Jump to content

ఖేడా జిల్లా

వికీపీడియా నుండి
Districts of central Gujarat

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో ఖేడా జిల్లా (గుజరాత్: ખેડા જિલ્લો) ఒకటి. నాడియా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.

డాకోర్ కృష్ణ దేవాలయం

2011 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,298,934, [1]
ఇది దాదాపు. లత్వియా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 197వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 197 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 12.81%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 957:1000, [1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 84.31%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

సంస్కృతి

[మార్చు]

డాకర్ డాకొర్‌లో " రణచోర్ క్రిష్ణ " ఆలయం ఉంది. జిల్లాలో వద్తల్, బొచసన్, నడియాద్ వంటి ఆలయప్రధాన పట్టణాలు ఉన్నాయి.

ప్రముఖులు

[మార్చు]
  • గోవర్ధన్‌రాం త్రిపాఠి (1855 - 1907) నవలా రచయిత, నడియాద్‌లో జన్మించాడు.
  • మణిలాల్ నంబూద్రి (1858-1907) రచయిత, ఫిలాసఫర్. నడియాద్‌లో జన్మించాడు.
  • రవ్జీ పటేల్ (1939-1968) ఆధునిక వాది, నవలా రచయిత. వల్లవ్‌పురాలో జన్మించాడు.

[4]

భారతీయ జురాసిక్ పార్క్ - బలాసినోర్

[మార్చు]

1980లో శిలాజశాస్త్రవేత్తలు జిల్లాలోని బలాసినోర్ వద్ద నిర్వహించిన క్రమానుగతమైన జియోగ్రాఫికల్ సర్వేలో ఈప్రాంతంలో జురాసిక్ ఎముకలు, శిలాజాలను కనుగొన్నారు. ఈ శిలాజాలు సమీపంలోని గ్రామాలలో ఆసక్తిని రేకెత్తించింది. అనేకమంది గ్రామీణులు శిలాజ గ్రుడ్లను వారి గృహాలలో ఉంచి పూజించడం మొదలు పెట్టారు. తతువాత జరిగిన యథార్థ పరిశోధనలలో లభించిన డైనోజర్ గుడ్లు, ఎముకలు, అష్తిపంజరం ప్రస్తుతం కొలకత్తా మ్యూజియంలో భధ్రపరచబడి ఉన్నాయి. ఇవి ప్రస్తుతం పలు శస్త్రవేత్తల బృందాలను, పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. బలాసినొర్‌లో లభించిన డైనోసర్ శరీరభాగాలను కలిపి చూసిన శాస్త్రఙలు ప్రంపన్ంలో డైనాసర్లు అత్యధికంగా నివసించిన ప్రాంతాలలో గుజరాత్ ఒకటని విశ్వసిస్తున్నారు. ఇక్కడ కనీసం 13 జాతుల డైనోసర్లు నివసించాయని విశ్వసిస్తున్నారు. ఇవి 100 మిలియన్ల నాటివని సుమారు 66 మిలియన్ సంవత్సరాల క్రితం అవి పూర్తిగా అంతరించాయని భావిస్తున్నారు. ఇక్కడ ఉన్న మెత్తటి మట్టి గ్రుడ్లను జంతువుల నుండి రక్షించిందని భావిస్తున్నారు. అందువలన ఈప్రాంతంలో సురక్షితమైన గ్రుడ్ల శిలాజాలు లభించాయి. ఫ్రాన్స్‌లోని ఎయిక్స్ భూభాగంలో లభించిన డైనోసర్ గ్రుడ్ల శిలాజాలు తరువాత గుజరాత్‌లో లభించిన డైనోసర్ గ్రుడ్ల శిలాజాలు ప్రపంచంలో ఉత్తమమైనవని భావిస్తున్నారు.

  • డైనోజర్ శిలాజాలు పర్యాటక అధికారులను ప్రోత్సహించి గుజరాత రాష్ట్రంలో " డైనోజర్ టూర్ "ని ఏర్పాటు చేసేలా చేసింది.

సరిహద్దులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Latvia 2,204,708 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179
  4. మూస:Jstor
    This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand

వెలుపలి లింకులు

[మార్చు]