తాటిపూడి జలాశయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తాటిపూడి జలాశయం గోస్తని నది యొక్క ఒక నీటి రిజర్వాయర్. ఇది ఆంధ్ర ప్రదేశ్ లో విజయనగరం దగ్గర విజయనగరం, తాటిపూడి లో ఉన్నది.[1][2]

ప్రాజెక్టులు[మార్చు]

జిల్లాలో ఒక భారీ, మరికొన్ని మధ్యతరహా, చిన్నతరహా సాగునీటి పాజెక్టులు ఉన్నాయి. జంఝావతి, తోటపల్లి, పెద్దగెడ్డ, వెంగళరాయసాగర్‌, ఆండ్ర, గడిగెడ్డ, తాటిపూడి, తారకరామతీర్ధ సాగర్‌ జలాశయాలు. ఇందులో జంఝావతి, పెద్దగెడ్డ, వెంగళరాయ, ఆండ్ర, తాటిపూడి జలాశయాల కింద దాదాపు 40 వేల హెక్టార్ల ఆయకట్టు ఉంది. తాటిపూడి నుంచి విశాఖపట్నానికి రెండు టీఎంసీల తాగునీరు అందిస్తున్నారు. వట్టిగెడ్డ, పారాది ఆనకట్ట, సువర్ణపాడు, వేగావతి, సీతానగరం, పెదంకలాం ఆనకట్టలున్నాయి. వీటి ద్వారా 10వేల హెక్టార్లకు పైగా ఖరీఫ్‌లో సాగునీరు అందుతోంది. ప్రస్తుతం జిల్లాలో తోటపల్లి, తారకరామ తీర్ధసాగర్‌, జంఝావతి జలాశయాలు నిర్మాణంలో ఉన్నాయి. [3]

తాటిపూడి జలాశయం[మార్చు]

గంట్యాడ మండలం తాటిపూడి గ్రామం వద్ద గోస్తనీ నదిపై జలాశయం నిర్మించారు. 1965- 1968 మధ్యకాలంలో రూ. 1.85 కోట్ల వ్యయంతో తాటిపూడి ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 3.17 టీఎంసీలు. జలాశయం 650 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని గరిష్ఠ నీటిమట్టం 297 అడుగులు. దీని ద్వారా గంట్యాడ, జామి, ఎస్‌.కోట మండలాల్లో 15,366 ఎకరాలకు సాగునీరు, విశాఖపట్నానికి రెండు టీఎంసీల తాగునీరు అందుతోంది. జలాశయ నిర్మాణం నుంచి ఇప్పటివరకు ఆధునీకరణ పనులు చేపట్టక పోవడంతో సాగునీటి కాలువలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు వీటి ఆధునీకరణ పనులకు జపాన్‌ నిధులు రూ.24.92 కోట్లు మంజూరయ్యాయి. టెండర్లు ప్రక్రియ పూర్తయ్యాక పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ జలాశయం నుంచి విశాఖపట్నం నగరానికి ప్రతిరోజు 11 మిలియన్‌ గ్యాలన్ల నీరు అందిస్తుండగా విజయనగరం ప్రజల దాహార్తి తీర్చడానికి జలాశయం దిగువన ఏటిలో భూగర్భ జలాలను ముషిడిపిల్లి పథకం ద్వారా సరఫరా చేస్తున్నారు. [4] తాటిపూడి జలాశయం విశాఖపట్నం యొక్క నగరం నీటి నిల్వ కోసం ఉంది.[5][6][7]

మూలాలు[మార్చు]

  1. http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article1581219.ece
  2. http://www.thehindubusinessline.com/todays-paper/tp-economy/vizag-development-schemes-cleared/article1655593.ece
  3. http://te.vikaspedia.in/agriculture/c1cc3fc32c4dc32c3ec32-c35c3ec30c3f-c38c2ec3ec1ac3ec30c02/c35c3fc1cc2fc28c17c30c02
  4. http://te.vikaspedia.in/agriculture/c1cc3fc32c4dc32c3ec32-c35c3ec30c3f-c38c2ec3ec1ac3ec30c02/c35c3fc1cc2fc28c17c30c02
  5. http://www.hindu.com/2004/06/23/stories/2004062303380500.htm
  6. http://www.deccanchronicle.com/hyderabad/vizag-runs-out-water-868
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-27. Retrieved 2014-11-01.

వెలుపలి లంకెలు[మార్చు]