తరంగ పరణవితన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తరంగ పరణవితన
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నిషాద్ తరంగ పరణవితన
పుట్టిన తేదీ (1982-04-15) 1982 ఏప్రిల్ 15 (వయసు 42)
కేగల్లె, శ్రీలంక
మారుపేరుమోరా
ఎత్తు6 ft 1 in (1.85 m)
బ్యాటింగుఎడమచేతి
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబ్యాటరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 111)2009 ఫిబ్రవరి 21 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు2012 నవంబరు 25 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2001/02–presentసింహళీస్ స్పోర్ట్స్ క్లబ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫక్లా లిఎ టి20
మ్యాచ్‌లు 32 174 107 29
చేసిన పరుగులు 1,792 11,398 3,765 642
బ్యాటింగు సగటు 32.58 44.17 41.37 23.77
100లు/50లు 5/11 30/50 6/26 0/5
అత్యుత్తమ స్కోరు 111 236 116* 67*
వేసిన బంతులు 102 2,562 1,130 96
వికెట్లు 1 33 20 4
బౌలింగు సగటు 86.00 40.66 44.60 29.25
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/26 4/39 4/25 1/3
క్యాచ్‌లు/స్టంపింగులు 27/– 176/– 60/– 12/–
మూలం: Cricinfo, 2016 నవంబరు 27

నిషాద్ తరంగ పరణవితన, శ్రీలంక మాజీ టెస్ట్ క్రికెట్ ఆటగాడు. ఇతడు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా, ఆఫ్-బ్రేక్ బౌలర్ గా రాణించాడు. 2020 ఆగస్టులో క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అయ్యాడు.[1]

జననం[మార్చు]

నిషాద్ తరంగ పరణవితన 1982, ఏప్రిల్ 15న శ్రీలంకలోని కేగల్లెలో జన్మించాడు.

దేశీయ క్రికెట్[మార్చు]

2015–16 ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో 10 మ్యాచ్‌లు, 17 ఇన్నింగ్స్‌లలో మొత్తం 953 పరుగులతో అత్యధిక పరుగులు చేశాడు.[2]

2018 మార్చిలో 2017–18 సూపర్ ఫోర్ ప్రావిన్షియల్ టోర్నమెంట్ కోసం కాండీ జట్టులో ఎంపికయ్యాడు.[3][4] తరువాతి నెలలో 2018 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్ కోసం క్యాండీ జట్టులో కూడా ఎంపికయ్యాడు.[5]

అంతర్జాతీయ క్రికెట్[మార్చు]

2009 ఫిబ్రవరిలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్‌లోని రెండవ టెస్ట్ మ్యాచ్‌లో, మూడవ రోజు ఆటకు వెళుతున్నప్పుడు, పాకిస్తాన్‌లోని లాహోర్‌లో వారి జట్టు బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో గాయపడిన శ్రీలంక క్రికెటర్లలో ఇతను ఒకడు.[6]

దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ అందునుండి కోలుకొని, పదహారు నెలల తర్వాత 2010 జూలై 18న శ్రీలంకలోని గాలేలో భారతదేశంపై తన తొలి టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. 2011 చివరిలో టెస్ట్ జట్టు నుండి తొలగించబడ్డాడు, దక్షిణాఫ్రికా పర్యటనలో శ్రీలంక మూడవ టెస్టు కోసం లహిరు తిరిమన్నెతో భర్తీ చేయబడింది.[7]

పరణవితన టెస్టుల్లో రెండు సెంచరీలు చేశాడు. 2010 జూలైలో గాలేలో భారతదేశంపై 111 స్కోరు,[8] రెండోది అదే నెలలో భారత శ్రీలంక పర్యటనలో జరిగిన మ్యాచ్‌లో సరిగ్గా 100 పరుగులు చేశాడు.[9]

మూలాలు[మార్చు]

  1. "Tharanga Paranavitana to retire from First Class cricket". The Papare. Retrieved 2023-08-22.
  2. "Records: Premier League Tournament, 2015/16: Most runs". ESPN Cricinfo. Retrieved 2023-08-22.
  3. "Cricket: Mixed opinions on Provincial tournament". Sunday Times (Sri Lanka). 26 March 2018. Archived from the original on 2018-03-27. Retrieved 2023-08-22.
  4. "All you need to know about the SL Super Provincial Tournament". Daily Sports. 26 March 2018. Archived from the original on 2018-03-27. Retrieved 2023-08-22.
  5. "SLC Super Provincial 50 over tournament squads and fixtures". The Papare. Retrieved 2023-08-22.
  6. The Age |Sri Lanka cricketers wounded in shooting Archived 2012-11-02 at the Wayback Machine retrieved 2023-08-22
  7. "Cricket: Sri Lanka wins toss, invites South Africa to bat". The Sunday Times (Sri Lanka). 3 January 2012. Archived from the original on 2012-01-06. Retrieved 2023-08-22.
  8. "Full Scorecard of Sri Lanka vs India 1st Test 2010 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-22.
  9. "Full Scorecard of Sri Lanka vs India 2nd Test 2010 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-22.

బాహ్య లింకులు[మార్చు]