టచ్ చేసి చూడు
టచ్ చేసి చూడు | |
---|---|
దర్శకత్వం | విక్రమ్ సిరికొండ |
రచన | శ్రీనివాసరెడ్డి రవి రెడ్డి కేశవ్ (సంభాషణలు ) |
స్క్రీన్ ప్లే | విక్రమ్ సిరికొండ దీపక్ రాజ్ |
కథ | వక్కంతం వంశీ |
నిర్మాత | నల్లమలుపు బుజ్జి వల్లభనేని వంశీ మోహన్ |
తారాగణం | రవితేజ, రాశీ ఖన్నా, సీరత్ కపూర్ ఫ్రెడ్డి దారువాలా |
ఛాయాగ్రహణం | రిచర్డ్ ప్రసాద్ ఛోటా కె నాయుడు |
కూర్పు | గౌతం రాజు |
సంగీతం | జామ్ 8 |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 2, 2018 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
టచ్ చేసి చూడు 2018 ఫిబ్రవరి 2న విడుదలైన తెలుగు సినిమా.
కథ
[మార్చు]పాండిచ్చేరిలో నివసించే కార్తికేయ ఇండస్ట్రీస్ అధినేత కార్తికేయ (రవితేజ) కి కుటుంబం అంటే చాలా ప్రేమ. కుంటుంబానికి చెడ్డ పేరు తెచ్చే ఏ పని చేయకూడదని అనుకునే స్వభావం ఉన్న వ్యక్తి. రవితేజ తండ్రి( జయప్రకాష్)కి కొడుకు పెళ్లి చేసుకోవడం లేదనే బాధ ఉంటుంది. తండ్రి బాధను చూడలేక పెళ్లి చేసుకోవాలనుకుంటాడు రవితేజ. అందుకోసం పుష్ప(రాశిఖన్నా)ను పెళ్లి చూపుల్లో చూస్తాడు. ఆడవారితో ఎలా మాట్లాడాలో తెలియని కార్తికేయ, పుష్ప మనసును రెండు సార్లు గాయపరుస్తాడు. దాంతో పుష్ప.. కార్తికేయను పెళ్లి చేసుకోనని చెబుతుంది కానీ ఆమెకు కార్తికేయ అంటే ప్రేమ ఉంటుంది. ఆ ఇష్టం కారణంగానే అతనికి వేరే అమ్మాయితో జరిగే పెళ్లి సంబంధాన్ని కూడా అడ్డుకుంటుంది. ఒకానొక సందర్భంలో ఆ విషయం తెలిసిన కార్తికేయ ఆమెతో పెళ్లిని నిరాకరిస్తాడు. మరోవైపు కార్తీకేయ సంస్థకు వచ్చే యంత్రపరికరాలను సెల్వమ్ అనే గూండా లాక్కెళ్లిపోతాడు. ఈ విషయమై కార్తికేయ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. రెండు నిమిషాల్లో సమస్యను పరిష్కారం చేయవచ్చునని.. కానీ పోలీసులు సమస్యను పట్టించుకోవడం లేదని అంటాడు కార్తికేయ. దాంతో స్థానిక సీఐకి కోపం వస్తుంది. కార్తికేయకు రెండు నిమిషాల సమయం ఇచ్చి సమస్యను తీర్చుకోమంటాడు. కార్తికేయ బలం ఏంటో అక్కడ తెలుస్తుంది. అదే సమయంలో కార్తికేయ సంస్థలో పనిచేసే వ్యక్తి తనయుడు సత్యను ఎవరో హత్య చేస్తారు. ఆ హత్యను కార్తికేయ చెల్లెలు చూసి తన అన్నకు చెబుతుంది. నేరం చేసిన వ్యక్తిని ఇర్ఫాన్ లాలా గా గుర్తిస్తుంది. అప్పటికే చనిపోయిన ఇర్ఫాన్ ఎలా తిరిగి వచ్చాడు? గతంలో కార్తికేయకు, ఇర్ఫాన్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఇర్ఫాన్ చనిపోయాడని కమిషనర్ (మురళీశర్మ) ఎందుకు కార్తికేయకు అబద్ధం చెప్పాడు? ముజఫర్ పేట గొడవలు ఏంటి? అక్కడ లాలా ఎవరు? గతంలో నిశ్చితార్థం వరకు వచ్చిన కార్తికేయ పెళ్లి ఎందుకు ఆగిపోతుంది? అతన్ని అంతగా ఇష్టపడ్డ దివ్య (సీరత్ కపూర్) ఎందుకు అతన్ని వద్దనుకుంటుంది? అనే విషయాలు మిగిలిన కథలో భాగం.
తారాగణం
[మార్చు]- రవితేజ
- రాశి ఖన్నా
- సీరత్ కపూర్
- మురళీ శర్మ
- జయప్రకాష్
- ఫ్రెడ్డీ దారువాలా
- గెటప్ శ్రీను
- శ్రీరంజని (కార్తికేయ తల్లి)
సాంకేతికవర్గం
[మార్చు]- సంగీతం : జామ్ 8
- నేపథ్య సంగీతం : మణిశర్మ
- దర్శకత్వం : విక్రమ్ సిరికొండ
- నిర్మాత : వల్లభనేని వంశీమోహన్, నల్లమలుపు బుజ్జి