తాండ్ర వినోద్ రావు
Appearance
తాండ్ర వినోద్‌రావు | |||
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 1972 జులై 24 తిమ్మంపేట, ములకలపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | బీజేపీ | ||
తల్లిదండ్రులు | కృష్ణారావు | ||
జీవిత భాగస్వామి | వినీలా | ||
సంతానం | వినీత్ రావు, వినయ్ రావు[1] | ||
నివాసం | హైదరాబాద్ |
తాండ్ర వినోద్‌రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.[2][3][4]
జననం, విద్యాభాస్యం
[మార్చు]తాండ్ర వినోద్ రావు 1972 జులై 24న తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం, తిమ్మంపేట గ్రామంలో జన్మించాడు. ఆయన ఇంటర్ వరకు పాల్వంచలో చదివి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు.[5]
రాజకీయ జీవితం
[మార్చు]తాండ్ర వినోద్ రావు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటూనే 2015 నుంచి 2021 వరకు ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా సామజిక సేవ కార్యక్రమాలు నిర్వహించాడు. ఆయన రాజకీయాల పట్ల ఆసక్తితో ఫిబ్రవరి 2024లో భారతీయ జనతా పార్టీలో చేరగా, ఆయనను2024 భారత సార్వత్రిక ఎన్నికలలో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ EENADU (12 May 2024). "గళాలు.. బలాలు". Archived from the original on 12 May 2024. Retrieved 12 May 2024.
- ↑ Eenadu (25 March 2024). "భాజపా అభ్యర్థిగా తాండ్ర వినోద్‌రావు". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
- ↑ Sakshi (25 March 2024). "ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా వినోద్‌రావు". Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
- ↑ "BJP Announces Two More Candidates for Lok Sabha Polls in Telangana" (in ఇంగ్లీష్). 24 March 2024. Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
- ↑ V6 Velugu (25 March 2024). "ఎవరీ తాండ్ర వినోద్ రావు..ఖమ్మం బీజేపీ అభ్యర్థిగా బరిలో". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "ఖమ్మం బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావు.. ఆయన బ్యాగ్ గ్రౌండ్ ఇదే!". 24 March 2024. Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
- ↑ The Hindu (24 March 2024). "BJP names Aruri Ramesh, Tandra Vinod Rao for LS polls" (in Indian English). Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.