Jump to content

జేమ్స్ పీస్

వికీపీడియా నుండి
వైస్‌బాడెన్‌లోని ఇంట్లో జేమ్స్ పీస్

కెన్నెత్ జేమ్స్ పీస్ (ఆంగ్లం: Kenneth James Peace), 1963 సెప్టెంబరు 28 పైస్లీలో జన్మించాడు. ఇతడు  స్కాటిష్ సంగీత విద్వాంసుడు, పియానో వాద్యకారుడు, ప్రదర్శనకారుడు.

జీవితం

[మార్చు]

జేమ్స్ పీస్ 1963 సెప్టెంబరు 28న పైస్లీ, స్కాట్లాండ్‌లో జన్మించారు. తన బాల్యం స్కాట్లాండు పడమటి భాగంలో నది పక్కన ఉన్న వేలెన్స్ బర్స్ రిసార్డులో గడిచింది.[1][2] అతడి కుటుంబమంతా (ఉదా: జాన్ మెక్ ఫీు) కళాకారులే. అతడు కూడా ప్రముఖ నాట్యసంగీతకారుడు ప్రదర్శకుడు, అలాగే 20వ శతాబ్దం పాురంభంలో ప్రఖ్యాతి ఛెందిన ఫెవిక్స్ బర్న్స్ స్కూలుకు చెందినవాడు.[1][3] ఎనివిుదేళృ వయసు నుండే పియానోలో శిక్షణ పొంది తన పదునాల్గవ ఏట స్కాట్ జోప్లిన్ నేతృత్యంలో మెుదటి సంగీత ప్రదర్శననిచ్చారు. రెండేళృ తరువాత రాయల్ స్కాటిష్ అకాడెవిు ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్రామా (ఇప్పుడు రాయల్ కన్సర్వేటర్ అఫ్ స్కాట్లాండ్ అని పిలవబడుతోంది,[1][2][3][4]లో అత్యంత పిన్న వయస్కుడైన పుల్ టైం విద్యార్థిగా చేరారు. 1983లో పియానోలో గ్లాస్గో విశ్వవిద్యాలయం నుండి B.A. పట్టా పుచ్చుకున్నారు.[4][5] ఆ తరువాతి సంవత్సరం సంగీతంలో డిప్లొమాను మెండెస్సొన్స్ పియానో కాన్సర్ట్ నెం: 1 RSAMD ఆర్కెస్ట్రా ప్రదర్శన ఇచ్చిన తరువాత పొందారు.[1][6] చదువు ముగిసాక పియానిస్ట్ గా ఎడిన్ బర్గ్ లో 1988 - 1991 వరకూ పనిచేశారు.[1][2]

జేమ్స్ పీస్ జర్మనీలోని బద్ నౌహెమ్ లో 1991 – 2009 వరకూ ఉన్నారు.[6][7][8] 1988 నుండి టాంగో పై అధ్వయనం చేసి టాంగోతో స్ఫూర్తి పొందిన పియానో రచనల సిడి ʺTango escocésʺ (స్కాట్టిష్ టాంగొ)[8][9]ని తయారుచేశారు, 2002 నాటికి విక్టోరియా సంగీత కళాశాలలో సభ్యుడయ్యారు.[3][8] అదే సంవత్సరం సెప్టెంబరు/ అక్టోబరు నెలల్లో తూర్పు జర్మనీలోనూ,[10] నవంబరులో తూర్పు ప్రాచ్య దేశమైన హంగ్ కాంగ్ లోనూ  స్యంతంగా ʺటాంగో XVIIʺ అనే మెుదటి సంగీత విభావరిని ప్రదర్శించారు.[8][9][10][11][12]

Tango Milonga op. 26 by James Peace

తరువాతి సంవత్సరాలలో ఆయన ప్రదర్శనలు యూరోప్ లోనే కేంద్రీకృతమయ్యాయి. తనవైన టాంగోలను ఆమ్‌స్టర్‌డ్యామ్, ఏథెన్స్,[13] బెర్లిన్,[14] బుస్సెల్స్, హెలిన్స్ కి,[15] లిస్బన్,[16] లండన్, మాడ్రిడ్,[17] ఓస్లో,[18] రెక్జవిక్[19] ఇంకా వియన్నా[20] వంటి దేశాలలో ప్రదర్శించారు.

