Jump to content

ఖేడా

అక్షాంశ రేఖాంశాలు: 22°45′N 72°41′E / 22.75°N 72.68°E / 22.75; 72.68
వికీపీడియా నుండి
Kheda
City
Kheda is located in Gujarat
Kheda
Kheda
Kheda is located in India
Kheda
Kheda
Coordinates: 22°45′N 72°41′E / 22.75°N 72.68°E / 22.75; 72.68
Country India
రాష్ట్రంగుజరాత్
జిల్లాKheda
Elevation
21 మీ (69 అ.)
జనాభా
 (2011)
 • Total1,02,587
Languages
 • OfficialGujarati, Hindi, English
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
Vehicle registrationGJ-07

ఖేడా, కైరా అని కూడా పిలుస్తారు.ఇది భారతదేశం, గుజరాత్ రాష్ట్రం, ఖేడా జిల్లా లోని ఒక నగరం,అదే జిల్లాకు ముఖ్యపట్టణం.దీనికి పురపాలక సంఘం హోదా ఉన్న పట్టణం.భారతదేశపు మొదటి ఉపప్రధాని వల్లభాయ్ పటేల్ గుజరాత్ రాష్ట్రంలోని ఖేడా జిల్లాలో జన్మించాడు.ఖేడా నగరం ఒకప్పుడు పొగాకు పంటకు ప్రసిద్ధి చెందింది.సమీప రైల్వే స్టేషన్ మహేమదవద్ ఖేడా రోడ్. సమీప విమానాశ్రయం అహ్మదాబాద్ విమానాశ్రయం.నగరంలో గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థకు చెందిన బస్సు స్టాండ్ ఉంది.

చరిత్ర

[మార్చు]

ఖేడా అనే పేరు సంస్కృత పదం క్షేత్రం నుండి ఉద్భవించింది. ఖేటక పురాతన సాహిత్యంలో ఈ ప్రదేశం చుట్టూ ఉన్న ప్రాంతం పేరుగా ఉపయోగించబడింది.ఇది సా.శ. 12 నుండి సా.శ. 17వ శతాబ్దం వరకు ఉన్న పట్టణంగా పేర్కొనబడింది.గణపత (2వ శతాబ్దం సా.శ.పూ. నాటిది), పాణిని వ్యాకరణం ఐదు సంపుటాలలోని ఒకదానిలో ఖేటక ప్రాంతం పేరును పేర్కొనబడింది.పద్మపురాణంలోని 133వ అధ్యాయంలో దివ్యనగరంగా పేర్కొనబడింది.మైత్రక రాజవంశం సా.శ. 7వ - 8వ శతాబ్దపు రాగి-ఫలకాలు ఖేటకను ఒక పరిపాలనా విభాగంగా పేర్కొన్నాయి, అలాగే ఇతర రాగి-ఫలకాలలో దీనిని బ్రాహ్మణ నివాస స్థలంగా, రాష్ట్రకూట - నియంత్రిత పట్టణంగా పేర్కొనబడ్డాయి.ఆ పరిపాలనా విభాగం కింద దాదాపు 750 గ్రామాలు ఉండేవి.ఇది దశకుమారచరితలో నింబవతి కథ, ఆచరాంగ సూత్రం,మేరుతుంగ ప్రబంధచింతామణి (సా.శ.1305), పురాతన-ప్రబంధ-సంగ్రహ (15వ శతాబ్దానికి ముందు,బహుళ రచయితలు) జినప్రభ వివిధ-తీర్థ-కల్ప (1332)లో కూడా ప్రస్తావించబడింది.[1]

