తిరునగరి శ్రీనివాసస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరునగరి శ్రీనివాసస్వామి

వ్యక్తిగత వివరాలు

జననం (1969-01-15) 1969 జనవరి 15 (వయసు 54)
గుమ్లాపూర్‌ గ్రామం
చొప్పదండి మండలం
కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
నివాసం కోరుట్ల
మతం హిందూ

తిరునగరి శ్రీనివాసస్వామి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయుడు, సాహితీవేత్త, సినీ గేయరచయిత.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

తిరునగరి శ్రీనివాసస్వామి 1969, జనవరి 15న కరీంనగర్ జిల్లా, చొప్పదండి మండలం, గుమ్లాపూర్‌ గ్రామంలో జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు మోహన్‌రావుపేటలో, ధర్మపురిలోని శ్రీలక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాలలో ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేశాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎం.ఎ.(తెలుగు) పట్టా అందుకున్నాడు.

వృత్తి జీవితం[మార్చు]

శ్రీనివాసస్వామి ఆంధ్ర సారస్వత పరిషత్తులో పండిత శిక్షణ పూర్తి చేశాడు. ఆయన వివిధ పాఠశాల్లో ఉపాధ్యాయుడిగా పని చేశాడు. అతను ప్రస్తుతం కోరుట్ల లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఆయన 2019లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నాడు.

సినీ జీవితం[మార్చు]

శ్రీనివాసస్వామి 2008లో ‘ఈ తీర్పు ఇల్లాలిది’ సినిమా ద్వారా చిత్రరంగంలోకి గేయరచయితగా అడుగు పెట్టాడు. ఆయన ‘అందాల చంద్రుడు’ (2009), ‘లెనిన్‌’ (2010), ‘శ్రీ బాసర సరస్వతీ మహాత్మ్యం’ (2013) సినిమాలతో పాటు 30కి పైగా సినిమాలకు పాటల రాశాడు.[2]

కవిగా[మార్చు]

తిరునగరి శ్రీనివాసస్వామి అనేక కవితలు రాశాడు. ఆయన సాహితీరంగంలో సేవలకు గాను 2004లో విజయవాడలో విజ్ఞానసుధ వారి ఉత్తమ కవితా పురస్కారాన్ని, 2018లో రాష్ట్రస్థాయి సినారె పురస్కారం అందుకున్నాడు.[3][4]

మూలాలు[మార్చు]

  1. Nava Telangana (15 May 2021). "మహిళా మనుగడకు మనోధైర్యమిచ్చే పాట". Retrieved 24 May 2021.
  2. Namasthe Telangana (15 May 2021). "పాటల తిరు'నగ'రి." Namasthe Telangana. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  3. Andhrajyothy (29 September 2019). "ఆర్కైవ్ నకలు". m.andhrajyothy.com. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  4. Andhrabhoomi (6 January 2020). "పరుగులిడుతోంది! | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Retrieved 25 May 2021.