Tango XVIII by James Peace (James Peace, piano)

2008లో తన టాంగో సంగీత ప్రదర్శనలకు గుర్తింపుగా లండన్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లో సభ్యుడయ్యారు.[1]

కొంతకాలం తరువాత ఎడిన్ బర్గ్ నుండి 2010 ఫిబ్రవరిలో జర్మనీలోని వియస్ బదెన్ లో గడపడానికి తిరిగి వచ్చారు.[1][3] ఇది సృజనాత్మకతకు కొత్త ప్రేరణలను కలిగించింది అంటేకాకుండా అతడు కొన్ని తన స్వంత రచనల లఘు చిత్రాలను నిర్మించారు. ʺకే. జేమ్స్ పీస్ వియస్ బదెన్ʺ అనే లఘు చిత్రం ఈ కోవలోదే.[21][22]

అవార్డులు , వురస్కారాలు

[మార్చు]
James Peace - Idylls op.4b

●    ʺఆగ్నస్ విుల్లర్ʺ పోటీలో మెుదటి బహుమతి గ్లాస్గో, 1983[4]

●    ʺడన్ బార్టవ్ షైర్ ఇ.ఐ.ఎస్.ʺ పోటీలో మెుదటి బహుమతి గ్లాస్గో, 1984[4]

●    సిబిలియస్ఎస్సె పోటీలో మెదటి బహుమతి గ్లాస్గో, 1985[4]

●    డిప్లొమా, టి.ఐ.ఎమ్. ఇంటర్నేషనల్ కాంపోజిషన్ పోటీ రోమ్, 2000[1][2][5]

●    డిప్లోమా, ఐబిఎల్ ఫౌండేషన్. న్యూయార్క్, 2002[1][2][5]

●    స్మారక మెడల్ (మెదటి శ్రేణి), ఇంటర్నేషనల్ పియానో డ్యయె అసోసియేషన్, టోక్యో, 2002[1][2][5][23]

●    గోల్డ్ మెడల్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లుటెచె శ్ పారిస్, 2005[1][2]

ప్రధానమైన కృతులు

[మార్చు]

• ద వాటర్ ఫాల్ [24]

• ఐడిల్ల్స్

• ఉదయపు ప్రేమ గీతం

• నిశ్సబ్దాశ్రువులు

• విస్మృత ఆకులు

• ఒబో సోనాటా

• బాల్లడ్

• వేడుక ఊరేగింపు నెం: ౧

• వేడుక ఊరేగింపు నెం: ౨

• శరత్కాల స్వర్ణం[25]

• శాశ్వతమైన  పాట[1]

•  జార్జియా కోసం

   పాట యెుక్క సాహిత్యం: తమరె శిక్వైద్జె, సోరబ్ శిక్వైద్జె, జేమ్స్ పీస్

• ౨౪ టాంగోలు[1][9][21][22]

వెలుపలి లింకులు

[మార్చు]

