Jump to content

డి.డబ్ల్యు. గ్రిఫిత్

వికీపీడియా నుండి
డి.డబ్ల్యు. గ్రిఫిత్
డి.డబ్ల్యు. గ్రిఫిత్ (1922)
జననం
డేవిడ్ వార్క్ గ్రిఫిత్

(1875-01-22)1875 జనవరి 22
ఓల్డ్‌హామ్ కౌంటీ, కెంటుకీ, యుఎస్
మరణం1948 జూలై 23(1948-07-23) (వయసు 73)
లాస్ ఏంజిల్స్‌, హాలీవుడ్, కాలిఫోర్నియా, యుఎస్
సమాధి స్థలం
  • మౌంట్ టాబోర్ మెథడిస్ట్ చర్చి స్మశానవాటిక,
  • సెంటర్‌ఫీల్డ్‌, కెంటుకీ, యుఎస్
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1895–1931
జీవిత భాగస్వామి
లిండా అర్విడ్సన్
(m. 1906; div. 1936)
[1]
ఎవెలిన్ బాల్డ్విన్
(m. 1936; div. 1947)
[1]
సంతకం

డేవిడ్ వార్క్ గ్రిఫిత్ (1875, జనవరి 22 - 1948, జూలై 23) అమెరికన్ సినిమా దర్శకుడు, నిర్మాత. సినిమారంగ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా పరిగణించబడ్డాడు.[2] సినిమా ఎడిటింగ్[3] విషయంలో అనేక అంశాలకు మార్గదర్శకత్వం వహించాడు, కథన చిత్రం (నరేటీవ్ ఫిల్మ్) కళను విస్తరించాడు.[4]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు ప్రకారం, గ్రిఫిత్ 1908 నుండి 1931 వరకు దాదాపు 518 సినిమాలకు దర్శకత్వం వహించాడు.

జననం

[మార్చు]

గ్రిఫిత్ 1875, జనవరి 22న[5] కెంటుకీలోని ఓల్డ్‌హామ్ కౌంటీలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో జన్మించాడు. తండ్రి జాకబ్ వార్క్ "రోరింగ్ జేక్" గ్రిఫిత్,[6] అమెరికన్ సివిల్ వార్‌లో కాన్ఫెడరేట్ ఆర్మీ కల్నల్, కెంటుకీగా ఎన్నికయ్యాడు. తల్లి మేరీ పెర్కిన్స్ (నీ ఓగ్లెస్బీ) రాష్ట్ర శాసనసభ్యురాలు.[5] గ్రిఫిత్ ఒక మెథడిస్ట్‌గా పెరిగాడు,[7] గ్రిఫిత్ 10 సంవత్సరాల వయస్సులో తండ్రి మరణించాడు, కుటుంబం పేదరికంలో గడిచింది.

సినిమారంగం

[మార్చు]

1915లో వచ్చిన ది బర్త్ ఆఫ్ ఎ నేషన్ అనే సినిమాకు దర్శకత్వం వహించి, గ్రిఫిత్ ఆధునిక ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఈ సినిమా ఆర్థికంగా అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచి, నిర్మాతలకు అపారమైన లాభాలను తెచ్చిపెట్టింది.1916లో ఇన్ టోలరెన్స్ అనే సినిమాను తీశాడు.

గ్రిఫిత్ 1919లో చార్లీ చాప్లిన్, మేరీ పిక్‌ఫోర్డ్, డగ్లస్ ఫెయిర్‌బ్యాంక్స్‌లతో కలిసి యునైటెడ్ ఆర్టిస్ట్స్ అనే స్టూడియోను స్థాపించాడు. 1919లో బ్రోకెన్ బ్లాసమ్స్, 1920లో వే డౌన్ ఈస్ట్, 1921లోఆర్ఫన్స్ ఆఫ్ ది స్టార్మ్, 1931లో ది స్ట్రగుల్ సినిమాలు తీశాడు.

విమర్శలు ఉన్నప్పటికీ, తన జీవితంలో విస్తృతంగా గుర్తింపు పొందాడు. సినిమా నిర్మాణంలో గ్రిఫిత్ చేసిన కృషిని ఆధునిక సినిమా చరిత్రకారులు ఎల్లప్పుడూ గుర్తిస్తూనే ఉన్నారు.

