Jump to content

డీన్ బ్రౌన్లీ

వికీపీడియా నుండి
డీన్ బ్రౌన్లీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డీన్ గ్రాహం బ్రౌన్లీ
పుట్టిన తేదీ (1984-07-30) 1984 జూలై 30 (వయసు 40)
పెర్త్, పశ్చిమ ఆస్ట్రేలియా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాట్స్‌మన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 252)2011 నవంబరు 1 - జింబాబ్వే తో
చివరి టెస్టు2013 మే 24 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 168)2012 ఫిబ్రవరి 3 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2017 మార్చి 4 - దక్షిణాఫ్రికా తో
తొలి T20I (క్యాప్ 45)2010 డిసెంబరు 26 - పాకిస్తాన్ తో
చివరి T20I2014 డిసెంబరు 6 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2009–2012కాంటర్బరీ
2012–presentNorthern Districts
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ట్వంటీ20 ఫక్లా
మ్యాచ్‌లు 14 16 5 94
చేసిన పరుగులు 711 361 6 6,208
బ్యాటింగు సగటు 29.62 25.78 1.20 40.05
100లు/50లు 1/4 0/1 0/0 14/36
అత్యుత్తమ స్కోరు 109 63 5 334
వేసిన బంతులు 66 240
వికెట్లు 1 1
బౌలింగు సగటు 52.00 180.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/13 1/13
క్యాచ్‌లు/స్టంపింగులు 17/– 6/– 3/– 121/–
మూలం: Cricinfo, 2022 ఆగస్టు 26

డీన్ గ్రాహం బ్రౌన్లీ (జననం 1984, జూలై 30) న్యూజీలాండ్ క్రికెటర్. ఇతను ఆస్ట్రేలియాలో జన్మించాడు. ప్రస్తుతం న్యూజీలాండ్ దేశవాళీ క్రికెట్‌లో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ జట్టు కోసం ఆడుతున్నాడు. న్యూజీలాండ్ జాతీయ క్రికెట్ జట్టుకు క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహించాడు.

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2010 జనవరిలో పాకిస్థాన్‌పై ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.

న్యూజీలాండ్ ఎ జట్టు తరపున అనేక మ్యాచ్‌లు ఆడిన తర్వాత, 2011 నవంబరులో జింబాబ్వేపై జాతీయ జట్టు కోసం తన తొలి టెస్ట్ అరంగేట్రం చేసాడు. బ్రౌన్లీ అరంగేట్రంలో తన మొదటి ఇన్నింగ్స్‌లో 63 పరుగులు చేశాడు. జింబాబ్వే మొదటి ఇన్నింగ్స్‌లో మీడియం పేస్ బౌలింగ్‌లో ఒక వికెట్ కూడా తీసుకున్నాడు.[1]

ఆ తర్వాత ఆస్ట్రేలియన్ టెస్ట్ సిరీస్‌లో ఆడాడు. బ్రిస్బేన్‌లో అజేయంగా 77 పరుగులు చేసి న్యూజీలాండ్ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

2017 ఫిబ్రవరి 5న, హామిల్టన్‌లో జరిగిన చాపెల్-హాడ్లీ సిరీస్ చివరి మ్యాచ్‌లో మార్టిన్ గప్టిల్ స్థానంలో బ్రౌన్లీ 2 సంవత్సరాలలో అంతర్జాతీయ స్థాయిలో మొదటి మ్యాచ్‌ని సాధించాడు. తన మొదటి వన్డే హాఫ్ సెంచరీని కూడా సాధించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. New Zealand vs. Zimbabwe scorecard – espncricinfo.com. Retrieved 5 November 2011.
  2. "AUS 130/4 (26.6 ov, TM Head 41*, MP Stoinis 5*, KS Williamson 1/33) | Live Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 5 February 2017.

బాహ్య లింకులు

[మార్చు]