డెహ్రాడూన్ - వారణాసి జనతా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం
డెహ్రాడూన్ - వారణాసి జనతా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం | |
---|---|
Details | |
Date | 20 మార్చి 2015 |
Time | 09:10 |
Location | బచ్చ్రావణ్ , ఉత్తరప్రదేశ్ |
Country | భారతదేశం |
Rail line | వారణాసి - లక్నో రైలు మార్గము |
Operator | భారతీయ రైల్వేలు |
Type of incident | పట్టాలు తప్పింది |
Cause | విచారణలో ఉంది, బ్రేక్ వైఫల్యం అనుమానం |
Statistics | |
Trains | 1 |
Passengers | 400+ |
Deaths | 58 |
Injuries | 150+ |
డెహ్రాడూన్ - వారణాసి జనతా ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య 14266) ఉత్తర భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్‌లోని బచ్చ్రావణ్ సమీపంలో పట్టాలు తప్పింది. దీని ఫలితంగా కనీసం యాభైఎనిమిది మంది మరణించారు, 150 మంది గాయపడ్డారు. ఈ రైలు ప్రమాదం 2015 మార్చి 20 న జరిగింది.
ప్రమాదం[మార్చు]
2015 మార్చి 20 న స్థానిక సమయం (03:40 యుటిసి) లో అనగా 09:10 గంటలకు, ప్రయాణికుల రైలు భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ లోని బచ్చ్రావణ్ వద్ద ఒక సిగ్నల్‌ను దాటి ప్రయాణించింది. ఫలితంగా లోకోమోటివ్, రెండు బోగీలు పట్టాలు తప్పాయి. [1] ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 400 కన్నా ఎక్కువ మంది ప్రయాణికులు, 85 మంది సభ్యుల సిబ్బంది ఉన్నారు. [2] ఈ రైలు డెహ్రాడూన్ నుండి వారణాసి వరకు నడిచే జనతా ఎక్స్‌ప్రెస్ రైలు. [3] తన బ్రేకులు విఫలమయ్యాయని అందువల్ల రైలును ఆపలేకపోయానని డ్రైవర్ రేడియోలో నివేదించాడు. ఇది ఒక సైడింగ్ మార్గంలోకి మళ్ళించబడింది, బచ్చ్రావణ్ వద్ద బఫర్స్‌ను ఢీకొనడం ద్వారా క్రాష్ అయ్యింది.[4] లోకోమోటివ్ పక్కన క్యారేజ్ తీవ్రంగా దెబ్బతిన్నట్టు, ప్రయాణీకులతో బాగా కిక్కిరిసిపోయి ఉన్నట్లుగా ఫోటోగ్రాఫ్‌ల (చిత్రాలు) ద్వారా తెలిసింది. [3]యాభైఎనిమిది మంది మృతి చెందారు, [4], 150 మంది పైగా గాయపడ్డారు. [5] సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ ప్రచురించిన ప్రాథమిక నివేదికలో 39 మంది ప్రయాణికులు చనిపోయినట్లు, 38 మంది గాయపడినట్లుగా నివేదించారు. [6] లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ నుండి వైద్యులు బృందం ఒకటి ప్రమాదస్థలానికి చేరింది. [1] గాయపడినవారిని కింగ్ జార్జ్ మెడికల్ విశ్వవిద్యాలయానికి, లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కి, రాయ్ బరేలీలోని ఆసుపత్రికి తరలించారు. [7] [8][7] రైలు శిథిలాల తొలగింపు తరువాత మార్చి 21 న బచ్హ్రావన్ నుండి రైలుమార్గము తెరవబడింది.[4]
పరిహారం[మార్చు]
