Jump to content

బెరడు

వికీపీడియా నుండి
(తాట నుండి దారిమార్పు చెందింది)
మామిడి చెట్టు బెరడు

చెట్ల యొక్క కాండం, వేర్ల యొక్క వెలుపలి పొరను బెరడు అంటారు. వృక్షజాతిలో వాటి రకాన్ని బట్టి బెరడు యొక్క పరిమాణంలో, పెళుసుతనంలో మార్పులుంటాయి. వృక్షానికి రక్షణగా ఉండే ఇది కఠినంగా ఉంటుంది. బెరడును ఆంగ్లంలో బార్క్ అంటారు. లేత బెరడు నునుపుగా, ముదురు బెరడు గరుకుగా ఉంటుంది. చెట్ల యొక్క రకాన్ని బట్టి, వాటి వయసును బట్టి బెరడు రంగులలో మార్పులుంటాయి. ఒకే చెట్టుకి వివిధ చోట్ల ఉన్న బెరడులో కూడా తేడాలుంటాయి. సాధారణంగా బాగా వయసు ముదిరిన చెట్టు మానుకు ఉన్న బెరడు మందంగా, పెళుసుగా, గరుకుగా, బూడిద రంగుతో కూడిన బెరడు ఉంటుంది. కొత్త కొమ్మలకు, లేత చెట్లకు పలుచని, నునుపైన, ఆకుపచ్చ రంగుతో కూడిన బెరడు ఉంటుంది. బెరడు వాస్కులర్ కాంబియం యొక్క వెలుపలి మొత్తం కణజాలాన్ని సూచిస్తుంది, సాంకేతికతతో సంబంధం లేని పదం.

"https://te.wikipedia.org/w/index.php?title=బెరడు&oldid=4322521" నుండి వెలికితీశారు