డయాప్టర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోళాకార డయాప్టర్

డయాప్టర్ అనునది కటకం లేదా గోళాకార దర్పణ సామర్థ్యానికి ప్రమాణం. ఇది కటక లేదా దర్పన నాభ్యాంతరానికి వ్యుత్క్రమం (గుణకార విలోమం) (అంటే, 1 / మీటర్). అనగా ఇది నాభ్యాంతర వ్యుత్క్రమ కొలతకు ప్రమాణం. ఉదాహరణకు మూడు డయాప్టర్ల కటకం గుండా పోయే సమాంతర కాంతి కిరణాలు కటక కేంద్రం నుండి 1/3 మీటర్ల దూరంలో కేంద్రీకరింపబడతాయి. అనగా ఆ కటక నాభ్యాంతరం 1/3 మీటర్లు అవుతుంది. జోహాన్స్ కెప్లర్ వాడిన డయాప్ట్రస్ ఆధారంగా 1872 లో ప్రెంచ్ నేత్రవైద్యుడు ఫెర్డినాండ్ మోనోయర్ ప్రతిపాదించాడు.[1][2] ఆయన మోనోయర్ ఛార్టును రూపొందించాడు.

కటకం మేకర్ సమీకరణం ప్రకారం:

ఇక్కడ

=కటక నాభ్యాంతరము
= కటకం తయారుచేసిన పదార్థ వక్రీభవన గుణకం.
= కాంతి వైపుకు ఉన్న తలమునకు వక్రతా వ్యాసార్థం
= కాంతి కు దూరంగా ఉన్న తలమునకు వక్రతా వ్యాసార్థం
కటకం యొక్క మందం (ప్రధానాక్ష తలంలో రెండు తలముల మధ్య దూరం)
కటకం సమీకరణం

ఈ సమీకరణాన్ని సులువుగా వాడటానికి నాభ్యాంతరం కన్నా, నాభ్యాంతరం యొక్క విలోమాన్ని వాడటం సులవు. అలాగే రెండు కటకాలను పక్క పక్కన ఉంచితే, అవి ఒకే కటకంగా ప్రవర్తిస్తాయి. రెండు కటకాల నాభ్యాంతరాల విలోమపు కూడికే, రెండూ కలిపి తయారయిన కటకపు నాభ్యాంతరం యొక్క విలోమం అవుతుంది.

ఇక్కడ

మొడటి కటకం యొక్క నాభ్యాంతరం
రెండవ కటకం యొక్క నాభ్యాంతరం
రెండు కటకాలు కలిపిన ప్రభావం కల కటకం యొక్క నాభ్యాంతరం

ఈ సమీకరణాన్ని కూడా సులువుగా వాడాలంటే డయాప్టర్ వాడటమే. డయాప్టర్ SI ప్రమాణంలో గుర్తింపబడలేదు. అందుకని అంతర్జాతీయ ప్రమాణాలలో ఇప్పటికీ లెంస్ శక్తిని కొలవటానికి డయాప్టర్ బదులు మీటర్−1ను వాడతారు. కానీ కొన్ని జాతీయ సంస్థలు dpt అని డయాప్టర్ ని వ్యవహరిస్తారు. ఉదాహరణకు DIN.

మూలాలు

[మార్చు]
  1. మొనొయర్ వ్రాసిన ఫ్రెంచ్ పుస్తకం. (1872). "Sur l'introduction du système métrique dans le numérotage des verres de lunettes et sur le choix d'une unité de réfraction". Annales d'Oculistiques (ఫ్రెంచిలో) (పారిస్) 68: 101.
  2. ఆగస్ట్ కొలెన్ బ్రాడర్ వ్రాసిన "Measuring Vision and Vision Loss" (PDF). స్మిత్-కెటిల్ వెల్ ఇన్స్టిట్యూట్ 2009-07-10 నాటి కూర్పు.
"https://te.wikipedia.org/w/index.php?title=డయాప్టర్&oldid=3878363" నుండి వెలికితీశారు