Jump to content

జంఖంభాలియా

అక్షాంశ రేఖాంశాలు: 22°12′N 69°39′E / 22.200°N 69.650°E / 22.200; 69.650
వికీపీడియా నుండి
Jamkhambhaliya
Khambhalia
Clock Tower, Jamkhambhaliya
Clock Tower, Jamkhambhaliya
Nickname: 
Khambhalia
Jamkhambhaliya is located in Gujarat
Jamkhambhaliya
Jamkhambhaliya
Location in Gujarat, India
Coordinates: 22°12′N 69°39′E / 22.200°N 69.650°E / 22.200; 69.650
Country India
రాష్ట్రంగుజరాత్
జిల్లాDevbhoomi Dwarka district
Government
 • TypeCivic body
 • BodyNagar Palika
జనాభా
 (2011)
 • Total1,00,000
Languages
 • OfficialGujarati, Hindi,Sindhi
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
పిన్ కోడ్
361305
STD Code02833-XXXXXX
Vehicle registrationGJ 37

జంఖంభాలియా, ఖంభాలియా అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని గుజరాత్‌ రాష్ట్రం, దేవ్‌భూమి ద్వారక జిల్లా లోని పట్టణం. పురపాలకసంఘం హోదా ఉన్న పట్టణం. ద్వారక జిల్లా ప్రధాన కార్యాలయం, జిల్లాలో అతిపెద్ద పట్టణం.[1] జంఖంభాలియా స్వచ్ఛమైన నెయ్యి నాణ్యతకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

చరిత్ర

[మార్చు]
ద్వారకా ద్వారం
హజం పాడ సమీపంలో ఉన్న ప్రభుత్వ తాలూకా గ్రంథాలయం

ఖంభాలియా పురాతన పట్టణం. ఈ ప్రాంతం వాఘేలా వంశం పాలించింది. నవానగర్‌కు చెందిన జామ్ షాహిబ్ దానిని వారి నుండి స్వాధీనం చేసుకున్నాడు. నవనగర్ మొఘల్ పాలనలో ఉన్నప్పుడు ఇది నవానగర్ రాష్ట్రానికి రాజధానిగా పనిచేసింది.పాత పట్టణం పటిష్టంగా ఉంది. అంతరాలలో బురుజులు ఉన్నాయి. ఇది 2000 సంవత్సరం నాటికి సుమారు 350 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని నమ్ముతారు.[2] నగరంలో నగర్ గేట్, పోర్ గేట్, జోధ్‌పూర్ గేట్, సలయ గేట్, ద్వారకా గేట్ అనే ఐదు ప్రధాన ద్వారాలు ఉన్నాయి.

పట్టణం లోని పురాతన దేవాలయాలలో రామనాథ్ ఆలయం , కామనాథ్ ఆలయం , ఆశాపురి మాతా ఆలయం, కళ్యాణ్ రాజాజీ ఆలయం , జడేశ్వర్ మహాదేవ్ ఆలయాలు ఉన్నాయి. ఇతర ముఖ్యమైన మత స్థలాలు మహాప్రభు బేతక్, అజ్మీర్ పీర్ దర్గా ఉన్నాయి.[2]

భౌగోళికం

[మార్చు]

ఖంభాలియా రైజింగ్ ప్రాంతంలో ఉంది. ఈ పట్టణం నెయ్యి, తేలి నదుల ఒడ్డున ఉంది.[2]

సంస్కృతి

[మార్చు]

నది ఒడ్డున ఉన్న రామనాథ్ ఆలయానికి సమీపంలో, శ్రావణ మాసం చివరి మూడు రోజులలో శిరుసరస్సు వద్ద వార్షికజాతర జరుగుతుంది.

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

ఖంభాలియా ఇనుప పరికరాల తయారీ పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. గుజరాత్ ఎస్సార్ పవర్ యాజమాన్యంలోని పవర్‌హౌస్ 2011లో స్థాపించబడింది.పట్టణ సమీపంలో అనేక చమురు మిల్లులు ఉన్నాయి. ఐవరీ గాజుల తయారీ పరిశ్రమ, నేత వస్త్రాలు తయారీ పరిశ్రమ ప్రధాన హస్తకళలు. నెయ్యి, పత్తి గింజలు, వేరుశెనగలు ప్రధాన వాణిజ్య వస్తువులు. ఎస్సార్ ఆయిల్ రిఫైనరీ, రిలయన్స్ రిఫైనరీ అనే ప్రధాన పెట్రోలియం శుద్ధి కర్మాగారాలు పట్టణానికి సమీపంలో ఉన్నాయి .[2]

ప్రభుత్వ ఆసుపత్రి, పట్టణంలో అనేక పాఠశాలలు, పశువైద్యశాల, ప్రభుత్వ గ్రంథాలయం ఉన్నాయి.[2]

అనుసంధానం

[మార్చు]

ఖంభాలియా రైల్వే స్టేషన్ విరామ్‌గం-ఓఖా బ్రాడ్ గేజ్ లైన్‌లో ఉంది. దాని నుండి సలయ నౌకాశ్రయానికి ఒక శాఖ లైన్ ఉంది. ఈ పట్టణం గుజరాత్‌లోని అన్ని ప్రధాన నగరాలకు గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా అనుసంధానం ఉంది.[2]

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Jamkhambhaliya", Gujarat Updates
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 Gujarat (1970). Gazetteers: Jamnagar District. Directorate of Government Print., Stationery and Publications. p. 267.

వెలుపలి లంకెలు

[మార్చు]