Jump to content

తారామణి

వికీపీడియా నుండి
తారామణి
దర్శకత్వంరామ్
నిర్మాతడి. వెంకటేష్
తారాగణంఅంజలి
ఆండ్రియా
వసంత్ రవి
అళగమ్ పెరుమాల్
నివాస్ అదితన్
ఛాయాగ్రహణంతేని ఈశ్వర్
కూర్పుశ్రీకర్ ప్రసాద్
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
డి.వి క్రియేషన్స్
విడుదల తేదీ
6 సెప్టెంబర్ 2019
దేశం భారతదేశం
భాషతెలుగు

తారామణి 2019లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో 2017లో 'తారామణి' పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో డి.వి క్రియేషన్స్ బ్యానర్‌పై డి. వెంకటేష్ నిర్మించిన ఈ సినిమాకు రామ్ దర్శకత్వం వహించాడు.[1] అంజలి,ఆండ్రియా, వసంత్ రవి, అళగమ్ పెరుమాల్, నివాస్ అదితన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదలైంది.

ప్రభురాజ్(వసంత్ రవి) నగరంలో ఓ కాల్ సెంటర్ ఉద్యోగంలో చేస్తుంటాడు. అతడికి తన ఆఫీస్ ఎదురుగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేసే సౌమ్య(అంజలి)తో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారుతుంది. ప్రభు .. సౌమ్య అమెరికా వెళ్లడానికి రూ. 3 లక్షలు సహాయం చేస్తాడు. అయితే ఆ డబ్బుతో అమెరికా వెళ్లిన సౌమ్య యూఎస్ఏలో ఉండే తెలుగు వ్యక్తిని పెళ్లాడుతుంది. ప్రేమలో విఫలమై ప్రభుకు భర్తతో విడిపోయి ఒక బాబు ఉన్న ఆల్థియా జాన్సన్‌ (ఆండ్రియా)తో పరిచయం ఏర్పడి తరువాత ఇద్దరూ సహజీవనం చేస్తుంటారు. ప్రభు ఆల్థియా జీవితంలోకి వచ్చాక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఆల్థియా విషయంలో ప్రభు ఎలా ప్రవర్థించాడు? అనేదే మిగతా సినిమా కథ. కథానాయికగా ఆంగ్లో ఇండియన్ నటి జర్మియా ఇందులో ఆంగ్లో ఇండియన్ యువతి ఆల్తెయా పాత్రను పోషించింది, సంప్రదాయ భావాలతో పెరిగిన కథానాయకుడు ప్రభు పాత్రను వసంత్ రవి ధరించాడు. ఆల్తెయా ఉత్సాహవంతురాలైన యువతి, సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగిని, అయిదారేళ్ళ బాబున్నాడు తనకు, తల్లీతండ్రీ అంతా తానే అయి బాబును సాకుతోంది. ఇంట్లో తనకు తోడుగా తన తల్లి.

వర్షంపడుతున్న రాత్రి యాదృచ్ఛికంగా ఆమె కథానాయకుడు ప్రభును కలుసుకొంటంంది, ఆ పరిచయం ఇద్దరిమధ్య ప్రణయంగా మారుతుంది. ప్రభుకు కూడా ఒక విషాదగతం ఉంది. అతను కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. సహోద్యోగిని తను ప్రేమించుకుంటారు. ఇంతలో కంపెనీ ఆమెను అమెరికాకు పంపుతుంది. ప్రభు ఆమె అమెరికా ప్రయాణాలను సహాయం కూడా చేస్తాడు. ఆమె అమె అమెరికాలో ఎవరినో పెళ్లి చేసుకొని ప్రభుతో సంబంధం తెంచుకొంటుంది. ప్రభు డిప్రెషన్ బారినపడి ఆఫీసులో అదుపుతప్పి వ్యవహరించి ఉద్యోగం పోగొట్టుకుని తారామణి స్టేషన్ సమీపంలో మురికివాడలో తలదాచుకోవలసి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో అతనికి అల్తెయా పరిచయం స్నేహంగా మారడం జరుగుతుంది.

