టాన్సిలైటిస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టాన్సిలైటిస్
ఇతర పేర్లుస్ట్రెప్ గొంతు
పసుపు ఎక్సుడేట్‌తో కప్పబడిన గొంతు వెనుక భాగంలో పెద్ద టాన్సిల్స్ సముదాయం
విలక్షణమైన టాన్సిలర్ ఎక్సుడేట్ తో స్ట్రెప్టోకోకల్ ఫారింగైటిస్ సంవర్ధనం సానుకూల కేసు
ఉచ్చారణ
ప్రత్యేకతసంక్రమణం వ్యాధులు
లక్షణాలుగొంతు నొప్పి, జ్వరం, టాన్సిల్స్ విస్తరణ, మ్రింగడంలో ఇబ్బంది, మెడ చుట్టూ పెద్ద శోషరస కణుపులు
సంక్లిష్టతలుపెరిటోన్సిలర్ చీము
కాల వ్యవధిఒక వారం
కారణాలువైరల్ సంక్రమణం, బ్యాక్టీరియా సంక్రమణం
రోగనిర్ధారణ పద్ధతిలక్షణాలు, గొంతు శుభ్రముపరచు దూది పుల్లలు (స్వాబ్) లేదా వేగవంతమైన స్ట్రెప్ పరీక్ష (రాపిడ్ స్ట్రెప్ టెస్ట్)
ఔషధంపారాసెటమాల్ (ఎసిటమైనోఫెన్), ఇబుప్రోఫెన్, యాంటీబయాటిక్ మందులు పెన్సిలిన్, సెఫాలోస్పోరిన్స్ లేదా మాక్రోలైడ్‌
తరుచుదనము7.5% మూడునెలలు

టాన్సిలైటిస్ అనేది గొంతులో టాన్సిల్స్ వాపు, సాధారణంగా త్వరగా ప్రారంభమవుతుంది. [1] ఇది ఒక రకమైన ఫారింజైటిస్.[2] లక్షణాలు గొంతు నొప్పి, జ్వరం, టాన్సిల్స్ విస్తరణ, మ్రింగడంలో ఇబ్బంది, మెడ చుట్టూ పెద్ద శోషరస కణుపులు ఉండవచ్చు. [1] సంక్లిష్టతలలో పెరిటోన్సిలర్ చీము కూడా ఉంటుంది.[3]

కారణాలు

[మార్చు]

టాన్సిలైటిస్ సాధారణంగా వైరల్ సంక్రమణం వల్ల వస్తుంది, 5% నుండి 40% కేసులు బ్యాక్టీరియా సంక్రమణం వల్ల సంభవిస్తాయి. [4] [5] ఈ వ్యాధి బాక్టీరియం గ్రూప్ A స్ట్రెప్టోకోకస్ వల్ల ఏర్పడినప్పుడు, దానిని స్ట్రెప్ గొంతు అని పిలుస్తారు. [6] అరుదుగా నీసేరియా, గోనోరియా, కొరినేబాక్టీరియం, డిఫ్తీరియా లేదా హేమోఫిలస్ ఇన్ఫ్లుయంజా వంటి బ్యాక్టీరియా రకాలు కారణం కావచ్చు.[4] సాధారణంగా సంక్రమణం గాలి ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది.[5] సెంటార్ ప్రమాణాలు(సెంటార్ స్కోర్ అంటే గొంతు నొప్పి ఉన్న రోగులలో బ్యాక్టీరియా సంక్రమణ సంభావ్యతను గుర్తించడానికి ఉపయోగించే ప్రమాణాలు) వంటి ప్రమాణాల వ్యవస్థ సాధ్యమైన కారణాలను వేరు చేయడంలో సహాయపడవచ్చు. గొంతు శుభ్రముపరచు దూది పుల్లలు (స్వాబ్) లేదా వేగవంతమైన స్ట్రెప్ పరీక్ష (రాపిడ్ స్ట్రెప్ టెస్ట్) ద్వారా నిర్ధారణ చేయవచ్చు. [4]

చికిత్స

[మార్చు]

