తిరువయ్యారు
?Tiruvarur తమిళనాడు • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 10°46′N 79°39′E / 10.77°N 79.65°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 3 మీ (10 అడుగులు) |
జిల్లా (లు) | Tiruvarur జిల్లా |
జనాభా | 56,280 (2001 నాటికి) |
Municipal Chairperson | K. Thennan[1] |
తిరువయ్యారు తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా లోని పట్టణం. ఇది తిరువయ్యారు తాలూకాకు కేంద్రం. ఈ పురాతన చోళరాజ్య పట్టణం శ్రీత్యాగరాజస్వామి ఆలయానికి, ఏప్రిల్ నెలలో జరిగే రథోత్సవానికీ ప్రసిద్ధి గాంచింది. ఇది తంజావూరు నుండి 11 కి.మీ. ఉత్తరాన, కావేరి నది ఒడ్డున ఉంది. తిరువయ్యారు అంటే ఐదు నదుల పవిత్ర స్థలం అని అర్థం. వడవార్, వెన్నార్, వెట్టార్, జూడుమూరుత్తి, కావేరి అనే ఐదు నదుల మీదుగా ఈ పట్టణానికి ఆ పేరు వచ్చింది.
కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన త్యాగయ్య తిరువయ్యారులో జన్మించాడు. ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరిలో త్యాగరాజస్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని త్యాగరాజ ఆరాథనోత్సవాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న సంగీతవిద్వాంసులు పాల్గొని త్యాగరాజస్వామి వారి " పంచరత్నల"ను గానం చేస్తారు.
ఆధ్యాత్మిక పట్టణం
[మార్చు]ఇక్కడి శివాలయం లోని దేవుని పేరు పంచనదీశ్వరస్వామి. అమ్మవారి పేరు ధర్మసంవర్ధిని. ఈ పట్టణాన్ని దక్షిణ కైలాసం అని అంటారు. ఇక్కడున్న పంచనదీశ్వర స్వామి ఆలయం 60,000 చ.మీ. విస్తీర్ణంలో 5 ప్రకారాలతో ఉంటుంది. ఈ ఆలయంలో ఉత్తర కైలాసం, దక్షిణ కైలాసం అనే రెండు విభాగాలున్నాయి.ఉత్తర కైలాసాన్ని 10 వ శతాబ్ది మలి భాగంలో రాజేంద్ర చోళుని పట్టమహిషి లోకమహాదేవి నిర్మింపజేసింది.[2] ఆమె పేరు మీద లోకమహాదేవి ఈశ్వరం ఊదయారు అని కూడా అంటారు.[3] దక్షిణ కైలాసాన్ని రాజేంద్ర చోళుని భార్య పునర్నిర్మించింది.
ఈ ఆలయంలో కాల సంహారమూర్తి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం బయట ఆది శంకరాచార్యులు నెలకొల్పిన హోమగుండాన్ని చూడవచ్చు. ఈ హోమగుండంలో కుంగళియుం అనే సాంబ్రాణి వంటి పదార్థాన్ని వేస్తారు.
కావేరి తీరం వెంట ఉన్న ఆరు ముఖ్యమైన దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. మిగతావి తిరువిడైమురుదూరు, మాయిలదుతురై, సాయవనం (పూంపుహార్ వద్ద), తిరువెంగాడు, తిరువానిజం.
మూలాలు
[మార్చు]- ↑ "The Hindu dated 29 October 2006". Archived from the original on 9 నవంబరు 2006. Retrieved 12 మే 2009.
- ↑ K. M. Venkataramaiah, International School of Dravidian Linguistics. A handbook of Tamil Nadu. International School of Dravidian Linguistics, 1996 - History - 544 pages. p. 360.
- ↑ S. R. Balasubrahmanyam. Middle Chola Temples: Rajaraja I to Kulottunga I, A.D. 985-1070. Thomson Press (India), 1975 - Hindu temples - 424 pages. p. 89.