Jump to content

తవనం సుబ్బాయమ్మ

వికీపీడియా నుండి

తవనం సుబ్బాయమ్మ, ఐద్వా నాయకురాలు. కొరిశపాడు మండలం ప్రాసంగులపాడు లోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన ఈమెకు, అదే గ్రామానికి చెందిన తవనం చెంచయ్య తో వివాహమైనది. నమ్మిన సిద్ధాంతాలకే కట్టుబడిన చెంచయ్య, 75 సంవత్సరాలకుపైగా ప్రజలకు సేవలందించాడు. సుబ్బాయమ్మ కూడా జిల్లా పార్టీలోనే సభ్యురాలిగా కొనసాగినారు. భర్త శాసనసభ్యుడుగా కొనసాగుచున్నప్పటికీ, ఆమె ఇంటివద్ద చీరల వ్యాపారం చేస్తూ, ఆదర్శమహిళగా జీవించారు. ఆమెకు అక్షరజ్ఞానం లేకున్నా, భర్త పోరాటపటిమను పుణికి పుచ్చుకున్నారు. మహిళా ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు. 1980లో "ఐద్వా" కు జిల్లా అధ్యక్షురాలిగా ఎంపికైనారు. జిల్లాలో అనేక ఉద్యమాలను నడిపిన సుబ్బాయమ్మ, 21 సంవత్సరాలు జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగినారు. 1993లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగిన సారా ఉద్యమానికి జిల్లాలో ఈమె నాయకత్వం వహించి, పలు సార్లు ఉద్యమాలు నిర్వహించారు. ఫిబ్రవరి-2014లో భర్త మృతి చెందినప్పటి నుండి, ఆమెకు వచ్చే రు.2000 పింఛనును సైతం పార్టీకే చెందే విధంగా వ్రాసినారు. అప్పటి నుండి సుబ్బాయమ్మ బాగోగులు పార్టీయే చూసినది. ఈ విధంగా 35 సంవత్సరాలుగా జిల్లాలో ఐద్వా నాయకురాలిగా సేవలందించుచూ ఆదర్శంగా నిలిచిన ఈమె, 2014,అక్టోబరు-18న, 80 సంవత్సరాల వయస్సులో, గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.[1]

మూలాలు

[మార్చు]
  1. [ఈనాడు ప్రకాశం; 2014,అక్టోబరు-19; 3వపేజీ]