Jump to content

తులసిదాస్ జాదవ్

వికీపీడియా నుండి
తులసిదాస్ జాదవ్
జననం25 జనవరి 1905
మరణం11 సెప్టెంబరు 1999
జాతీయతభారతీయుడు
వృత్తిస్వాతంత్ర్య సమరయోధుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త

తులసిదాస్ జాదవ్ ( 1905 జనవరి 25 - 1999 సెప్టెంబరు 11) మహరాష్ట్రకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త. బొంబాయి శాసన మండలి, లోక్‌సభ సభ్యుడిగా పనిచేశాడు.[1]

తొలి జీవితం

[మార్చు]

తులసిదాస్ సుభంరావు జాదవ్ 1905, జనవరి 25న మహరాష్ట్ర, సోలాపూర్ జిల్లా, బార్షి తాలూకాలోని దహితనే గ్రామంలో జన్మించాడు.[2] సోలాపూర్ లోని హరిబాయ్ డియోకార్న్ హైస్కూల్ లో చదివాడు.[3]

కుటుంబం

[మార్చు]

1913లో తులసిదాస్ జాదవ్‌కు జనాభాయితో వివాహం జరిగింది.[3] వారికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.[3] పెద్ద కుమారుడు జయవంత్ జాదవ్, చిన్న కుమారుడు యశ్వంత్ జాదవ్. కుమార్తె కళావతిని బాబాసాహెబ్ భోసలేతో వివాహం చేసుకున్నాడు. భోసలే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు.[4]

వృత్తి

[మార్చు]

తులసిదాస్ జాదవ్‌ వ్యవసాయదారుడు.[3][5]

రాజకీయ జీవితం

[మార్చు]

1921 నుండి 1947 వరకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. షోలాపూర్ నుండి స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న చురుకైన నాయకులలో తులసిదాస్ జాదవ్‌ ఒకడు. 1930లో మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహా ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు క్రిష్నాజీ భీంరావు ఆంట్రోలికర్, తులసిదాస్ జాదవ్, జాజుజీ వంటి యువ కార్మికులు రంగంలోకి దిగి ఉద్యమంలో పాల్గొన్నారు. తరువాత గాంధేయతత్వానికి ముఖ్య అనుచరులుగా చేరారు.[6] 1930లో మతతత్వ ఉద్యమంలో పాల్గొన్నందుకు 1931, 1932, 1941, 1942లలో జైలుకు పంపించబడ్డాడు.[2][3] 1937-1939, 1946-1951, 1951-57 వరకు బొంబాయి శాసనసభ సభ్యుడిగా పనిచేశాడు.[2][3] సత్యాగ్రహం సమయంలో ఒకసారి అధికారి అతని ఛాతీపై తుపాకీ పెట్టి, ఉద్యమ ప్రదేశం విడిచి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. కానీ తులసిదాస్ జాదవ్ ఆ ప్రాంతం విడిచి వెళ్ళడానికి నిరాకరించాడు - అదృష్టవశాత్తూ అతడిని విడిచిపెట్టారు.[6] మహాత్మాగాంధీతో సన్నిహితంగా ఉండేవాడు, 1932లో యరవాడ జైలులో ఉన్నప్పుడు గాంధీకి కార్యదర్శిగా పనిచేశాడు.[7][8]

స్వాతంత్ర్యం తరువాత 1947లో కాంగ్రెస్‌ పార్టీనుండి బయటికి వచ్చాడు. మరికొంత మంది మాజీ కాంగ్రెస్‌ నాయకులతో కలిసి రైతులు, వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరాడు. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకడిగా ఉన్నాడు.[3]

1961లో ఇతర పిడబ్ల్యుపి సహచరులైన కేశవరావు జేధే, శంకర్రావ్ మోర్‌తో కలిసి మళ్ళీ కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.[9] 1962-67 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున నాందేడ్ నియోజకవర్గం నుండి 3వ లోక్‌సభ సభ్యుడిగా, బారామతి నియోజకవర్గం నుండి 4వ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] 1971 ఎన్నికల్లో ఆయనకు ఎన్నికల టికెట్ రాలేదు.[10][11]

