డి.డి.ఇటాలియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దిన్షా దాదాభాయి ఇటాలియా హైదరాబాదుకు చెందిన ప్రముఖ పార్సీ వ్యాపారవేత్త, రాజ్యసభ సభ్యుడు. దిన్షా ఇటాలియా 1882, మార్చి 10న అప్పటి బొంబాయి ప్రెసిడెన్సీలోని సూరత్ జిల్లాకు చెందిన ఛిక్లీలో జన్మించాడు.[1] ఈయన తండ్రి దాదాభాయి ఇటాలియా నిజాం పరిపాలనలోని హైదరాబాదు రాజ్యంలో స్థిరపడిన వ్యాపారస్తుడు. దిన్షా ఇటాలియా విద్యాభ్యాసం నిజాం కళాశాలలో సాగింది.[1] ఈయన భార్య బాయిమాయి దేభర్ ను 1904 ఫిబ్రవరి 19న వివాహం చేసుకున్నాడు.[2] ఈయనకు ఒక కుమారుడు, ఆరుగురు కుమార్తెలు.[3]

దిన్షా ఇటాలియా, తన తండ్రి స్మారకార్ధం సూరత్ జిల్లాలో దాదాభాయి ఇటాలియా సార్వజనీక ఉన్నత పాఠశాలను, దాదాభాయి ఇటాలియా కన్యా శీలను ప్రారంభించాడు. అలాగే వరంగల్ ఒక ప్రసూతి ఆసుపత్రిని, నిజామాబాదులో టౌన్‌హాలును, డిచ్‌పల్లి కుష్టువ్యాధి ఆసుపత్రిలో ప్రత్యేక విభాగాన్ని, జహీరాబాదు కుష్టువ్యాధిగ్రస్తుల కాలనీలో మూడు కుటీరాలను కూడా నిర్మించాడు. ఈయన దక్కన్ చేంబర్ ఆఫ్ కామర్స్ కు ఐదు సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పనిచేశాడు. హైదరాబాదు నగరపాలికలో ఐదేళ్లు సభ్యుడిగా పనిచేశాడు.[2]

దిన్షా ఇటాలియా హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. 1952, ఏప్రిల్ 3 నుండి 1956 ఏప్రిల్ 2 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఈయన 1964, సెప్టెంబరు 7న మరణించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Parliament of India - Rajyasabha ho's Who. New Delhi: Rajyasabha Secretariat. 1955. p. 81. Retrieved 29 December 2014.
  2. 2.0 2.1 Who_is_who_1952_rajya_sabha. Rajya Sabha. pp. 69–70. Retrieved 2 September 2024.
  3. 3.0 3.1 "Rajya Sabha Members Profiles" (PDF). rajyasabha.nic.in. Retrieved 29 December 2014.