Jump to content

భారతీయ రైల్వేలు రైళ్లు ప్రమాదాలు జాబితా

వికీపీడియా నుండి

ఈ క్రింది భారతీయ రైల్వేలులో జరిగిన రైళ్ళు ప్రమాదాలు జాబితా ఇవ్వబడింది.

  1. 2 జనవరి 2010 నాడు, గోరఖ్పూర్ - హిసార్ గోరఖ్‌ధాం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ దట్టమైన పొగమంచు కారణంగా, నైరుతి లక్నో లోని కాన్పూర్ రైల్వే స్టేషనుకు 60 మైళ్ల (100 కిలోమీటర్ల) దూరంలోని పాంకి రైల్వే స్టేషను సమీపంలో గోరఖ్‌ధాం ఎక్స్‌ప్రెస్, ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్నాయి.[1] ఈ కారణంగా పది మంది మరణించారు, 51 మంది గాయపడ్డారు.
  1. ఫిబ్రవరి 2013 - 12618 హజ్రత్ నిజాముద్దీన్ - పన్వేల్ మంగళ లక్షద్వీప్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు మధ్య రైల్వే జోన్ లోని పన్వేల్ - రోహా రైలు మార్గములో నెలకొని ఉన్న పెన్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడ లేదు.
  2. 10 ఏప్రిల్, 2013 - 15228 ముజఫర్పూర్ - యశ్వంత్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ఏడు కంపార్ట్మెంట్లు చెన్నై నుండి 40 కి.మీ. దూరం లోని అరక్కోణం సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణీకుడు చనిపోవడం, పైనుండి పడటంతో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.[2]
  1. 4 మే, 2014 - 50105 దివా - సావంత్వాడి ప్యాసింజర్ రైలు ఉదయం 9-30 గంటలకు నాగోఠానే, రోహా స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది చనిపోయారు, 100 మంది గాయపడ్డారు. అనేక ఇతర రైళ్లు ఆలస్యం, రద్దు కావడం లేదా కొంకణ్ రైల్వే వైపునకు దారి మళ్లించేట్లు చేశారు.[3]
  2. 25 జూన్ 2014 - 12236- న్యూ ఢిల్లీ - డిబ్రూగర్ రాజధాని ఎక్స్‌ప్రెస్, బీహార్‌లోని చాప్రా పట్టణం సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు.[4]
  3. 14 డిసెంబర్ 2014 - 12381 అప్ హౌరా - న్యూ ఢిల్లీ (వయా గయ) పూర్వ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బండి ఉదయం 8.15 గంటలకు హౌరా వదిలిన తర్వాత 8.27 గంటలకు పట్టాలు తప్పింది. న్యూ ఢిల్లీ సరిహద్దుగా గల పూర్వ ఎక్స్‌ప్రెస్ హౌరా స్టేషన్ వదిలి తర్వాత, 11 స్లీపర్ కోచ్‌లు, ఒక చిన్నగది (ప్యాంట్రీ) కారు (ఎసి హాట్ బఫర్ కార్). బయలు దేరిన కొద్దిసేపటికే లిల్లూ వద్ద పట్టాలు తప్పాయి. ఏ ప్రయాణీకులకు ఎటువంటి ప్రమాదం లేదా గాయం కాలేదని, రైల్వే అధికారులు తెలిపారు.
  4. 26 మే 2014 నాడు, గోరఖ్పూర్ - హిసార్ గోరఖ్‌ధాం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ గోరఖ్పూర్ (రాబోతూ) వెళ్ళుతూ ఉండగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంత్ కబీర్ నగర్ జిల్లా లోని ఖలిలాబాద్ రైల్వే స్టేషను సమీపంలోని నిశ్చలంగా ఉన్న గూడ్స్ రైలు లోకి దూసుకుపోయింది.[5] ఈ సంఘటనలో 40 మంది మరణించారు, 150 మంది పైగా గాయపడ్డారు.
  1. 1 మార్చి 2015 - 12617 పన్వేల్ - హజ్రత్ నిజాముద్దీన్ మంగళ లక్షద్వీప్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మహారాష్ట్ర లోని పెన్ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది; ఎవరూ గాయపడ లేదు.[6]
  2. 3 మే, 2015 - 12223 ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ - ఎర్నాకుళం ఎసి దురంతో ఎక్స్‌ప్రెస్ యొక్క 10 బోగీలు సుమారు 6.30 గంటలకు దక్షిణ గోవాలో బల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఏ మరణాలు లేవు.[7]
  3. 13 ఫిబ్రవరి, 2015 న బెంగళూరు సిటీ - ఎర్నాకుళం ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బెంగుళూరు నుండి ఎర్నాకుళం ప్రయాణంలో వెళ్ళుతుండగా పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు, 150 మందికి గాయాలయినాయి.[8][9][10]భారతీయ రైల్వేలు యొక్క తుది నివేదిక ప్రకారం కేవలం 42 మందికి గాయాలయినట్లు, 9 మంది మరణించినట్లు పేర్కొన బడింది. [11]
  4. 20 మార్చి, 2015న డెహ్రాడూన్ - వారణాసి జనతా ఎక్స్‌ప్రెస్ (రైలు సంఖ్య 14266) ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌లోని బచ్చరావణ్ సమీపంలో పట్టాలు తప్పింది. దీని ఫలితంగా కనీసం యాభైఎనిమిది మంది మరణించారు, 150 మంది గాయపడ్డారు. [12]
  1. 19 ఆగష్టు, 2017 న, ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ జిల్లా లోని ఖటౌలీకి సమీపంలో కళింగ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. [13] ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందారు, 156 మంది గాయపడ్డారు. [14]