Souvenir de Buenos Aires (పియానో సోలో), YouTube

Autumn Gold, YouTube

Lento Lacrimoso, YouTube

మూలాలు

[మార్చు]
  1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 1.11 1.12 Birgitta Lamparth. ʺస్పైకుల శబ్దాలు లేకుండాʺ. Wiesbadener Tagblatt (జర్మన్ వార్తావత్రిక), 10 ఫిబ్రవరి 2011
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 Julia Anderton. ʺచేదు తీపి కథలాంటి టాంగోʺ. Wiesbadener Kurier (జర్మన్ వార్తావత్రిక), 24 మార్చి 2012
  3. 3.0 3.1 3.2 3.3 Sabine Klein. ʺనాలాంటి నా సంగీతం – ఎంతో ప్రణయాత్మకంʺ. Frankfurter Rundschau (జర్మన్ వార్తావత్రిక), 1992, ప్రచురణ సంఖ్య 254, పుట 2
  4. 4.0 4.1 4.2 4.3 4.4 G. Müller. ʺపియానో ఆత్మ టాంగో నృత్యం చేస్తుందిʺ. Kulturspiegel Wetterau (జర్మన్ వార్తావత్రిక), 17 వేు 2001, పుట 5
  5. 5.0 5.1 5.2 5.3 డ్యుయిష్ నేషనల్ బిబ్లియోథెక్. ʺ జేమ్స్ పీస్ ʺ
  6. 6.0 6.1 ʺ జేమ్స పీస్ ʺ. FRIZZ (జర్మన్ పత్రిక), జనవరి 2012, పుట 5
  7. Manfred Merz. ʺనైపుణ్యం , సున్నితత్వం నిండిన ఒక ప్రపంచంʺ. Wetterauer Zeitung (జర్మన్ వార్తావత్రిక), 12 డిసెంబర్ 1992, పుట 19
  8. 8.0 8.1 8.2 8.3 ʺ జేమ్స్ పీస్ ʺ. The Tango Times (న్యూయార్క్ వార్తాపత్రిక), శీతాకాలపు సంచిక 2002/2003. ప్రచురణ సంఖ్య 39, పుటలు 1-5
  9. 9.0 9.1 నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్కాట్లాండ్. ʺటాంగో ఎస్కోస్ʺ (ʺTango estudioʺ)
  10. La Cadena (డచ్ పత్రిక) సెప్టెంబర్ 2002, పుట 26
  11. TangoTang (వార్తాలేఖ), హంగ్ కాంగ్, 8 అక్టోబర్, 2002
  12. ʺ జేమ్స్ పీస్ ʺ, South China Post (హంగ్ కాంగ్ వార్తావత్రిక), 9 అక్టోబర్ 2002
  13. కాన్సర్ట్ కార్యక్రమ బ్రోచర్. {Για σένα Αγγελική}. ఏథెన్స్, 27 అక్టోబర్ 2016
  14. Tangodanza (జర్మన్ పత్రిక). ప్రచురణ సంఖ్య 1/ 2002, పుట 9
  15. కచేరీ పోస్టర్ (ఫిన్లాండ్ యొక్క కాన్సర్ట్ టూర్, 2014)
  16. కచేరీ పోన్టర్ ( పోర్చుగల్ యొక్క కాన్సర్ట్ టూర్, 2016)
  17. కచేరీ పోన్టర్, (స్పెయిన్ యొక్క కాన్సర్ట్ టూర్) «¡Feliz cincuenta cumpleaños, 2013!»
  18. Listen.no: Flygel: జేమ్స్ పీస్ (ఫ్లైజెల్). Munch Museum (సంగ్రహాలయం), 16 అక్టోబర్ 2004
  19. Ríkarður Ö. Pálsson. ʺSkozir Slaghörputangoárʺ. Morgunblaðið (ఐస్లాండిక్ వార్తావత్రిక), 14 అక్టోబర్ 2004
  20. కాన్సర్ట్ కార్యక్రమ బ్రోచర్. వియన్నా, 23 జనవరి 2005
  21. 21.0 21.1 నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్కాట్లాండ్. ʺK. James Peace in Wiesbadenʺ
  22. 22.0 22.1 డ్యుయిష్ నేషనల్ బిబ్లియోథెక్. ʺK. James Peace in Wiesbadenʺ
  23. ఇంటర్నేషనల్ పియానో ​​డుయో అసోసియేషన్ (టొక్యొ), విజేతల పట్టిక 2002
  24. Wiesbadener Staatstheater (హెస్సిచెస్ స్టాట్స్‌థియేటర్ వైస్‌బాడెన్), కాన్సర్ట్ కార్యక్రమ బ్రోచర్, 12/19 సెప్టెంబర్, 2021  
  25. Schwäbische Post (జర్మనీ). ʺవయొలిన్ శబ్దం ఆర్చెస్ట్రా పై తేలియాడుతుందిʺ. 4 జౌన్, 1994