డయోడ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Symbol diode.gif

డయోడ్ ఒక రెండు టర్మినళ్ళు కలిగిన (ద్విశీర్ష) ఎలక్ట్రానిక్ పరికరం. ఇది ఒక దిశలో విద్యుత్ ప్రవాహానికి దాదాపు సున్నా నిరోధం కలిగిఉంటుంది. అలాగే దానికి వ్యతిరేక దిశలో విద్యుత్ ప్రవాహాన్ని దాదాపు పూర్తిగా నిరోధిస్తుంది. సెమి కండక్టర్ (అర్ధవాహకం) డయోడ్లు ఇప్పుడు ఎక్కువగా ఉనికిలో ఉన్నాయి. ప్రస్తుతం డయోడ్లను ఎక్కువగా సిలికాన్ తో తయారు చేస్తున్నారు. కొన్నిసార్లు ఇతర అర్ధవాహక మూలకాలైన సెలీనియం, జర్మేనియం లాంటి వాటిని కూడా ఉపయోగిస్తుంటారు.[1]

ప్రధాన లక్షణాలు[మార్చు]

డయోడు యొక్క ప్రధాన లక్షణాలు ఒక వైపు నుంచి విద్యుత్ ప్రసారాన్ని అనుమతించడం. దీన్నే డయోడు యొక్క ముందు దిశ అనవచ్చు. దానికి వ్యతిరేక దిశలో విద్యత్తును అనుమతించకపోవడం. దీన్ని డయోడు యొక్క వ్యతిరేక దిశ అనవచ్చు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "The Constituents of Semiconductor Components". 2010-05-25. Retrieved 2010-08-06. 
"https://te.wikipedia.org/w/index.php?title=డయోడ్&oldid=1826728" నుండి వెలికితీశారు