ఇది 10వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం ప్రారంభం వరకు చౌళుక్య, వాఘేలా రాజవంశాల క్రింద ఉంది.అది గుజరాత్ సుల్తానేట్ కిందకు తీసుకురాబడింది.[1] ఖేడా పట్టణం పద్దెనిమిదవ శతాబ్దం ప్రారంభంలో బాబీ రాజవంశం ( పష్టూన్ సంతతికి చెందింది) కిందకు వెళ్లింది.ఇది దామాజీరావు గైక్వాడ్ ఆధ్వర్యంలో సా.శ. 1763 వరకు మరాఠాల స్వాధీనంలో ఉంది.మహ్మద్ ఖాన్ బాబీ దాని కోటను నిర్మించాడు.[1] ఆనందరావు గైక్వాడ్ ఆధ్వర్యంలోని మరాఠాలు 1803లో ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి అప్పగించారు.ఇది బ్రిటిష్ ఇండియాలోని బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైంది.[1] సా.శ.1830 వరకు ఖేడా పెద్ద సైనిక నిలయంగా ఉంది.తరువాత కంటోన్మెంట్ దీసాకు తొలగించబడింది.జాట్‌లు,ఇతర సమూహాల మాదిరిగానే బ్రాహ్మణులు ఖేడా జిల్లా ప్రాంతంలో అనేక గ్రామాలను స్థాపించారు.

మహాత్మా గాంధీ మార్చి 1919 నుండి, కరువు సమయంలో బ్రిటిష్ వారి అణచివేత పన్నులకు వ్యతిరేకంగా ఖేడా ప్రాంతంలో సత్యాగ్రహ పోరాటాన్ని ప్రారంభించాడు. ఖేడాను పాలించిన బాబీ కుటుంబం ఖంబత్‌కు మారింది.ఇప్పుడు ఆ కుటుంబంలో ఎక్కువ మంది అహ్మదాబాద్‌లో నివసిస్తున్నారు.

సందర్శన స్థలాలు

[మార్చు]

ఖేడా నగరం, సమీపంలో సందర్శించడానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఖేడాలో మెల్ది మాత ఆలయం ఉంది.ఇది ఫిబ్రవరిలో వార్షిక జాతరను నిర్వహిస్తుంది.ఈ కార్యక్రమం తిలకించటం కోసం దాదాపు 10,0,000 మంది ప్రజలు ఖేడాను సందర్శిస్తారు.ఇంకా నగరంలో మహాలక్ష్మీ మాతా మందిరం, ఖెడియా హనుమాన్, మంకమేశ్వర్ మహాదేవ్, సోమనాథ్ ఆలయం, జైన దేవాలయాలు హవేలీ చూడదగిన ప్రదేశాలు. హవేలీకి దీనికి 250 సంవత్సరాల చరిత్ర ఉంది.[1] భిద్భంజన్ అమిజారా జైన్ మోటా దేరాసర్ ఒక పురాతన జైన తీర్థం. దీనిని చాలా మంది సందర్శిస్తారు. ఖేడా విఠల్‌పురా గ్రామం పక్కనే సిద్ధనాథ్ మహాదేవ్ ఆలయం ఉంది.

రవాణా

[మార్చు]

ఖేడా నగరం, అహ్మదాబాద్ నుండి 35 కిలోమీటర్లు (22 మై.) దూరంలో ఉంది. అహ్మదాబాద్ ముంబైలను కలిపే జాతీయ రహదారి నెం. 48 (అధికారికంగా జాతీయ రహదారి 8) ఖేడా నగరంలో గుండా వెళుతుంది.సమీప రైల్వే స్టేషన్ మహేమదవద్ ఖేడా రోడ్ లో ఉంది. అన్ని రకాల రాష్ట్ర బస్సులు, స్థానిక రవాణా సంస్థల వాహనాలు అందుబాటులో ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 Rajgor, Shivprasad (1993). Thaker, Dhirubhai (ed.). ગુજરાતી વિશ્વકોશ [Gujarati Encyclopedia] (in గుజరాతి). Vol. V. Ahmedabad: Gujarati Vishwakosh Trust, Ahmedabad. pp. 846–847. OCLC 164915270. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":GVK" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఖేడా&oldid=3929941" నుండి వెలికితీశారు