ఇవి కూడా చూడండి

[మార్చు]
  1. భారతీయ రైల్వేలు

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "At least 10 killed in train crashes in northern India". Reuters. 2 January 2010. Archived from the original on 17 డిసెంబరు 2014. Retrieved 16 February 2015.
  2. "Commissioner of Railway Safety to probe accident". Chennai, India: The Hindu. 2013-04-11. Retrieved 2013-07-20.
  3. "Maharashtra Train accident 2014 May". The Hindu. Maharashtra, India. 5 May 2014.
  4. "New Delhi-Dibrugarh Rajdhani Express Derails in Bihar, Four Killed". NDTV. Retrieved 25 June 2014.
  5. "Gorakhdham Express derails in Sant Kabir Nagar UP killing at least 6". IANS. news.biharprabha.com. Retrieved 26 May 2014.
  6. "Three coaches of Mangala Express derail". The Hindu. Retrieved 2015-03-01.
  7. http://www.ndtv.com/india-news/10-bogies-of-ernakulam-duronto-express-derail-in-goa-none-injured-760108
  8. "10 dead, over 150 injured as Ernakulam-bound Inter City Express derails near Bengaluru". Yahoo India. No. 13 February 2015. Yahoo India. PTI. 13 February 2015. Retrieved 13 February 2015.
  9. "5 feared dead as Bengaluru-Ernakulam train derails". The Hindu. No. 13 February 2015. The Hindu. 13 February 2015. Retrieved 13 February 2015.
  10. "2 Killed, Several Injured as Train Derails Near Tamil Nadu's Hosur". NDTV Convergence Limited. No. 13 February 2015. NDTV Convergence Limited. Press Trust of India. 13 February 2015. Retrieved 13 February 2015.
  11. Lalitha, S (14 January 2016). "Engineer, Coach Factory, Driver Chargesheeted for Anekal Train Mishap". The New Indian Express. Express Network Private Limited. Archived from the original on 14 June 2016. Retrieved 14 June 2016.
  12. Mahesh, Niha. "32 Die as Train Derails Near Rae Bareli in Uttar Pradesh, 50 People Injured". NDTV India. Retrieved 20 March 2015.
  13. "Train derails in Uttar Pradesh, more than 20 killed". Al Jazeera. 20 August 2017. Retrieved 20 August 2017.
  14. "Desperate search to find survivors as train crash in India kills 23 and injures 156". The Telegraph. 20 August 2017. Retrieved 22 August 2017.