తాతయ్య ప్రేమలీలలు

వికీపీడియా నుండి
(తాతయ్య ప్రేమలేఖలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తాతయ్య ప్రేమలేఖలు
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.వి.ప్రసాద్
నిర్మాణం ఎమ్.ఎస్.రెడ్డి
తారాగణం నూతన్ ప్రసాద్ ,
చిరంజీవి,
దీప,
సీమ
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ కౌముది పిక్చర్స్
భాష తెలుగు

తాతయ్య ప్రేమలీలలు చిరంజీవి, నూతన్ ప్రసాద్ నటించిన తెలుగు చిత్రం.[1][2] ఇది 1980 లో విడుదలైంది. ఎం ఎస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు బి.వి. ప్రసాద్ దర్శకుడు, రాజన్ నాగేంద్ర సంగీత దర్శకులు. గోవిందరాజు సీతాదేవి రచించిన "తాతయ్య - గర్ల్ ఫ్రెండ్" నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

నూతన్ ప్రసాద్ ఒక ధనవంతుడు. అతని కుమారుడు తన ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకుని, అత్యాధునిక ఆధునిక సంస్కృతిలో పెరిగే తన పిల్లలతో (చిరంజీవి, దీప) బొంబాయిలో స్థిరపడతాడు. భార్గవ్ (చిరంజీవి) కు, అతని మరదలు గీతకూ (వారి గ్రామంలో ఉంటుంది) పెళ్ళి చెయ్యాలని నూతన్ ప్రసాద్ కోరుకుంటాడు. పెళ్ళి ప్రతిపాదనతో అతను బొంబాయి వెళ్తాడు. భార్గవ్ ఓ పల్లెటూరి పిల్లను పెళ్ళి చేసుకునే మానసిక స్థితిలో లేడనీ, అతను ఇప్పటికే సీమ అనే అమ్మాయి వలలో చిక్కుకున్నాడనీ అతడు తెలుసుకుంటాడు. సీమ ఒక అవకాశవాది అని కూడా తెలుసుకుంటాడు. నూతన్ ప్రసాద్ ధనవంతుడైన వృద్ధుడిగా నటించి సీమాతో రొమాన్స్ చేస్తాడు.

ధనాశ గల సీమా ఆ వృద్ధుడిని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. భార్గవ్‌ను వదిలివేస్తుంది. సీమా నిజమైన తత్వమేమిటో తెలుసుకున్న భార్గవ్, గీతను పెళ్ళి చేసుకోవడానికి అంగీకరిస్తాడు.[3]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
  • వెన్నెల్లో విన్నాను సన్నాయి గీతం [4], రచన: మల్లెమాల సుందర రామిరెడ్డి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి
  • ఏం కావాలి నేనేం కావాలి, రచన:మల్లెమాల, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • చిక్కావులే చక్కెర బొమ్మ చక్కదనాల చామంతి, రచన:మల్లెమాల, గానం.పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • తోకా ఈకా లేని పిట్ట తొంభై ఆమడ ఎగిరోచ్చింది, రచన:మల్లెమాల, గానం, పి.సుశీల, ఎస్ జానకి బృందం
  • నాపేరు నాగమల్లి ఇంకా కాలేదు పెళ్లి , రచన:మల్లెమాల, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • బాగున్నది భలే బాగున్నది తొలిసారి ఇద్దరం, రచన:మల్లెమాల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • ముందుగానే మేలుకొంది యవ్వనం,రచన:మల్లెమాల, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్.

మూలాలు

[మార్చు]
  1. "Chiranjeevi movie list - Telugu Cinema hero".
  2. "Chiranjeevi Filmography".
  3. "Thathayya Premaleelalu".
  4. "తాతయ్య ప్రేమలీలలు". తెలుగు లిరిక్స్. Retrieved 2020-08-03.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]

5.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog .