బి.యామినిబాల
బి.యామినిబాల | |||
మాజీ ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 నుండి 2019 | |||
ముందు | సాకే శైలజానాథ్ | ||
---|---|---|---|
తరువాత | జొన్నలగడ్డ పద్మావతి | ||
నియోజకవర్గం | శింగనమల నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1966 గుత్తి , అనంతపురం జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | బాలన్న , పామిడి శమంతకమణి | ||
జీవిత భాగస్వామి | వి. జాలయ్య ప్రసాద్ | ||
సంతానం | సంధ్య | ||
నివాసం | ఏపీ.హెచ్.బి కాలనీ, అనంతపురం | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
బి.యామినిబాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]బి.యామినిబాల 24 జూన్ 1966లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా , గుత్తి లో జన్మించింది. ఆమె శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ నుండి ఏకనమిక్స్ లో డాక్టరేట్ అందుకుంది.
రాజకీయ జీవితం
[మార్చు]బి.యామినిబాల తన తల్లి పామిడి శమంతకమణి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి, 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి పై 4584 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టింది. ఆమె తెలుగుదేశం ప్రభుత్వం లో విప్ గా పని చేసింది. బి.యామినిబాలకు 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి టికెట్ దక్కకపోవడంతో ఆమె 18 మార్చ్ 2020న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరింది.[2]
యామిని బాల 2024లో శింగనమల నియోజకవర్గం వైసీపీ టికెట్‌ను ఆశించగా టికెట్‌ను వీరాంజనేయులుకు కేటాయించడంతో అసంతృప్తిగా ఉన్న ఆమె ఏప్రిల్ 06న వైసీపీ పార్టీకి రాజీనామా చేసింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (14 March 2019). "శింగనమల సీటు..ప్రభుత్వ ఏర్పాటుకు రూటు!". Archived from the original on 10 July 2021. Retrieved 10 July 2021.
- ↑ Sakshi (19 March 2020). "వైఎస్సార్‌సీపీలో చేరిన ఎమ్మెల్సీ శమంతకమణి". Sakshi. Archived from the original on 10 July 2021. Retrieved 10 July 2021.
- ↑ NTV Telugu (6 April 2024). "వైసీపీకి మరోషాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా." Archived from the original on 8 April 2024. Retrieved 8 April 2024.