జొన్నలగడ్డ పద్మావతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జొన్నలగడ్డ పద్మావతి
జొన్నలగడ్డ పద్మావతి


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 నుండి 2024
ముందు బి.యామినిబాల
తరువాత బండారు శ్రావణి శ్రీ
నియోజకవర్గం శింగనమల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 18 జూన్ 1979
నెల్లూరు, నెల్లూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు జె. చెన్నకేశవులు, నిర్మలాదేవి
జీవిత భాగస్వామి ఆలూరు సాంబశివారెడ్డి (రాష్ట్ర విద్యా సంస్కరణల కమిటీ సభ్యుడు)[1]
సంతానం విరాట్ ఆలూరు
నివాసం రోటరీపురం, బుక్కరాయసముద్రం, అనంతపురం
వృత్తి రాజకీయ నాయకురాలు

జొన్నలగడ్డ పద్మావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు, సినీ నిర్మాత. ఆమె 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

జొన్నలగడ్డ పద్మావతి 1979లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరులో జె. చెన్నకేశవులు, జె. నిర్మలాదేవి దంపతులకు జన్మించింది. ఆమె అనంతపురం లోని జేఎన్టీయూ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ పూర్తి చేసింది.

రాజకీయ జీవితం

[మార్చు]

జొన్నలగడ్డ పద్మావతి 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా పని చేసింది. ఆమె 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బి.యామినిబాల చేతిలో 4584 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యింది. ఆమె ఓటమి అనంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ‘మేలుకొలుపు’ పేరిట నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించింది.[3] పద్మావతి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ పై 46,242 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీ లోకి అడుగు పెట్టింది.[4]

పద్మావతికి కరోనా కష్టకాలంలో ప్రజల ప్రాణాలను కాపాడుతున్న డాక్టర్ల ప్రాణాలను కాపాడే ఒక నూతన ఆవిష్కరణ చేసినందుకు గాను నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ నిర్వహించిన నూతన ఆవిష్కరణ పోటీల్లో ఆమె రూపొందించిన ఒక ప్రత్యేక క్యాబిన్ కు విశిష్ట గుర్తింపు దక్కింది.[5][6]

మూలాలు

[మార్చు]
  1. The Hans India (1 November 2019). "Singanamala MLA Padmavathi's Husband gets a key post in the Andhra Pradesh govt". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 10 July 2021. Retrieved 10 July 2021.
  2. Sakshi (2019). "Singanamala Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 10 July 2021. Retrieved 10 July 2021.
  3. Sakshi (27 May 2017). "కనికరం లేని ప్రభుత్వం". Sakshi. Archived from the original on 10 July 2021. Retrieved 10 July 2021.
  4. Sakshi (25 May 2019). "ఇక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీదే అధికారం". Sakshi. Archived from the original on 10 July 2021. Retrieved 10 July 2021.
  5. Sakshi (18 July 2020). "ఎమ్మెల్యే పద్మావతి ఆవిష్కరణకు జాతీయ స్థాయి గుర్తింపు". Sakshi. Archived from the original on 10 July 2021. Retrieved 10 July 2021.
  6. The Hindu (19 July 2020). "'Atmospheric moveable cabin' to replace PPEs in hospitals" (in Indian English). Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.