గిర్ సోమనాథ్ జిల్లా
గిర్ సోమనాథ్ జిల్లా | |
---|---|
జిల్లా | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | గుజరాత్ |
ప్రధాన కార్యాలయం | వెరావల్ |
విస్తీర్ణం | |
• Total | 3,755 కి.మీ2 (1,450 చ. మై) |
జనాభా (2011[1]) | |
• Total | 9,46,790 |
Time zone | UTC+5:30 (భారతీయ కాలమాన ప్రకారం) |
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో గిర్ సోమనాథ్ జిల్లా ఒకటి. వెరవల్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా జనసంఖ్య 3.5 లక్షలు. జునాగఢ్ జిల్లా నుండి ఈ జిల్లాను వేరు చేసిన తరువాత వైశాల్యపరంగా గిర్ సోమనాథ్ జిల్లా జునాగఢ్ జిల్లాకంటే చిన్నదిగా ఉంది. 2013 ఆగస్టు 15 న గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 7 జిల్లాలలో ఇది ఒకటి. ఈ జిల్లా గిర్ నేషనల్ పార్క్, అభయారణ్యం, సోమనాథ్ ఆలయానికి ప్రసిద్ధి చెందింది.[2] కొత్తగా రూపొందించిన గిర్ సోమనాథ్ జిల్లాలో వెరవ, తలల, కొడినార్, ఉన, గిర్ గదడ తాలూకాలు ఉన్నాయి.
వృక్షజాలం , జంతుజాలం
[మార్చు]గిర్ సోమనాథ్ జిల్లాలో ఉన్న గిర్ అరణ్యాలలో సింహాలు, జింకలు, కోతులు, పలు పక్షిజాతులు, జంతువులు ఉన్నాయి. ఆసియన్ సింహాలు గిర్ అరణ్యాలలో మాత్రమే కనిపిస్తాయి.
భౌగోళికం
[మార్చు]గిర్ సోమనాథ్ జిల్లా గుజరాత్ రాష్ట్రానికి పశ్చిమాన, సౌరాష్ట్ర ద్వీపకల్పానికి నైరుతి దిశలో ఉంది. ఈ జిల్లాకు ఉత్తరాన పోరుబందర్ జిల్లా ఉంది. దీనికి దక్షిణాన గల్ఫ్ ఆఫ్ కాంబే, పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున జునాగఢ్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
రవాణా
[మార్చు]రైలు రవాణా
[మార్చు]గిర్ సోమనాథ్ జిల్లా కేంద్రమైన వెరావల్ ఒక ప్రధాన రైల్వే జంక్షన్. ఈ నగరం అహ్మదాబాద్, రాజ్ కోట్, ఉజ్జయిని, వడోదర, పూణే, చెన్నై, న్యూఢిల్లీ, భోపాల్, ముంబై, జబల్పూర్, తిరువనంతపురంలకు ఎక్స్‌ప్రెస్ వే ద్వారా అనుసంధానించబడి ఉంది.
రోడ్డు రవాణా
[మార్చు]అహ్మదాబాద్, రాజ్ కోట్, సూరత్, భావ్ నగర్, భుజ్, జునాగఢ్, గాంధీనగర్, ద్వారకాయి వంటి రాష్ట్రంలోని ఇతర ప్రధాన ప్రాంతాలకు సోమనాథ్ రోడ్డు రవాణా ద్వారా అనుసంధానించబడి ఉంది .
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 [permanent dead link] Industrial Potentiality Survey Report of Gir Somnath District [2016-17
- ↑ http://www.narendramodi.in/promises-delivered-gujarat-cabinet-approves-creation-[permanent dead link] of-7-new-districts-and-22-new-talukas/
వెలుపలి లింకులు
[మార్చు]