ప్రమాదం గురించి వార్తలు వచ్చిన వెంటనే, సమీపంలోని గ్రామాల్లోని ప్రజలు రెస్క్యూ, ఉపశమన కార్యకలాపాల్లో సహాయపడటానికి అక్కడికి వెళ్ళారు. గ్రామస్థులు రైలు శకలాల కోచ్‌లలో చిక్కుకున్న ప్రయాణీకులను రక్షించేందుకు సహాయపడ్డారు. మృతుల సంఖ్య 38 కి చేరుకుంది. రాయ్ బరేలీలో ఆసుపత్రిలో 34 మంది మరణించారు, నలుగురు ప్రయాణీకులు లక్నోలో చనిపోయారు అని యుపి మంత్రి మనోజ్ కుమార్ పాండే చెప్పారు. ప్రమాదంలో మరణించిన 38 మంది వ్యక్తుల జాబితాను లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ విడుదల చేసింది. ప్రమాదానికి గురై మరణించినవారి దగ్గర బంధువులకు రైల్వేలు రూ .2 లక్షల పరిహారాన్ని ప్రకటించాయి. తీవ్రంగా గాయపడినవారికి 50,000 రూపాయలు ఇవ్వగా, చిన్న గాయాలతో బయటపడిన ప్రయాణీకులకు రూ. 20,000 ప్రకటించింది. [1]
ఇన్వెస్టిగేషన్[మార్చు]
రైల్వే భద్రత కమిషన్ ద్వారా జరిగిన ప్రమాదం గురించి ఒక విచారణ ప్రారంభించబడింది.[4] ఈ రైలు డ్రైవర్, గార్డు సాక్ష్యాల ప్రకారం రైలులో సమస్య ఉన్నట్లు సూచించారు. [7] రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా ఒక నెలలో ఒక నివేదిక ప్రచురించబడుతుందని పేర్కొన్నారు. [4]
ఇవికూడా చూడండి[మార్చు]
- భారతీయ రైల్వేలు రైళ్లు ప్రమాదాలు జాబితా
- భారతీయ రైల్వేలు
- కళింగ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం
- హార్డా జంట రైలు ప్రమాదాలు
బయటి లింకులు[మార్చు]
- 1990 - ప్రధాన భారతీయ రైలు ప్రమాదాలు క్రోనాలజీ - టైమ్స్ ఆఫ్ ఇండియా
- "Major Railway Accidents in India, 2000-09" by Ajai Banerji, ISBN 978-1-257-84773-0 and ISBN 978-81-921876-0-0
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 1.2 Mahesh, Niha. "32 Die as Train Derails Near Rae Bareli in Uttar Pradesh, 50 People Injured". NDTV India. Retrieved 20 March 2015. Cite web requires
|website=
(help) - ↑ Pradhan, Sharat. "Indian train accident kills at least 30, leaves 50 injured". Reuters. Retrieved 20 March 2015. Cite web requires
|website=
(help) - ↑ 3.0 3.1 "India train accident kills at least 34 in Uttar Pradesh". BBC News Online. Retrieved 20 March 2015. Cite web requires
|website=
(help) - ↑ 4.0 4.1 4.2 4.3 4.4 Srivastava, Piyush. "UP train crash death toll rises to 58 as driver reveals his SOS alerts were ignored". Mail Online. Retrieved 22 March 2015. Cite web requires
|website=
(help) - ↑ Shakil, Marya. "30 dead, 150 injured as three coaches of Janta Express train derail in Raebareli". CNN-IBN. Retrieved 20 March 2015. Cite web requires
|website=
(help) - ↑ "Preliminary Report About Inquiry Into the Derailment of 14266 Down Dehradun-Varanasi Janata Express at Baccharawan Station Near Raibareli in UP". Ministry of Civil Aviation. Retrieved 10 February 2016. Cite web requires
|website=
(help) - ↑ 7.0 7.1 7.2 Sharda, Shailvee; Husain, Yusra. "38 dead, 150 injured as train derails in UP's Rae Bareli". Times of India. Retrieved 20 March 2015. Cite web requires
|website=
(help) - ↑ Joshi, Sandeep. "34 killed as train derails in Rae Bareli". The Hindu. Retrieved 20 March 2015. Cite web requires
|website=
(help)