తల్లిలేనిపిల్ల (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తల్లిలేనిపిల్ల
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్. త్యాగరాజన్
నిర్మాణం ఆర్.ఎం.సుబ్రమణియన్
తారాగణం జయచిత్ర,
అశోకన్,
నగేష్,
ప్రభ
సంగీతం శంకర్ గణేష్,
సత్యం
గీతరచన రాజశ్రీ
నిర్మాణ సంస్థ శ్రీఉమయాంబికై కంబైన్స్
భాష తెలుగు

తల్లిలేని పిల్ల శ్రీ ఉమయాంబికై కంబైన్స్ పతాకంపై 1977, మార్చి 3న విడుదలైన డబ్బింగ్ సినిమా. దీనిలో జయచిత్ర ద్విపాత్రాభినయం చేసింది. 1976లో విడుదలైన తాయిల్ల కుళందై అనే తమిళ సినిమా దీనికి మూలం.

నటీనటులు

[మార్చు]
  • జయచిత్ర
  • విజయకుమార్
  • సౌందరరాజన్
  • శకుంతల

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఆర్.త్యాగరాజన్
  • కథ, స్క్రీన్ ప్లే: శాండో చిన్నప్పదేవర్
  • మాటలు, పాటలు: రాజశ్రీ
  • సంగీతం: శంకర్ గణేష్, సత్యం
  • ఛాయాగ్రహణం: రామమూర్తి

పాటలు

[మార్చు]
క్ర.సం. పాట పాడినవారు
1 నే పాట పాడలేనే నీ తోడులేనిదే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల

సంక్షిప్తకథ

[మార్చు]

వరలక్ష్మి భర్త గణేష్ జూదరి. ఎప్పుడోగాని ఇంటికి రాడు. వరలక్ష్మి తన చిన్నారి కుమార్తె మల్లికతో కన్నవారింట్లో ఉంటుంది. వరలక్ష్మికి మల్లిక అన్నా, మల్లికకు వరలక్ష్మి అన్నా పంచప్రాణాలు. భర్త అఘాయిత్యానికి గురి అయిన వరలక్ష్మి ఆసుపత్రిలో మరణిస్తుంది. ఈ విషయం మల్లికకు తెలియదు. అమ్మకోసం పరితపిస్తూ జ్వరానికి గురి అవుతుంది. తల్లి దగ్గర ఉంటేనే గాని ఆ అమ్మాయి కోలుకోదని డాక్టర్లు చెబుతారు. మల్లిక తాతగారైన భూషయ్య ఎటూ దిక్కుతోచని స్థితిలో ఉండగా అచ్చం వరలక్ష్మిలా ఉన్న ఒక అమ్మాయి మల్లిక దగ్గర కూర్చుని కనిపిస్తుంది. ఇక్కడ నుండి కథ చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతుంది.[1] అచ్చు వరలక్ష్మిలా ఉన్న అమ్మాయి పేరు చిత్ర. చిత్ర విదేశాలలో చదువుకున్న ఆధునిక యువతి. ఆమె మేనమామ, మేనమామ కొడుకు ఆమె ఆస్తిని కాజేయడానికి కుట్ర పన్నుతారు. చిత్ర బుల్‌ఫైట్‌లో మొనగాడైన వీరయ్య అనే సామాన్యుని ప్రేమిస్తుంది. కానీ మేనమామలు ఆమెను బంధిస్తారు. ఆమె తప్పించుకుని పారిపోయే క్రమంలో మేనమామ పంపిన రౌడీలు వెంబడించగా అనుకోకుండా భూషయ్య ఇంట్లోకి వస్తుంది. అప్పటి నుండి తప్పించుకోవడానికి మల్లిక తల్లి అన్నపూర్ణగా నటించాల్సి వస్తుంది. మొదట ఇష్టం లేకపోయినా రానురాను అనుబంధం పెరిగి మల్లికను విడిచిపెట్టలేని స్థితికి చేరుతుంది చిత్ర. పతాక సన్నివేశంలో మల్లికకు తన తల్లి చనిపోయిన విషయం తెలిసినా చిత్రను తన తల్లిగా అంగీకరించడం, చిత్ర మేనమామ, బావల పన్నాగాలు విఫలం అయ్యి చిత్ర వీరయ్యల వివాహంతో కథ సుఖాంతమౌతుంది.[2]

మూలాలు

[మార్చు]
  1. వెంకట్రావు (6 March 1977). "తల్లి లేని పిల్ల చిత్రసమీక్ష". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 8 February 2020.[permanent dead link]
  2. రెంటాల (11 March 1977). "చిత్ర సమీక్ష తల్లిలేనిపిల్ల". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 8 February 2020.[permanent dead link]