ది బర్త్ ఆఫ్ ఎ నేషన్ (1915) సెట్‌లో గ్రిఫిత్, నటుడు హెన్రీ బి. వాల్తాల్, ఇతరులతో

మరణం

[మార్చు]

గ్రిఫిత్ 1948, జూలై 23న ఉదయం లాస్ ఏంజిల్స్‌లోని నికర్‌బాకర్ హోటల్‌లోని లాబీలో అపస్మారక స్థితిలో ఉండగా, హాలీవుడ్ ఆసుపత్రికి తరలించే మార్గంలో మధ్యాహ్నం 3:42 గంటలకు సెరిబ్రల్ హెమరేజ్‌తో మరణించాడు.[8]

హాలీవుడ్ మసోనిక్ టెంపుల్‌లో ఆయన గౌరవార్థం పబ్లిక్ స్మారక సేవ జరిగింది. అతను కెంటుకీలోని సెంటర్‌ఫీల్డ్‌లోని మౌంట్ టాబోర్ మెథడిస్ట్ చర్చి స్మశానవాటికలో ఖననం చేయబడ్డాడు.[9] 1950లో, డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అతని సమాధి స్థలం కోసం ఒక రాయి, కాంస్య స్మారక చిహ్నాన్ని అందించింది.[10]

నటుడు, దర్శకుడు చార్లీ చాప్లిన్ గ్రిఫిత్‌ను "మనందరికీ గురువు" అని పిలిచాడు. ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్,[11] లెవ్ కులేషోవ్,[12] జీన్ రెనోయిర్,[13] సెసిల్ బి. డిమిల్లె,[14] కింగ్ విడోర్,[15] విక్టర్ ఫ్లెమింగ్,[16] రౌల్ వాల్ష్,[17] కార్ల్ థియోడర్ డ్రేయర్,[18] సెర్గీ ఐసెన్‌స్టెయిన్,[19] స్టాన్లీ కుబ్రిక్ వంటి ఫిలింమేకర్స్ గ్రిఫిత్‌ను ప్రశంసించారు.

సినిమాల పరిరక్షణ

[మార్చు]

"సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా లేదా సౌందర్యపరంగా ముఖ్యమైనవి"గా పరిగణించబడిన గ్రిఫిత్ ఆరు సినిమాలు లేడీ హెలెన్స్ ఎస్కేడ్, ఎ కార్నర్ ఇన్ వీట్ (రెండూ 1909), ది మస్కటీర్స్ ఆఫ్ పిగ్ అల్లే (1912), ది బర్త్ ఆఫ్ ఎ నేషన్ (1915), అఇన్ టోలరెన్స్ (1916), బ్రోకెన్ బ్లాసమ్స్ (1919) మొదలైనవి యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీలో ఉంచబడ్డాయి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 UPI (July 23, 1948) "D.W. Griffith, 73, film pioneer, dies". United Press. Retrieved 2023-06-04.
  2. D.W. Griffith.
  3. "Changes in Film Style in the 1910s | wcftr.commarts.wisc.edu". Archived from the original on November 21, 2021. Retrieved 2023-06-04.
  4. "The Beginnings of Film Narrative" (PDF). University of California Press. Retrieved 2023-06-04.
  5. 5.0 5.1 Kenneth, Dennis (2001). "Griffith, David Wark". In Kleber, John E. (ed.). The Encyclopedia of Louisville. Lexington, Ky.: University Press of Kentucky. p. 359. ISBN 9780813121000.
  6. "D.W. Griffith (1875–1948)". Archived from the original on 2017-11-08. Retrieved 2023-06-04.
  7. Blizek, William L. (2009). The Continuum Companion to Religion and Film. A&C Black. p. 126. ISBN 978-0-8264-9991-2.
  8. "DAVID W. GRIFFITH, FILM PIONEER, DIES; Producer of 'Birth of Nation,' 'Intolerance' and 'America' Made Nearly 500 Pictures SET, SCREEN STANDARDS Co-Founder of United Artists Gave Mary Pickford and Fairbanks Their Starts". The New York Times. 24 July 1948. మూస:ProQuest.
  9. Schickel, Richard (1996). D.W. Griffith: An American Life. Hal Leonard Corporation. p. 31. ISBN 0-87910-080-X.
  10. Schickel, Richard (1996). D.W. Griffith: An American Life. Hal Leonard Corporation. p. 605. ISBN 0-87910-080-X.
  11. Leitch, Thomas; Poague, Leland (2011). A Companion to Alfred Hitchcock. John Wiley & Sons. p. 50. ISBN 978-1-4443-9731-4.
  12. "Landmarks of Early Soviet Film". Archived from the original on April 23, 2012. Retrieved 2023-06-04.
  13. "Jean Renoir Biography". biography.yourdictionary.com. Retrieved 2023-06-04.
  14. "Movie Review: Restored 'Intolerance' Launches Festival of Preservation". Los Angeles Times. July 6, 1990. Retrieved 2023-06-04.
  15. "Overview for King Vidor". tcm.com. Retrieved October 18, 2012.
  16. "Victor Fleming: An American Movie Master". Archived from the original on September 14, 2013. Retrieved 2023-06-04.
  17. Moss, Marilyn (2011). Raoul Walsh: The True Adventures of Hollywood's Legendary Director. University Press of Kentucky. pp. 181, 242. ISBN 978-0-8131-3394-2.
  18. "Matinee Classics – Carl Dreyer Biography & Filmography". matineeclassics.com. Archived from the original on December 15, 2013. Retrieved 2023-06-04.
  19. "Sergei Eisenstein – Biography". leninimports.com. Retrieved 2023-06-04.

బయటి లింకులు

[మార్చు]