తరిగొప్పుల మల్లన
తరిగొప్పుల మల్లన | |
---|---|
జాతీయత | భారతదేశం |
వృత్తి | కవి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | చంద్రభాను చరిత్రము |
తరిగొప్పుల మల్లన
[మార్చు]ఈకవి చంద్రభానుచరిత్ర మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచియించెను. ఇతడు నియోగిబ్రాహ్మణుడు; దత్తాత్రేయ యోగీంద్రుని శిష్యుడు; దత్తనామాత్యుని తమ్ముడు. ఈవేంకటపతిరాయలు 1585 వ సంవత్సరము మొదలుకొని 1614 వ వఱకును రాజ్యముచేసినవా డయినందున, కవియు ఆకాలమునం దుండినవాడే నని తెలియు చున్నది. ఈతడు లాక్షణిక కవి; కవిత్వము రసవంతముగా నుండును. ఈకవి వసుచరిత్రమును కృతినందిన తిరుమలదేవరాయని పుత్రుడగు వేంకటపతిరాయల కాలములో నుండినట్లు చంద్రభానుచరిత్రము లోని యీక్రిందిపద్యములో జెప్పినాడు -
సీ. ... ... ... ... ...
అనుచు బుధులెన్నవలయు రాజాధిరాజ
రాజపరమేశ సకలకర్ణాటకాంధ్ర
రాజ్యధౌరేయ తిరుమలరాజతనయ
చంద్రు డగువేంకటపతిక్షి తీంద్రమణికి.
తాలికోట యుద్ధమయినతరువాత తండ్రియైన తిరుమలదేవరాయడు తనరాజధానిని విజయనగరమునుండి పెనుగొండకు మార్చుకొన్నట్లే కొమారుడైన యీవేంకటపతిరాయడును తనరాజధానిని పెనుగొండనుండి చంద్రగిరికి మార్చుకొనెనని ఈ కవి పద్యములు.
ఉ. అంత దిగంతదంతురల తాంతనిశాంతని తాంతకాంతవ
న్యంతిక తాంతపాంధజనతాంతరసంతతకృంతనప్రధా [ 191 ]
త్యంతసమంతవిస్ఫుర దుదంత పరంతపకాంతిసంతతి
క్రాంతదురంతకుంతరతికాంతము పొల్చె వసంత మెంతయున్. [ఆ.3]
ఉ. తత్తఱపాటుతోడ గనుదమ్ములడాలు దిగంతరంబులన్
జిత్తరు నింప లే బయిటచేల కుచంబులపొంత జాఱ నా
బిత్తరి మ్రానుపాటొదవ బిమ్మటితో నొకకొంత గొంకి లో
జిత్తము మట్టుపెట్టుకొని చేరి సహోదరుదండ నిల్వగన్. [ఆ.4]
ఉ. ధరణితలేంద్రనందనవిధంబున గనుంగొన గోరి మున్ను కి
న్నరవరు డిచ్చినట్టి భువనస్తుతమైనయదృశ్యవిద్య న
య్యిరువురు గుప్తమూర్తు లయి యిందుసహోదరమందిరంబునన్
దరలక యుండి రట్టియెడ దన్వియు జేరగ వచ్చి యచ్చటన్. [ఆ.5]
మూలాల జాబితా
[మార్చు]ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము (1949) రచించినవారు కందుకూరి వీరేశలింగం పంతులు.(తరిగొప్పుల మల్లన)