆగస్టు 2017 లో విడుదలైంది. [7]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

ఛాయాగ్రాహకునిగా[మార్చు]

సంవత్సరేం సినిమా దర్శకుడు భాష
2002 చార్లీ చాంప్లిన్ శక్తి చిదంబరం తమిళం
2002 శ్రీరాం (సినిమా) వి.ఎన్.ఆదిత్య తెలుగు
2004 నేనున్నాను వి.ఎన్.ఆదిత్య తెలుగు
2005 మనసు మాట వినదు వి.ఎన్.ఆదిత్య తెలుగు
2005 గౌతం (ఎస్.ఎస్.సి) పి.ఎ.అరుణ్‌ప్రసాద్ తెలుగు
2006 బాస్ వి.ఎన్.ఆదిత్య తెలుగు
2010 దమ్మున్నోడు బి.వి.వి.చౌదరి తెలుగు

దర్శకునిగా[మార్చు]

సంవత్సరం చిత్రం భాష
2008 శౌర్యం తెలుగు
2009 శంఖం (సినిమా) తెలుగు
2011 సిరుతై తమిళం
2012 దరువు (సినిమా) తెలుగు
2014 వీరం తమిళం
2015 వేదాలం తమిళం
2017 వివేగం తమిళం
2021 Annaathe Tamil

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "Siva Kumar (Souryam director) interview – Telugu Cinema interview – Telugu film director and cinematographer". Idlebrain.com. 23 September 2008. Archived from the original on 18 అక్టోబరు 2012. Retrieved 10 October 2012.
  2. 2.0 2.1 ‘Even those who are not will become Ajith's fans’. The Hindu (7 November 2015). Retrieved on 2017-12-31.
  3. Manchi manasuku manchi rojulu (1958). The Hindu (9 July 2015). Retrieved on 2017-12-31.
  4. "Siva Kumar (Souryam director) interview - Telugu Cinema interview - Telugu film director and cinematographer". www.idlebrain.com. Archived from the original on 2012-10-18. Retrieved 2018-03-11.
  5. "Ajith's new film starts rolling". IndiaGlitz. 2 December 2011. Archived from the original on 3 డిసెంబరు 2011. Retrieved 30 September 2012.
  6. "Ajith asks Siruthai Siva to rework script". The Times of India. 21 July 2012. Archived from the original on 8 ఆగస్టు 2013. Retrieved 30 September 2012.
  7. Vivegam Hit or Flop | Vivegam Movie Verdict Archived 2018-03-19 at the Wayback Machine. Scooptimes (25 August 2017). Retrieved on 2017-12-31.

బయటి లింకులు[మార్చు]