జై పి. నాగర్‌కట్టి
జై పి. నాగర్‌కట్టి | |
---|---|
జననం | జై పి. నాగర్‌కట్టి 1947 ఫిబ్రవరి 18 హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
మరణం | 2010 నవంబరు 13 | (వయసు 63)
పౌరసత్వం | అమెరికన్ |
జాతీయత | భారతీయుడు |
డాక్టర్ జై పి. నాగర్‌కట్టి (1947, ఫిబ్రవరి 18 - 2010, నవంబరు 13) తెలంగాణకు చెందిన ఇండో-అమెరికన్ రసాయన శాస్త్రవేత్త, వ్యాపారవేత్త. సిగ్మా ఆల్డ్రిచ్ చైర్మన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, సీఈఓ, ప్రెసిడెంట్‌గా పనిచేశాడు.[1]
జననం
[మార్చు]నాగర్‌కట్టి 1947, ఫిబ్రవరి 18న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు.
వృత్తిజీవితం
[మార్చు]నాగర్‌కట్టి, టెక్సాస్ ఎ&ఎం యూనివర్శిటీ–కామర్స్[2] నుండి పట్టభద్రుడయ్యాక 1976లో సిగ్మా-ఆల్డ్రిచ్‌లో చేరాడు. 2004లో, కంపెనీ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదోన్నతి పొందాడు; 2005లో బోర్డు డైరెక్టర్ల్ గా, 2006లో సీఈఓగా, 2009లో చైర్మన్ అయ్యాడు.
గుర్తింపులు
[మార్చు]2015లో ప్రారంభించబడిన చెస్టర్‌ఫీల్డ్, సెయింట్ లూయిస్ కౌంటీ లైబ్రరీకి చెందిన శామ్యూల్ సి. సాక్స్ బ్రాంచ్‌లోని రీడింగ్ గార్డెన్‌కు నాగర్‌కట్టి గౌరవార్థం "జై నగర్‌కట్టి మోన్‌శాంటో కంపెనీ రీడింగ్ గార్డెన్" అని పేరు పెట్టారు.[3]
మరణం
[మార్చు]నాగర్‌కట్టి 2010, నవంబరు 13న మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Jai Nagarkatti, Sigma-Aldrich CEO, dies at 63, by Jim Doyle, Saint Louis Post-Dispatch, November 16, 2010, retrieved December 31, 2021
- ↑ "Remembering Dr. Jai P. Nagarkatti (1947–2010)", Aldrichimica Acta, vol. 43, no. 3 (2010), p. 63, by Dr. Sharbil J. Firsan
- ↑ "Samuel C. Sachs Branch | St. Louis County Library". www.slcl.org (in ఇంగ్లీష్). Archived from the original on 2021-12-31. Retrieved 2021-12-31.
బయటి లింకులు
[మార్చు]- సెయింట్ లూయిస్ పోస్ట్-డిస్పాచ్ నుండి సంస్మరణ, legacy.comలో ఆర్కైవ్
- సెయింట్ లూయిస్ కామర్స్ డాక్టర్ నాగర్కట్టిపై 2008 ప్రొఫైల్
- Gewin, Virginia (2006). "Jai Nagarkatti, president and chief executive, Sigma-Aldrich, St Louis, Missouri". Nature. 441 (7092): 546. doi:10.1038/nj7092-546a. PMID 16786606.