డయానా ఎడుల్జీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డయానా ఎడుల్జీ
Diana Fram Edulji.jpg
ఐపిఎల్ 12 వ సీజను ఫైనల్లో ఎడుల్జీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు డయానా ఫ్రామ్ ఎడుల్జీ
జననం (1956-01-26) 1956 జనవరి 26 (వయస్సు 65)
Mumbai, Maharashtra, India
బ్యాటింగ్ శైలి కుడి చేతి వాటం
బౌలింగ్ శైలి ఎడమ చేతి స్లో ఆర్థడాక్స్
పాత్ర ఆల్ రౌండరు
International information
టెస్టు అరంగ్రేటం (cap 3) 31 October 1976 v West Indies
చివరి టెస్టు ఫిబ్రవరి 19 1991 v ఆస్ట్రేలియా
ODI debut (cap 6) జనవరి 1 1978 v ఇంగ్లాండు
చివరి వన్డే జూలై 29 1993 v డెన్మార్క్
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI
మ్యాచులు 20 34
చేసిన పరుగులు 404 211
బ్యాటింగ్ సరాసరి 16.16 8.79
100s/50s 0/1 0/0
అత్యధిక స్కోరు 57* 25
బౌలింగ్ చేసిన బంతులు 5098+ 1961
వికెట్లు 63 46
బౌలింగ్ సరాసరి 25.77 16.84
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 1 0
మ్యాచ్ లో 10 వికెట్లు 0 n/a
ఉత్తమ బౌలింగ్ 6/64 4/12
క్యాచులు/స్టంపులు 8/– 9/–
Source: [Cricinfo], 25 April 2020

డయానా ఫ్రామ్ ఎడుల్జీ (జననం 1956 జనవరి 26) మాజీ భారత మహిళా టెస్ట్ క్రికెటర్. [1] ముంబైలో పార్సీ కుటుంబంలో జన్మించిన ఆమె చిన్న వయసులోనే క్రీడలకు ఆకర్షితురాలయింది. ఆమె నివసించిన రైల్వే కాలనీలో టెన్నిస్ బంతితో క్రికెట్ ఆడుతూ పెరిగింది. ఆమె క్రికెట్‌ వైపుకు మళ్ళే ముందు జాతీయ స్థాయి జూనియర్ బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్ ఆడింది. మాజీ టెస్ట్ క్రికెటర్ లాలా అమర్‌నాథ్ నిర్వహించిన క్రికెట్ క్యాంప్‌లో ఆమె తన నైపుణ్యాలను మెరుగుపర్చుకుంది. ఆ సమయంలో భారతదేశంలో మహిళల క్రికెట్ ప్రాచుర్యం పొందుతూ ఉంది. డయానా అప్పుడు రైల్వేలకు, ఆ తరువాత భారత జాతీయ క్రికెట్ జట్టుకూ ఆడింది, ఆమె ఎడమచేతి వాటం స్లో ఆర్థడాక్స్ బౌలర్. ఆమె 1975 లో తన మొదటి సిరీస్ ఆడింది. 1978 లో ఆమెను జట్టుకు కెప్టెన్‌గా నియమించారు. ప్రపంచవ్యాప్తంగా టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన వారిలో ఆమె మూడవ స్థానంలో నిలిచింది. [2]

మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక బంతులు వేసిన బౌలరుగా ఆమె పేరిట రికార్డు (5098 కి పైగా) ఉంది [3]

1983 లో ఆమె భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డును అందుకుంది. 2002 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రదానం చేసింది. [4] 2017 జనవరి 30 న సుప్రీంకోర్టు ఆమెను బిసిసిఐ పరిపాలన ప్యానెల్‌లో నియమించింది. [5]

1986 లో, భారతదేశానికి కెప్టెన్‌గా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నప్పుడు ఎడుల్జీకి లార్డ్స్ పెవిలియన్‌లో ప్రవేశం నిరాకరించారు. అప్పుడామే MCC ( మేరీలెబోన్ క్రికెట్ క్లబ్) పేరును MCP ("మేల్ చావనిస్ట్ పిగ్స్") గా మార్చుకోవాలని ఆమె చురక వేసింది. [6]

మూలాలు[మార్చు]

  1. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
  2. "Records | Women's Test matches | Bowling records | Most wickets in career | ESPNcricinfo". Cricinfo. Archived from the original on 29 November 2018. Retrieved 2018-11-29.
  3. "Records | Women's Test matches | Bowling records | Most balls bowled in career | ESPN Cricinfo". Cricinfo. Archived from the original on 23 March 2019. Retrieved 2017-05-03.
  4. Padma Awards. Ministry of Home Affairs, Government of India: (2015). URL accessed on 21 July 2015.
  5. Diana Edulji, the Cricketer Trusted to Run BCCI. URL accessed on 31 January 2017.
  6. Hopps, David (29 April 2006). Great Cricket Quotes. Robson Books. p. 143. ISBN 978-1861059673.