టి. చంద్రశేఖర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాటిపర్తి చంద్రశేఖర్

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు ఆదిమూలపు సురేష్
నియోజకవర్గం ఎర్రగొండపాలెం

వ్యక్తిగత వివరాలు

జననం 1980
ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సాఆర్‌సీపీ
తల్లిదండ్రులు హుస్సేన్
జీవిత భాగస్వామి భాగ్యసీమ
సంతానం ఆకాంక్ష, అక్షయ, అభిషిక్త్
నివాసం అయ్యప్ప నగర్, వినుకొండ రోడ్, యర్రగొండపాలెం గ్రామం & మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

తాటిపర్తి చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

తాటిపర్తి చంద్రశేఖర్‌ వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీ బలోపేతానికి కృషి చేసి, తాటిపర్తి చారిటబుల్‌ ట్రస్ట్‌ పేరుతో రోగగ్రస్తులకు, హెచ్‌ఐవీ బాధితులు, వితంతువులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు రక్త శిబిరాలు ఏర్పాటు చేసి,  వేసవి కాలంలో కొండపి నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో మినరల్‌ వాటర్‌ క్యాంపులు ఏర్పాటు చేశాడు. ఆయనను 2024 జనవరి 3న యర్రగొండపాలెం నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌గా నియమితుడయ్యాడు.[4]

టి. చంద్రశేఖర్ 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ఎర్రగొండపాలెం నుండి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబుపై 5200 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (5 June 2024). "కష్టాలను అధిగమించి ప్రత్యర్థితో పోరాడి గెలిచిన తాటిపర్తి". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. BBC News తెలుగు (5 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: వైసీపీ తరఫున గెలిచిన ఆ 11 మంది ఎవరు?". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  3. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  4. Sakshi (3 January 2024). "యర్రగొండపాలెం నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌గా తాటిపర్తి చంద్రశేఖర్‌". Archived from the original on 1 July 2024. Retrieved 1 July 2024. {{cite news}}: no-break space character in |title= at position 26 (help)
  5. Election Commision of India (5 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Yerragondapalem". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.