ట్రెవర్ గొడ్దార్డ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్రెవర్ గొడ్దార్డ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ట్రెవర్ లెస్లీ గొడ్దార్డ్
పుట్టిన తేదీ(1931-08-01)1931 ఆగస్టు 1
డర్బన్, నాటల్, యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా
మరణించిన తేదీ2016 నవంబరు 25(2016-11-25) (వయసు 85)
ఫోరీస్‌బర్గ్, దక్షిణాఫ్రికా
ఎత్తు6 అ. 2 అం. (1.88 మీ.)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు1955 9 June - England తో
చివరి టెస్టు1970 19 February - Australia తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test FC LA
మ్యాచ్‌లు 41 179 1
చేసిన పరుగులు 2,516 11,279 20
బ్యాటింగు సగటు 34.46 40.57 20.00
100s/50s 1/18 26/54 0/0
అత్యధిక స్కోరు 112 222 20
వేసిన బంతులు 11,736 40,465 42
వికెట్లు 123 534 0
బౌలింగు సగటు 26.22 21.65
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 5 24
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 1
అత్యుత్తమ బౌలింగు 6/53 6/3
క్యాచ్‌లు/స్టంపింగులు 48/– 175/– 0/–
మూలం: CricketArchive, 2017 3 March

ట్రెవర్ లెస్లీ గొడ్దార్డ్ (1931, ఆగస్టు 1 - 2016, నవంబరు 25) దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ ఆటగాడు. ఆల్ రౌండర్ గా రాణించాడు.[1] దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున 1955 నుండి 1970 వరకు 41 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

1963-64 సీజన్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల ఐదునెలల పర్యటనలో యువ దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌ను సమం చేశాడు. 1964-65లో దక్షిణాఫ్రికాలో ఇంగ్లాండ్‌పై కెప్టెన్‌గా కూడా ఉన్నాడు.

ఎడమచేతి వాటంతో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు.[1] గొడ్దార్డ్ టెస్ట్ స్థాయిలో 123 వికెట్లతో విజయవంతమైన ఎడమచేతి మీడియం-పేస్ బౌలర్ గా కూడా ఉన్నాడు. 75 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన టెస్ట్ బౌలర్లలో, ఓవర్‌కు సగటున 1.64 పరుగులు మాత్రమే ఇచ్చాడు.[2] ఫస్ట్-క్లాస్ స్థాయిలో 40.60 సగటుతో 534 వికెట్లు, 21.65తో 11,000 పరుగులతో ప్రత్యేక విజయాన్ని సాధించాడు.[1] 1952 నుండి 1953 నుండి 1965-66 వరకు నాటల్ కొరకు, 1966-67, 1967-68లో నార్త్-ఈస్ట్రన్ ట్రాన్స్‌వాల్ కొరకు ఆడాడు. ఆ తర్వాత తన చివరి రెండు సీజన్‌లు, 1968-69, 1969-70 కొరకు నాటల్‌కు తిరిగి వచ్చాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ట్రెవర్ లెస్లీ గొడ్దార్డ్ 1931, ఆగస్టు 1న దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జన్మించాడు. ఇతని తండ్రి నాటల్ మెర్క్యురీతో లినోటైప్ ఆపరేటర్.[3] 1946 నుండి 1948 వరకు డర్బన్ హైస్కూల్‌లో మొదటి XIలో ఆడాడు, అనేక సెంచరీలు చేశాడు. ఎడమచేతి ఆర్థోడాక్స్ స్పిన్నర్‌గా చాలా వికెట్లు తీశాడు, తరచుగా హ్యూ తమ్ముడు ఆర్థర్ టేఫీల్డ్‌తో కలిసి బౌలింగ్ చేశాడు.[4] ఆర్థర్ టేఫీల్డ్‌తో పాటు, అతను 1948-49లో సౌత్ ఆఫ్రికా స్కూల్స్ XIలో ఆడాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Player Profile: Trevor Goddard". ESPNcricinfo. Retrieved 21 January 2009.
  2. Wisden Cricketers' Almanack 2012, p.1305.
  3. Short, p. 13.
  4. Short, pp. 16–17.
  5. "Rhodesia v South African Schools 1948–49". CricketArchive. Retrieved 15 December 2016.

బాహ్య లింకులు

[మార్చు]