టుంగ్రో వైరస్
టుంగ్రో వైరస్ రెండు రకాల వైరస్ ల కలయిక వలన వస్తుంది . అవి:
1.రైస్ టుంగ్రో బాసిల్లిఫామ్ వైరస్
2. రైస్ టుంగ్రో స్పెరికల్ వైరస్
ఇది ప్రధానంగా వరి పంటను ఆశిస్తుంది.[1]
లక్షణాలు
[మార్చు]1.తెగులు సోకిన వరి మొక్కలు కురచగా ఉండి సరిగా ఎదగవు, చాలా తక్కువ పిలకలు పెడతాయి.
2. ఆకులు లేత ఆకుపచ్చ లేక నారింజ రంగులోకి మారతాయి.
3.లేత ఆకులపై తెల్లటి లేక పసుపు వర్ణపు చారలువరి కల్గి ఉంటాయి.
4.తెగులు సోకిన లేత ఆకులు వడలినట్లుగా ఉండును.
5.ముదురు ఆకుల మీద చిన్న చిన్న తుప్పు మచ్చలను గమనించవచ్చును .
6.ఆకులు కురచగా ఉండి లేత ఆకులు బయటకి రాకుండా ఒక దానిలో ఒకటి ఉంటాయి.
7.ముదురు ఆకుల ఈనెలు మందంగా ఉంటాయి.
8.మొక్కల వేర్లు పూర్తిగా వృద్ధి చెందకపోవటము జరుగును.
9. వెన్నులు చిన్నవిగా ఉండి పొల్లు గింజలతో నిండి ఉంటాయి.[2]
వ్యాప్తి
[మార్చు]ఈ తెగులు పచ్చ దీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది . సామాన్యంగా ఈ పచ్చ దీపపు పురుగులు సెప్టెంబర్ రెండో వారం నుండి నవంటు మూలునే వారం వరకు మార్చి , ఏప్రిల్ నెలల్లో ఎక్కువగా ఉంటాయి.
యాజమాన్య పద్ధతులు
[మార్చు]1.తట్టుకున్న రకాలైన MTU9992,1002,1003,1005 , సురక , విక్రమార్య , భరణి , IR36 , వేదగిరి వంటి వాటిని సాగు చేయాలి.
2.ఎగులు ప్రతిసారి క్రమం తప్పకుండ కన్పించే ప్రాంతాలలో వారికి బదులుగా పప్పు ధాన్యపు పంటలను లేక నూనెగింజల పైర్లను సాగు చేయాలి.
3.తెగులు సోకిన మొక్కలను గమనించిన వెంటనే పికి నాశనం చేయాలి.
నివారణ
[మార్చు]సేంద్రియ నివారణ
[మార్చు]1. వావిలకు కషాయాన్ని పిచికారి చేయాలి.
2. కలబంద,తులసి ద్రావణాన్ని పిచికారి చేయాలి.
3. 2 లీ.వేపనూనె ను 25 కిలోల ఇసుకకు కలిపి పొలం లో వేదజల్లాలి.
రసాయన నివారణ
[మార్చు]1. 10 కిలోల కార్బోఫ్యూరాన్ గులికలను ఎకరా పొలం లో వేయాలి.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Viral Zone". ExPASy. Retrieved 15 June 2015.
- ↑ "Genus: Tungrovirus - Caulimoviridae - Reverse Transcribing DNA and RNA Viruses - International Committee on Taxonomy of Viruses (ICTV)". Archived from the original on 2020-12-07. Retrieved 2021-05-20.
- ↑ చీడ పీడల యాజమాన్యం నివారణ పద్దతులు. సేంద్రియ వ్యవసాయం ఏకలవ్య ఫౌండేషన్.