Jump to content

సూరత్ జిల్లా

అక్షాంశ రేఖాంశాలు: 21°10′0″N 72°50′0″E / 21.16667°N 72.83333°E / 21.16667; 72.83333
వికీపీడియా నుండి
  ?సూరత్
గుజరాత్ • భారతదేశం
మారుపేరు: Diamond City / Textile City
అక్షాంశరేఖాంశాలు: 21°10′0″N 72°50′0″E / 21.16667°N 72.83333°E / 21.16667; 72.83333
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
తీరం
326.515 కి.మీ² (126 sq mi)
• 13 మీ (43 అడుగులు)
• 70 km (43 mi)
దూరాలు
Ahmedabad నుండి
ముంబై నుండి
Pune నుండి

• 280 కి.మీలు NW (land)
• 260 కి.మీలు (land)
• 362 కి.మీలు SE (land]nd)
సమీప నగరం ముంబై
జిల్లా (లు) సూరత్ జిల్లా
జనాభా
జనసాంద్రత
ఆడ-మగ నిష్పత్తి
అక్షరాస్యత శాతం
53,74,429 (2009 నాటికి)
• 16,460/కి.మీ² (42,631/చ.మై)
• 810/1000 males
• 82.01%
అధికార భాష హిందీ, గుజరాతీ, ఆంగ్లం
మేయర్ Ranjit Gilitwala
Municipal Commissioner S.Aparna
Established 1679
పురపాలక సంఘం సూరత్ మునిసిపల్ కార్పొరేషన్
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 395 XXX
• +0261
• GJ5(Surat)
వెబ్‌సైటు: www.suratmunicipal.gov.in


వేసు, సూరత్‌లోని అపార్ట్‌మెంట్‌లు
సూరత్ లో ప్రవేశిస్తున్న అక్బర్

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో సూరత్ జిల్లా ఒకటి. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 6,079,231. వీరిలో 79.68% మంది నగరాలలో నివసిస్తున్నారు. 2011 గణాంకాలను అనుసరించి గుజరాత్ రాష్ట్ర జిల్లాలలో సూరత్ జిల్లా అత్యంత అధిక అభివృద్ధి చెందిన జిల్లాలలో రెండవదిగా గుర్తించబడింది.2007 అక్టోబరు 2 న సూరత్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి తపి జిల్లా రూపొందించబడింది. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం. 2011 గణాంకాలను అనుసరించి గుజరాత్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా సూరత్ జిల్లా అత్యంత అధిక జనసంఖ్య కలిగిన జిల్లాలలో రెండవదిగా గుర్తించబడింది. మొదటి స్థానంలో అహమ్మదాబాదు జిల్లా ఉంది. .[1]

సరిహద్దులు

[మార్చు]

సూరత్ జిల్లా ఉత్తర సరిహద్దులో భారూచ్ జిల్లా, నర్మదా (గుజరాత్), దక్షిణ సరిహద్దులో నవ్‌సారి జిల్లా, తూర్పు సరిహద్దులో తపి జిల్లా, పశ్చిమ సరిహద్దులో గల్ఫ్‌ ఆఫ్ కాంబియాలు ఉన్నాయి.

పట్టణం

[మార్చు]

సూరత్ గుజరాత్ రాష్ట్రము లోని ప్రముఖ వాణిజ్య నగరం, సూరత్ జిల్లా ప్రధానకేంద్రం. భారతదేశంలో అతివేగంగా పెరుగుచున్న నగరాలలో ఇది ఒకటి. 2001 నుండి పద సంవత్సరాలలో జనాభా రెట్టింపు అయింది. రాష్ట్ర రాజధాని గాంధీనగర్కు దక్షిణమున 306 కిమీ దూరంలో తపతి నది ఒడ్డున ఉంది. వస్త్రపరిశ్రమకు, వజ్రాల పరిశ్రమకు ఈ నగరం ప్రఖ్యాతి చెందినది. భారతదేశపు 92% వజ్రాల కటింగ్, పాలిషింగ్ ఈ నగరములోనే జరుగుతుంది. మొఘల కాలం నుంచి సూరత్ రేవుపట్టణంగా ఉంది. 1608లో బ్రిటీష్ వారు ఇక్కడ తమ వర్తక స్థావరాన్ని ఏర్పాటుచేసుకున్నారు.

భౌగోళికం

[మార్చు]

2011 గణాంకాలను అనుసరించి సూరత్ జిల్లా వైశాల్యం 4,418 చ.కి.మీ. జనసాంధ్రత చ.కిమీ 1,376.

వాతావరణం

[మార్చు]
శీతోష్ణస్థితి డేటా - Surat, Gujarat (1932-1980)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
Source 1: Sistema de Clasificación Bioclimática Mundial[2]
Source 2: World Climate Guide (sunshine only)[3]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 6,079,231,[1]
ఇది దాదాపు. ఇ.ఎల్. సాల్వేడర్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. మిస్సోరీ రాష్ట్ర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 12వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 1376 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 42.19%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 788:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 86.5%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

సంస్కృతి

[మార్చు]

జిల్లాలో ముహమ్మద్ బీన్ తుగ్లక్ నిర్మించిన కోట, ఉనై ఉష్ణగుండం, ఉభారత్, తితల్ వద్ద ఉన్న అందమైన సముద్రతీరాలు, దండి, బార్డోలి గ్రామాలు, దండి యాత్ర మొదలైన పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. సూరత్‌లో ఉన్న వంసదా వేషనల్ పార్క్‌లో అడవి పందులు, చిరుతలు, పులులు, పాంథర్‌లు ఉన్నాయి..[6]

సుప్రసిద్ధ వ్యక్తులు

[మార్చు]
  • నర్మదషంకర్ డేవ్ (1833-1886) రచయిత, కవి, పండితుడు, వక్త. సూరత్ లో జన్మించారు.
  • నవల్రం (1836-1888) రచయిత, సాహిత్య విమర్శకుడు. సూరత్‌లో జన్మించారు.
  • రంజిత్రం మెహతా (1881-1917) రచయిత. సూరత్ లో జన్మించారు.
  • గున్వంత్ షా (1937-) రచయిత. రాందెర్‌లో జన్మించాడు..[7]

ఇవికూడా చూడండి

[మార్చు]

సరిహద్దు ప్రాంతాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. "INDIA - SURAT". Centro de Investigaciones Fitosociológicas. Retrieved 2011-09-24.
  3. "Surat Climate Guide". World Climate Guide. Retrieved 2011-09-24.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. El Salvador 6,071,774 July 2011 est.
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Missouri 5,988,927
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-25. Retrieved 2014-11-13.
  7. {{Basic Information about Gunvant Shah}}

వెలుపలి లింకులు

[మార్చు]