డాక్టర్ పట్టాభి (జీవిత చరిత్ర)
స్వరూపం
డాక్టర్ పట్టాభి (జీవిత చరిత్ర) మల్లాది గారు రచించిన జీవిత చరిత్ర పుస్తకం. ఇది 1946 సంవత్సరంలో కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్సు, రాజమండ్రి వారిచే ముద్రించబడింది.
డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య జీవితచరిత్ర గ్రంథమిది. పట్టాభి సీతారామయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు, సుప్రసిద్ధ రాజనీతివేత్త. ఆయన ఏ పుస్తకాన్ని రిఫర్ చేయకుండా కేవలం తన అపార జ్ఞాపకశక్తిపైనే ఆధారపడి కాంగ్రెసు చరిత్ర రచించారని ప్రతీతి. ఇంత ప్రాచుర్యం కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి జీవితచరిత్ర ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.
- రచయిత : మల్లాది లక్ష్మీ నరసింహ శాస్త్రి
- స్టాకిస్టు: కొండపల్లి వీర వెంకయ్య అండ్ సన్స్, బుక్ సెల్లర్ అండ్ పబ్లిషర్స్, రాజమండ్రి
- ప్రచురణ తేదీ: 15-04-1946
- ప్రకటన కర్త: పసుపులేటి బాపిరాజు, శ్రీ సత్యనారాయణ పబ్లిషింగ్ హౌస్, రాజమండ్రి,1946
- ముద్రణ : శ్రీ శారదా ముద్రణాలయం, భట్నవిల్లి, అమలాపురం తాలూకా, తూర్పు గోదావరి జిల్లా.
మూలాలు
[మార్చు]- ↑ మల్లాది లక్ష్మీనరసింహశాస్త్రి (1946). డాక్టర్ పట్టాభి (జీవిత చరిత్ర).