ముపార్లమెంటరీ కమిటీలుగా ముసాయిదా మూడో పంచవర్ష ప్రణాళికపై కూడా పనిచేశాడు.[3] మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశాడు, 1957-60 వరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. ఎలక్ట్రిసిటీ కన్సల్టేటివ్ కమిటీ, టిబి బోర్డు, రోడ్ భద్రతపై స్టడీ గ్రూప్ లెప్రసీ కమిటీ సభ్యుడిగా తన సేవలను అందించాడు.[3][12]

సామాజిక సంస్కర్త

[మార్చు]

1930 దశాబ్దాల నుండి తన క్రియాశీల జీవితం వరకు హరిజన, దళిత వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషిచేశాడు.[3][5]

మరణం

[మార్చు]

తులసిదాస్ జాదవ్ 1999, సెప్టెంబరు 11న ముంబైలో మరణించాడు.[5][13][14]

స్మారక చిహ్నాలు

[మార్చు]
  • 2009 ఫిబ్రవరిలో మెకానిక్ చౌక్ వద్ద తులసీదాస్ జాదవ్ విగ్రహాన్ని స్థాపించారు. అతని ధైర్య సాహసాలకు గుర్తుగా 1930 మే 9 నుండి 11 వరకు మూడు రోజుల పాటు, పోలీసు అధికారులందరిచే పట్టణ శాంతిభద్రతలు నిర్వహించబడ్డాయి. దీనిని శరద్ పవార్, సుశీల్ కుమార్ షిండేలు ప్రారంభించారు.[15]
  • తులసిదాస్ జాదవ్ పేరుమీద సోలాపూర్‌లో అధ్యాపక్ విద్యాలయం అనే ఉపాధ్యాయ శిక్షణ పాఠశాలను ప్రారంభించారు.
  • మహారాష్ట్ర రాజ్య సాహిత్య ఆణి సాంస్కృతిక మండలి వ్యాంకతేష్ కమత్కర్ మహారాష్ట్రే శిల్పకార్ పేరుతో తులసిదాస్ జాదవ్ జీవిత చరిత్రను రాశాడు.[16]

మూలాలు

[మార్చు]
  1. "Members Bioprofile". loksabhaph.nic.in. Retrieved 2021-10-02.
  2. 2.0 2.1 2.2 Yaśavantarāva Cavhāṇa, vidhimaṇḍaḷātīla nivaḍaka bhāshaṇe, Volume 2 by Yaśavantarāva Cavhāṇa Pratishṭhāna Mumbaī, 1990 - Maharashtra (India)pp: 31-32, 447
  3. 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 3.10 "4th Lok Sabha Members Bioprofile". Archived from the original on 2015-04-02. Retrieved 2021-10-02.
  4. "Babasaheb Anantrao Bhosale The eighth Chief Minister Of Maharashtra". Archived from the original on 2019-02-11. Retrieved 2021-10-02.
  5. 5.0 5.1 5.2 Reference Made To The Passing Away Of Shri Tulshidas Jadhav On 11Th ... on 13 March 2000
  6. 6.0 6.1 The Gazetteer SHOLAPUR DURING POST-1818 PERIOD
  7. International Peace Research Newsletter. International Peace Research Association. 1994. pp. 36, 45. Retrieved 5 March 2015.
  8. "War Protestor". Archived from the original on 2018-08-30. Retrieved 2021-10-02. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  9. Journal of Shivaji University: Humanities, Volumes 35-38 by Shivaji University, 2000 pp:28
  10. PMO Diary: The emergency by Bishan Narain Tandon; Konark Publishers Pvt .Limited, 2006 pp: 35
  11. Link - Volume 12, Part 1 - Page 14
  12. Report - Page 112 India (Republic). Study Group on Road Safety, Tulsidas Jadhav
  13. व्यंकटेश कामतकर (2005). स्वातंत्र्य सेनानी तुळशीदास जाधव. महाराष्ट्र राज्य साहित्य आणि संस्कृती मंडळ.
  14. Lok Sabha Debates by India. Parliament. House of the People Lok Sabha Secretariat., 2000 pp:6
  15. Solapur
  16. "नेटभेट मोफत मराठी ई-पुस्तके - Netbhet ebooks Library".