జో అచ్యుతానంద
Appearance
జో అచ్యుతానంద, ఒక ప్రాచుర్యం పొందిన కీర్తన, జోల పాట. ఈ కీర్తనను అన్నమాచార్యులు రచించారు.
ఈ కీర్తనను ధీరశంకరాభరణం జన్యమైన నవరోజు రాగం, ఖండచాపు తాళం లో గానం చేస్తారు.[1]
కీర్తన
[మార్చు]జోఅచ్యుతానంద జోజో ముకుంద
రావె పరమానంద రామ గోవింద
నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ
నందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ
అంగజుని గన్న మా యన్న యిటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా
దొంగ నీవని సతులు గొంకుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార
హంగుగా తాళ్ళపా కన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల
భారతీయ సంస్కృతి
[మార్చు]- ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి ఈ కీర్తనను చాలా మధురంగా గానం చేశారు.[2]
- ప్రియా సిస్టర్స్ ఈ కీర్తనను "శ్రీ అన్నమయ్య లాహిరి" ఆల్బమ్ లో భాగంగా గానం చేశారు.[3]
- స్వర్గసీమ (1945) సినిమా కోసం ఈ పాటను బి. జయమ్మ గానం చేశారు.
- చిన్నమ్మ కథ (1952) సినిమాలో జో అచ్యుతానంద పాటను పి. లీల గానం చేశారు.
పూర్తి పాఠం
[మార్చు]- వికీసోర్స్ లో జో అచ్యుతానంద పూర్తి కీర్తన.