Jump to content

డయోడ్

వికీపీడియా నుండి
(డయోడ్లు నుండి దారిమార్పు చెందింది)
సిలికాన్ డయోడ్ దగ్గరి చిత్రం. కుడివైపున ఉన్నది ఆనోడ్; ఎడమవైపున ఉన్నది కాథోడ్ (నల్ల పట్టీతో గుర్తించినది) చతురస్రాకారపు సిలికా పటిక ఆ రెండింటి మధ్యలో ఉంది.

డయోడ్ ఒక రెండు టర్మినళ్ళు కలిగిన (ద్విశీర్ష) ఎలక్ట్రానిక్ పరికరం. ఇది ఒక దిశలో విద్యుత్ ప్రవాహానికి దాదాపు సున్నా నిరోధం కలిగిఉంటుంది. అలాగే దానికి వ్యతిరేక దిశలో విద్యుత్ ప్రవాహాన్ని దాదాపు పూర్తిగా నిరోధిస్తుంది. సెమి కండక్టర్ (అర్ధవాహకం) డయోడ్లు ఇప్పుడు ఎక్కువగా ఉనికిలో ఉన్నాయి. ప్రస్తుతం డయోడ్లను ఎక్కువగా సిలికాన్తో తయారు చేస్తున్నారు. కొన్నిసార్లు ఇతర అర్ధవాహక మూలకాలైన సెలీనియం, జర్మేనియం లాంటి వాటిని కూడా ఉపయోగిస్తుంటారు.[1]

ప్రధాన లక్షణాలు

[మార్చు]

డయోడు యొక్క ప్రధాన లక్షణాలు ఒక వైపు నుంచి విద్యుత్ ప్రసారాన్ని అనుమతించడం. దీన్నే డయోడు యొక్క ముందు దిశ అనవచ్చు. దానికి వ్యతిరేక దిశలో విద్యత్తును అనుమతించకపోవడం. దీన్ని డయోడు యొక్క వ్యతిరేక దిశ అనవచ్చు. కాబట్టి ఈ డయోడును ఏదైనా భౌతిక పదార్థాలను ఒక వైపు మాత్రమే పంపించగల చెక్ వాల్వుతో పోల్చవచ్చు. ఈ లక్షణం వల్లనే డయోడును ఆల్టర్నేట్ కరెంటు (నిర్ణీత సమయానికొకసారి దిశ మార్చుకునే విద్యుత్ ప్రవాహం) ను డైరెక్టు కరెంటు (ఎల్లప్పుడూ ఒకే వైపుగా ప్రవహించే విద్యుత్ ప్రవాహం) గా మార్చడానికి ఉపయోగిస్తారు. అప్పుడు ఇది రెక్టిఫయర్ లా పని చేస్తుంది.

చరిత్ర

[మార్చు]

థర్మియోనిక్ డయోడ్లు (వ్యాక్యూం ట్యూబ్), అర్ధవాహక డయోడ్లు రెండూ వేర్వేరుగా సుమారుగా ఒకే కాలంలో (1900 దశకం) తయారు చేశారు. అప్పట్లో వీటిని రేడియో రిసీవర్ డిటెక్టర్లుగా తయారు చేశారు.[2] 1950ల వరకు, రేడియోలలో వాక్యూమ్ డయోడ్‌లనే తరచుగా ఉపయోగించేవారు. ఎందుకంటే మొదట్లో అర్ధవాహక డయోడ్‌లు తక్కువ స్థిరంగా ఉండేవి. ఇంకా, చాలా రిసీవింగ్ సెట్‌లు యాంప్లిఫికేషన్ కోసం వాక్యూమ్ ట్యూబ్‌లను కలిగి ఉంటాయి. ఆ ట్యూబ్‌లో థర్మియోనిక్ డయోడ్‌లను సులభంగా చేర్చే వీలు ఉండేది (ఉదాహరణకు 12SQ7 డబుల్ డయోడ్ ట్రయోడ్). ఇంకా వాక్యూమ్-ట్యూబ్ రెక్టిఫైయర్‌లు, గ్యాస్-ఫిల్డ్ రెక్టిఫైయర్‌లు ఆ సమయంలో అందుబాటులో ఉన్న సెమీకండక్టర్ డయోడ్‌ల (సెలీనియం రెక్టిఫైయర్ల కంటే మెరుగ్గా కొన్ని అధిక-వోల్టేజ్/హై-కరెంట్ రెక్టిఫికేషన్ పనులను నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "The Constituents of Semiconductor Components". 2010-05-25. Archived from the original on 2016-05-16. Retrieved 2010-08-06.
  2. Guarnieri, M. (2011). "Trailblazers in Solid-State Electronics". IEEE Ind. Electron. M. 5 (4): 46–47. doi:10.1109/MIE.2011.943016. S2CID 45476055.
"https://te.wikipedia.org/w/index.php?title=డయోడ్&oldid=4215563" నుండి వెలికితీశారు