ఇద్దరూ ఒంటరి జీవితాలు, ప్రేమరాహిత్యంలో ఆత్మీయత, స్నేహం కోసం తపించే స్థితిలో మిత్రులవుతారు. ప్రభు ఆల్తేయా కుమారుడిని కూడా ఇష్టపడతాడు. ఒకరోజు బాగా పొద్దు పోయిన తర్వాత ఆల్తేయా తల్లి కూతుర్ని ఆవేశంలో లంజ అంటుంది.(slut) ఆల్తెయా కుమారుణ్ణి తీసుకొని ఆ రాత్రి వేళ తారామణిలో మురికి వాడలో ప్రభువద్దకు వెళుతుంది. ఆ గుడిసెలో అతనితో మరొక నిర్భాగ్యుడు, ప్రభు ఆమెను తారామణి లోకల్ రైల్వే ప్లాట్ ఫాం మీద ఆరాత్రి ఉండే ఏర్పాటు చేస్తాడు. తెల్లవారి ఆమె తన మిత్రులకిచ్చిన ఫ్లాట్ ఖాళీ చేయించి అందులో చేరిపోతుంది. అల్తేయా తొలి వివాహం గురించి మొదట ఏమీ తెలియదు. ఆమె జ్గాపకాలలో ఒక్క క్షణం భర్త ఎవరో యువకుడితో శరీరసంబంధం పెట్టుకొన్న విషయం చూసి, ఆ యువకుడికి ఉద్యోగం వెతుక్కొనేందుకు ఆర్థిక సహాయం చేసినట్లు ఒక దృశ్యం.

ప్రభు ఆమెకు సహాయంగా ఉంటూ ఆమె కోరికపై ఆమెతో కలిసి ఉండటానికి సమ్మతిస్తాడు. కొద్దికాలం ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు, కాని ఉద్యోగం, ఆదాయం లేని ప్రభు తనలోని ఆత్మన్యూనతా భావాన్ని, పురుషాహంకారాన్ని అధికారం ప్రదర్శించడంగా, దర్పంగా, ఆమె ప్రతి కదలికను అనుమానించడంగా మార్చుకుని ఇద్దరి జీవితాలను నరకం చేస్తాడు. విధిలేని పరిస్థితిలో అతన్ని ఇంట్లోంచి గెంటేస్తుంది కాని ఆమెలోని భార్యతనం, ఆడతనం మరలా అతనితో జీవించడానికి సమ్మతిస్తుంది , అతనిలో ఎటువంటి మార్పు రాదు.

ఒంటరి మహిళ, ఆంగ్లో ఇండియన్, సౌందర్యం, యవ్వనంలో ఉన్న ఆమెను ఆఫీసులో, బయట అలుచుగా చులకనగా చూస్తారు. బార్ వాకిట్లో ఆమెపొందు కోరి డబ్బిస్తామని పిలిచిన పురుషులపైనపడి చెప్పుతో ఛావకొడుతుంది. మరొక సహోద్యోగి ఆమెపట్ల అనుచితంగా ప్రవర్తిస్తే చాలా కాలం క్రితం ఇద్దరు తీసుకొన్న ఫొటోలు ఫేస్ బుక్ లో పెట్టడంతో ఆ మగధీరుడు ఆమె కాళ్ళపైన పడతాడు. ఒంటరి మహిళ ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా, రోజూ ఎదుర్కొనవలసి పరిస్థితులను ఆమె గంభీరంగా ఎదుర్కొంటుంది. చివరకు ఆల్తేయా ఔదార్యం వల్ల ప్రభు ఆమె ఇల్లు చేరతాడు. రైల్వే స్టేషన్లో పోలీసు అతని భార్య వేధింపులు సహించలేక ఆత్మహత్య చేసుకొంటుంది. సినిమాలో అటువంటి ఉపేక్షించబడిన గృహిణుల పాత్రలే. ఆల్తెయాను తల్లి నుంచి అందరూ 'స్లట్' అన్నవారే. ఆమె ప్రభుతో చివర్న అంటుంది, "నీవల్ల అత్యంత సంతోషం, అంతే బాధను అనుభవించాను" అని.


నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (8 March 2018). "Tamil film 'Taramani' to be dubbed into Telugu" (in ఇంగ్లీష్). Archived from the original on 21 November 2021. Retrieved 21 November 2021.
  2. Sakshi (9 October 2016). "డిఫరెంట్ లవ్‌స్టోరీ". Archived from the original on 21 November 2021. Retrieved 21 November 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=తారామణి&oldid=3959814" నుండి వెలికితీశారు