చికిత్స వలన రోగ లక్షణాలు తగ్గడము, సంక్లిష్టతలు మెరుగుపడుతాయి. నొప్పి తగ్గడానికి పారాసెటమాల్ (ఎసిటమైనోఫెన్), ఇబుప్రోఫెన్ ఉపయోగించుతారు. స్ట్రెప్ గొంతు ఉన్నట్లయితే, యాంటీబయాటిక్ మందులు పెన్సిలిన్ ను నోటి ద్వారా సాధారణంగా సిఫార్సు చేస్తారు. పెన్సిలిన్‌ మందు వికటించే (అలెర్జీ) లక్షణం ఉన్నవారిలో, సెఫాలోస్పోరిన్స్ లేదా మాక్రోలైడ్‌ మందులను ఉపయోగించవచ్చు. [4] టాన్సిలైటిస్ లక్షణాలు తరచుగా ఉంటున్న పిల్లలలో, టాన్సిల్ తీసివేసే శస్త్రచికిత్స (టాన్సిలెక్టమీ) చేయడం ద్వారా భవిష్యత్తులో తరచూ లక్షణాలు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. [4]

వ్యాధి ప్రాబల్యం

[మార్చు]

సుమారు 7.5% మంది ఏదైనా మూడు నెలల వ్యవధిలో గొంతు నొప్పికి గురవుతుంటారు. 2% మంది వ్యక్తులు ప్రతి సంవత్సరం టాన్సిలైటిస్ సమస్యతో వైద్యుడిని సంప్రదిస్తారు.[7] ఇది పాఠశాల వయస్సు పిల్లలలో సర్వసాధారణం. శీతాకాలంలో ఎక్కువ సంభవిస్తుంది. [4] [5] మెజారిటీ ప్రజలు మందులతోను లేదా లేకుండా కూడా కోలుకుంటారు.[4] 40% మందిలో, ఈ లక్షణాలు మూడు రోజుల్లో తగ్గుతాయి. 80% మందిలో స్ట్రెప్టోకోకస్ ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఒక వారంలోపు తగ్గుతుంది. యాంటీబయాటిక్స్ ఈ వ్యాధి లక్షణాల వ్యవధిని సుమారు 16 గంటలు తగ్గిస్తాయి [8]

ప్రస్తావనలు

[మార్చు]
  1. 1.0 1.1 "Tonsillitis". PubMed Health. Archived from the original on 7 January 2017. Retrieved 30 September 2016.
  2. "Tonsillitis". Archived from the original on 25 March 2016. Retrieved 4 August 2016.
  3. Klug, TE; Rusan, M; Fuursted, K; Ovesen, T (August 2016). "Peritonsillar Abscess: Complication of Acute Tonsillitis or Weber's Glands Infection?". Otolaryngology–Head and Neck Surgery. 155 (2): 199–207. doi:10.1177/0194599816639551. PMID 27026737. Archived from the original on 2021-08-29. Retrieved 2019-12-16. {{cite journal}}: More than one of |accessdate= and |access-date= specified (help); More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 Windfuhr, JP; Toepfner, N; Steffen, G; Waldfahrer, F; Berner, R (April 2016). "Clinical practice guideline: tonsillitis I. Diagnostics and nonsurgical management". European Archives of Oto-Rhino-Laryngology. 273 (4): 973–87. doi:10.1007/s00405-015-3872-6. PMC 7087627. PMID 26755048.
  5. 5.0 5.1 5.2 Lang, Florian (2009). Encyclopedia of Molecular Mechanisms of Disease (in ఇంగ్లీష్). Springer Science & Business Media. p. 2083. ISBN 9783540671367. Archived from the original on 2016-10-02.
  6. Ferri, Fred F. (2015). Ferri's Clinical Advisor 2016: 5 Books in 1 (in ఇంగ్లీష్). Elsevier Health Sciences. p. PA1646. ISBN 9780323378222. Archived from the original on 2016-10-02.
  7. Jones, Roger (2004). Oxford Textbook of Primary Medical Care (in ఇంగ్లీష్). Oxford University Press. p. 674. ISBN 9780198567820. Archived from the original on 2016-08-18.
  8. Spinks, A; Glasziou, PP; Del Mar, CB (5 November 2013). "Antibiotics for sore throat". The Cochrane Database of Systematic Reviews. 11 (11): CD000023. doi:10.1002/14651858.CD000023.pub4. PMC 6457983. PMID 24190439.