అక్షాంశ రేఖాంశాలు: 29°16′34″N 77°43′52″E / 29.276°N 77.731°E / 29.276; 77.731

కళింగ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2017 Muzaffarnagar train derailment
వివరాలు
తేదీ19 ఆగష్టు 2017
షుమారు 5:45 పి.ఎం. (IST)
స్థానంఖటౌలీ, ముజఫర్‌నగర్ జిల్లా, ఉత్తర ప్రదేశ్
భౌగోళికాంశాలు29°16′34″N 77°43′52″E / 29.276°N 77.731°E / 29.276; 77.731
దేశంభారత దేశము
ప్రమాద రకంపట్టాలు తప్పింది
గణాంకాలు
రైళ్ళు1
మరణాలు23
గాయపడినవారు156
కళింగ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్
కళింగ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్

2017 ఆగష్టు 19 న, ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ జిల్లా లోని ఖటౌలీకి సమీపంలో కళింగ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.[1] ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందారు. 156 మంది గాయపడ్డారు.[2] భారతదేశంలో రైలు ప్రమాదాలు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. 2017 సం.లో జరిగిన ప్రయాణీకుల రైలు పట్టాలు తప్పటం వంటి పెద్ద రైలు ప్రమాదాలలో ఇది నాలుగవది. ఉత్తర ప్రదేశ్ లో మూడోది.[3]

ప్రమాదం

[మార్చు]

2017 ఆగష్టు 19 న, సుమారు 5:45 సా.కు ఉత్తర ప్రదేశ్, ముజఫర్‌నగర్ జిల్లా లోని ఖటౌలీకి సమీపంలో 23 బోగీలతో నడుస్తున్న కళింగ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ రైలు యొక్క 14 బోగీలు ప్రయాణంలో పట్టాలు తప్పాయి. ఈ రైలు ఒరిస్సాలోని పూరి నుంచి ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ నకు వెళ్ళుతుంది.[4][5][6] ఉత్తర ప్రదేశ్ పోలీసుల సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఇరవై మూడు మంది ప్రయాణీకులు చనిపోయారు.[7] ఉత్తర ప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి మంత్రి సతీష్ మహాన మాట్లాడుతూ, గాయపడిన 74 మంది ప్రయాణీకులను వివిధ ఆసుపత్రులలో చేర్చారని తెలియజేసారు.[8]

పర్యవసానాలు

[మార్చు]

మీడియా ఫుటేజ్ బట్టి కోచ్‌లు ఒకదానిపై ఒకటి ఎక్కినట్లుగా కనిపించాయి. ఒక బోగీ అయితే రైలు మార్గం (ట్రాక్) పక్కన ఉన్న ఇంట్లోకి చొచ్చుకు పోయింది.[4] నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందిని రెస్క్యూ ఆపరేషన్లో పనిచేయడానికి ప్రమాద స్థలానికి వెంటనే తరలించారు.[9] రెస్క్యూ సిబ్బంది దెబ్బతిన్న బోగీల లోపల చేరడానికి మెటల్ కట్టర్లు, క్రేన్లు ఉపయోగించారు.[10] రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ ప్రమాదం తరువాత మూడు రైళ్ళును రద్దు చేసారు. ఆరు రైళ్ళను దారి మళ్లించారు. 14521/14522 అంబాలా-ఢిల్లీ-అంబాలా ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్, 18478 హరిద్వార్-పూరి ఉత్కళ్ కళింగ ఎక్స్‌ప్రెస్, 14682 జలంధర్-న్యూఢిల్లీ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ లను రద్దు చేశారు. ఈలోపులోనే, రైల్వేలు కొన్ని హెల్ప్‌లైన్ నంబర్లను జారీ చేసింది.[11]

బాధ్యత

[మార్చు]

రైల్వే మంత్రి సురేష్ ప్రభు జీవితాలను పోగొట్టుకున్నవారికి, ప్రతి ఒక్కరికి రూ.3.5 లక్షల రూపాయల గరిష్ఠ పరిమితితో పరిహారాన్ని ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణీకులకు ప్రతి ఒక్కరికి రూ.50,000, చిన్నపాటి గాయాలు అయిన ప్రయాణీకులకు రూ.25,000 పరిహారాన్ని ప్రకటించాడు.[9] ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రమాదం పట్ల అనేక ట్వీట్ల ద్వారా విచారం వ్యక్తం చేశారు. అతను ఇలా అన్నాడు, "నా ఆలోచనలు మరణించినవారి కుటుంబాలతో ఉన్నాయి. గాయపడినవారు వేగవంతంగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రైల్వే మంత్రిత్వశాఖ ఈ పరిస్థితిని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది. రైల్వే మంత్రిత్వశాఖ, యుపి ప్రభుత్వం రైలు ప్రమాదం బారిన పడిన వారిని అన్నివిధాల ఆదుకుంటున్నారని, అవసరమైన అన్ని సహాయాలను అందిస్తున్నామని చెప్పారు.[12]

"ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాద ఘటనలో మరణించినవారు, వారి కుటుంబాల గురించి నా ఆలోచనలు ఉన్నాయి. గాయపడిన వారు రక్షించబడతారు, వారికి ఉపశమనం కలిగిస్తాం" అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చెప్పారు." [12]

ఇవికూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Train derails in Uttar Pradesh, more than 20 killed". Al Jazeera. 20 August 2017. Retrieved 20 August 2017.
  2. "Desperate search to find survivors as train crash in India kills 23 and injures 156". The Telegraph. 20 August 2017. Retrieved 22 August 2017.
  3. "At least 20 dead after Indian train derails in Uttar Pradesh". The Guardian. Reuters. 19 August 2017. Retrieved 20 August 2017.
  4. 4.0 4.1 Dilshad, Mohammed (20 August 2017). "At Least 23 Killed, 72 Injured As Utkal Express Derails In UP's Muzaffarnagar". NDTV. Retrieved 19 August 2017.
  5. "Train derails in Uttar Pradesh, at least 14 killed: local official". Reuters. 19 August 2017. Archived from the original on 19 ఆగస్టు 2017. Retrieved 19 August 2017.
  6. "23 dead as train derails in northern India". Anadolu Agency. 19 August 2017. Retrieved 20 August 2017.
  7. "Train derails in UP's Muzaffarnagar". Times of India. 20 August 2017. Retrieved 20 August 2017.
  8. Bharadwaj, Vashistha (20 August 2017). "Utkal Express derails in Muzaffarnagar Highlights: Death toll rises to 23, railway tracks found broken, Cong targets PM Modi over accident". Hindustan Times. Retrieved 20 August 2017.
  9. 9.0 9.1 "14 coaches of Kalinga Utkal Express derail in Muzaffarnagar; 23 dead, scores injured". The Economic Times. Indo-Asian News Service. 19 August 2017. Archived from the original on 21 ఆగస్టు 2017. Retrieved 19 August 2017.
  10. "Train derails in northern India killing at least 23". The Telegraph. Agence France-Presse. 19 August 2017. Retrieved 20 August 2017.
  11. "Utkal Express derailment: 3 trains cancelled, 6 diverted". Indian Express. Press Trust of India. 20 August 2017. Retrieved 19 August 2017.
  12. 12.0 12.1 "Muzaffarnagar train accident: At least 23 killed as 14 coaches of Utkal Express derail". Indian Express. 19 August 2017. Retrieved 20 August 2017.