Jump to content

టి. రాంమోహన్ రెడ్డి

వికీపీడియా నుండి
టి. రాంమోహన్ రెడ్డి
పరిగి శాసనసభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు
In office
2014–2018
అంతకు ముందు వారుకొప్పుల హరీశ్వర్ రెడ్డి
తరువాత వారుకొప్పుల మ‌హేష్ రెడ్డి
వ్యక్తిగత వివరాలు
జననం(1965-06-19)1965 జూన్ 19
శివారెడ్డిపల్లి, దోమ మండలం, వికారాబాదు జిల్లా, తెలంగాణ
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిఉమారాణి
సంతానంఒక కుమారుడు, ఒక కుమార్తె
తల్లిదండ్రులురామకృష్ణారెడ్డి - సుకన్య

టి. రాంమోహన్ రెడ్డి (తమ్మన్నగారి రాంమోహన్ రెడ్డి), తెలంగాణ రాష్ర్టానికి చెందిన రాజకీయ నాయకుడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున పరిగి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

జననం, విద్య

[మార్చు]

రాంమోహన్ రెడ్డి 1965, జూన్ 19న రామకృష్ణారెడ్డి - సుకన్య దంపతులకు తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, దోమ మండలంలోని శివారెడ్డిపల్లిలో జన్మించాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రాంమోహన్ రెడ్డికి ఉమారాణితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

2014లో జరిగిన తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పరిగి శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కొప్పుల హరీశ్వర్ రెడ్డిపై 68,098 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[2] తెలంగాణ తొలి శాసనసభలో కాంగ్రెస్‌ పార్టీ విప్‌గా కూడా పనిచేశాడు.[3] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కొప్పుల మ‌హేష్ రెడ్డి చేతిలో 15,841 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4][5][6]

నిర్వర్తించిన పదవులు

[మార్చు]
  1. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ సెక్రటరీ
  2. సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ జాతీయ బోర్డు మాజీ సభ్యుడు

ఇతర వివరాలు

[మార్చు]

2018లో కానిస్టేబుల్, విఆర్ఓ పరీక్షలకు సిద్ధమవుతున్న తన అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ఉచిత కోచింగ్ మెటీరియల్, మధ్యాహ్న భోజనంతోపాటు ఉచిత కోచింగ్ అందించాడు.[7] 2020లో పోతిరెడ్డిపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనకు పీసీసీ కమిటీకి కన్వీనర్‌ అయ్యాడు.[8] మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలను సందర్శించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Tammannagari Ram Mohan Reddy | MLA | Convenor | Congress | Pargi". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-06-13. Retrieved 2021-12-11.
  2. AuthorTelanganaToday. "Pargi Assembly constituency profile". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-12-10.
  3. "CLP replaces Sampath with Rammohan Reddy as Whip in Assembly, Jana informs Speaker". The Siasat Daily - Archive (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-03-20. Retrieved 2021-12-10.
  4. "Pargi Assembly election Result 2018: TRS' K. Mahesh Reddy wins by 15,841 votes". www.timesnownews.com. Retrieved 2021-12-10.
  5. "K.mahesh Reddy(TRS):Constituency- PARGI(VIKARABAD) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-12-10.
  6. Eenadu (28 October 2023). "కాంగిరేసు అభ్యర్థులు వీరే". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
  7. India, The Hans (2018-06-11). "MLA offers free coaching to unemployed for constable exam". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-12-10.
  8. "Cong. leaders to visit Godavari project sites". The Hindu (in Indian English). Special Correspondent. 2020-06-09. ISSN 0971-751X. Retrieved 2021-12-10.{{cite news}}: CS1 maint: others (link)