Jump to content

తణుకు బ్లాకు-1 (తణుకు మండలం)

వికీపీడియా నుండి

తణుకుబ్లాకు-1, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు మండలానికి చెందిన రెవెన్యూయోతర గ్రామం.దీనిని పూర్వం తారకాపురం అంటారు.అదే తరువాత తళుకుగా, ఆ తరువాత తణుకుగా రూపాంతరం చెందింది. తణుకుబ్లాకు-1, అనేది తణుకు పురపాలక సంఘంలో ఒక భాగం. దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.ఇది కొవ్వూరు రెవెన్యూ విభాగంలో పరిధిలో ఉంది. తణుకు మండలానికి ఇది ప్రధాన కేంద్రం.పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు తరువాత తణుకు ఐదవ అతిపెద్ద పట్టణం.[1] తణుకు, నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గంలోని, తణుకు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పట్టణం.ఇది తణుకు పట్టణంలో విలీనమైన రెవెన్యూ గ్రామం.

గణాంకాలు

[మార్చు]

2011 భారత  జనగణన గణాంకాల ప్రకారం తణుకు పట్టణ జనాభా మొత్తం 77,962, అందులో 38,325 మంది పురుషులు, 39,637 మంది మహిళలు. తణుకు పురపాలక సంఘం పరిధిలో 2011 భారత  జనగణన గణాంకాల ప్రకారం మొత్తం 20,909 కుటుంబాలు నివసిస్తున్నాయి.[2]

రవాణా వ్యవస్థ

[మార్చు]

రైలు రవాణా

[మార్చు]

తణుకులో రైల్వే స్టేషను విజయవాడ జంక్షన్, నిడదవోలు మధ్య ఉంది. ఇది సింగల్ లైన్, విద్యుదీకరణ లేదు. దాదాపు 20 పాసింజర్ & 10 ఎక్స్‌ప్రెస్ రైళ్లు తణుకు ద్వారా వెళ్ళి హైదరాబాదు, చెన్నై, బెంగుళూర్, విశాఖపట్నం, ముంబై స్టేషనులకు కనెక్ట్ అవుతాయి.

రోడ్డు రవాణా

[మార్చు]

తణుకులో ఉన్న జాతీయ రహదారి-16 చెన్నై నుండి కలకత్తాకు కనెక్ట్ చేసి ఉంది. ఈ జాతీయ రహదారి ద్వారా ప్రధానంగా స్టీల్, బొగ్గు, చమురు, మేజర్ నిర్మాణ సామగ్రి వాహనాలు రోజువారీ వెళ్తున్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యెుక్క ప్రధానమైన ఉత్పత్తి స్టీల్.

దేవాలయాలు

[మార్చు]

సిరిసంపదలతో,వ్యవసాయ,పారిశ్రామిక రంగాలలో పరిపుష్టిగా ఉన్న తణుకు పట్టణం, ఆధ్యాత్మిక రంగంలో కూడా ప్రత్యేకస్దానం పొందింది.

  • కపర్దీశ్వరస్వామి ఆలయం
  • శ్రీ కేశవస్వామి వారి దేవస్థానం
  • సిద్దేశ్వరస్వామి ఆలయం
  • వేంకటేశ్వరస్వామి దేవాలయం
  • శ్రీ సీతారామాంజనేయస్వామి ఆలయం
  • సూర్య దేవాలయం
  • సాయిబాబా గుడి
  • వినాయకుని గుడి
  • కన్యకాపరమేశ్వరి ఆలయం

ఆంధ్రా సుగర్స్

[మార్చు]

ఆంధ్రా సుగర్స్ అధినేత ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఈ పట్టణంలో ఫోర్త్‌ ఫోరం వరకూ చదివాడు.దేశానికి స్వాతంత్ర్యం రావడానికి నాలుగు రోజుల ముందు (1947 ఆగస్టు 11) తణుకులో ఆంధ్రా సుగర్స్ స్థాపించాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. https://www.censusindia.gov.in/2011census/dchb/2815_PART_A_DCHB_WEST%20GODAVARI.pdf
  2. "Tanuku Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Archived from the original on 2020-06-16. Retrieved 2020-06-16.

వెలుపలి లంకెలు

[మార్చు]