Jump to content

డి.యశోదారెడ్డి

వికీపీడియా నుండి

డి. యశోదారెడ్డి (ఆగష్టు 5, 1925ఫిబ్రవరి 18, 1983) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఈమె 1962 నుండి 1967 వరకు 3వ లోక్‌సభలో కర్నూలు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించింది.

యశోదారెడ్డి 1925, ఆగష్టు 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించింది. ఈమె తండ్రి జి.నాగిరెడ్డి. ఈమె డి.రంగె రామానుజం ను వివాహం చేసుకుంది. వీరికి ఒక కొడుకు, ఒక కుమార్తె. ఈమె బి.ఏ డిగ్రీతో పట్టభద్రురాలై, ఆ తర్వాత ఎల్.ఎల్.బి చదివింది. 1962 ఫిబ్రవరిలో జరిగిన మూడవ లోక్‌సభ ఎన్నికలలో, కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రేసు అభ్యర్ధిగా పోటీచేసి, 36,914 ఓట్ల ఆధిక్యతతో తన సమీప ప్రత్యర్ధి ఎం.వి.సుబ్బారెడ్డిని ఓడించి లోక్‌సభకు ఎన్నికైంది.[1]ఈమె 1956 నుండి 1962 వరకు మరలా 1967 నుండి 1972 వరకు ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికైంది.[2]

మూలాలు

[మార్చు]
  1. "లోక్‌సభ ఫలితాలు ఆంధ్రప్రదేశ్" (PDF). ఆంధ్రప్రభ. No. మార్చి 1, 1962. p. 5. Retrieved 12 November 2017.[permanent dead link]
  2. "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952 - 2003" (PDF). RS Secretariat New Delhi. Retrieved 27 October 2017.