తూములూరు అనంత పద్మనాభయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తూములూరు అనంత పద్మనాభయ్య స్వాతంత్ర్య సమరయోధులు.

వీరు నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గంగవరం గ్రామంలో జన్మించారు. మహాత్మా గాంధీ పిలుపు విని పోలీస్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్ర్య సమరంలో దూకి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. వీరు తన ఆస్తిని మొత్తంగా దేశసేవకై వెచ్చించారు. 1930 ఉప్పు సత్యాగ్రహం, 1931 శాసనోల్లంఘనోద్యమం, 1942 క్విట్ ఇండియా ఉద్యమాలలో వీరు పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లా కాంగ్రెసు సంఘంలో ప్రముఖ పాత్ర వహించి, నెల్లూరు పట్టణ కాంగ్రెసుకు అధ్యక్షులుగా పనిచేశారు.