తెంటు సత్యనారాయణ
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
తెంటు సత్యనారాయణ (సత్య తెంటు) ప్రముఖ సామాజికవేత్త, విద్యాధికులు, సమాజ శ్రేయోభిలాషి. ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, రాయవరం ప్రాంతాల్లో ఎందరో విద్యావంతులకు, నిరుద్యోగులకు ఆర్ధిక తోడ్పాటు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. నిస్వార్ధ సేవా నిరతి గల మనిషిగా పేరుగడించారు. రాజకీయాల ద్వారా ప్రజలకు మరింత సేవ చేసేందుకు నడుం బిగించారు.
తెంటు సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం రాయవరం గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన తెంటు సీతమ్మ, రాములు దంపతులకు ఆయన జన్మించారు. ప్రాధమిక విద్య రాయవరం ప్రాధమిక పాఠశాలలోను, పదో తరగతి వరకూ రాయవరంలోని శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోను చదివారు. కాకినాడ పి.ఆర్.ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యనభ్యసించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగులో అనంతపురం జె.ఎన్.టి.యు ఇంజినీరింగు కళాశాల నుంచి పట్టభద్రులయ్యారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్, బెంగుళూరు అల్యూమ్ని సభ్యులుగా ఉన్నారు.
సత్య తెంటు సతీమణి శేష గృహిణి. వీరి కుమారుడు క్రిష్ ఇంజినీరింగ్ చేసి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. కుమార్తె శఖ్య సైబర్ సెక్యూరిటీ నిపుణురాలు. వెల్స్ ఫార్గో బ్యాంకులో ఆమె ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్నారు.
సత్యతెంటు ప్రస్థానం:
విద్యార్ధి దశ నుంచే సత్య తెంటు నాయకత్వ లక్షణాలు గలవారు. స్కూలు, జూనియర్ కాలేజీ దశలో పీపుల్ లీడర్ గా, రిప్రజెంటేటివ్ గా వ్యవహరించారు. కబడ్డీ, బాల్ బ్యాడ్ మింటన్ వంటి క్రీడలలో చురుకుగా పాల్గొనేవారు. పరీక్ష ఫలితాల్లో మొదటి శ్రేణి మార్కులను సాధించేవారు. 1983లో బెంగుళూరులోని నిప్పాన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో గ్రాడ్యుయేట్ ఇంజనీరుగా ఉద్యోగంలో చేరి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీరు హోదా వరకూ పని చేశారు. 1985లో నాసిక్ లోని శివానంద ఎలక్ట్రానిక్స్ కంపెనీలో సేల్స్ & సర్వీస్ ఇంజనీరుగా చేరి కంపెనీ డైరెక్టర్ హోదా వరకూ పదేళ్ళ పాటు విధులు నిర్వర్తించారు. ఈ కంపెనీ వివిధ రాష్ట్రాల పోలీసు, ఇతర భద్రతా వ్యవస్థలకు అవసరమైన మెటల్ డిటెక్టర్, గార్డ్ టూర్ సిస్టమ్, పెరీ మీటర్ ప్రొటెక్షన్ వంటి పరికరాలను తయారుచేసి సరఫరా చేస్తుంది. సత్య తెంటు శివానంద్ కంపెనీ మార్కెట్ ను దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్తృతం చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు. ఈ అనుభవంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా పలువురికి ఉపాధి కల్పన లక్ష్యంగా హైదరాబాదు కేంద్రంగా 1995లో శాఖ్య టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీని ప్రారంభించారు. ప్రధానంగా ఈ కంపెనీ ఫిజికల్ సెక్యూరిటీ ఉత్పత్తుల తయారీ, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ సొల్యూషన్స్ రూపకల్పన, సరఫరాలపై దృష్టి సారించింది.1996 లో టాటా యూనిసిసి వారితో కలిసి ఉమ్మడిగా ఒక ఫ్రాంచైజీ నెలకొల్పి యువతకు కంప్యూటర్ రంగంలో వివిధ అంశాలపై శిక్షణలు అందించారు. ఈ కార్యక్రమం ద్వారా 200 మందికి పైగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అమెరికాలో వివిధ సంస్థల్లో ఉపాధి పొందడం విశేషం.
రాయవరం జిల్లా పరిషత్ పాఠశాల అభివృద్ధికి కృషి:
రాయవరంలో జిల్లా పరిషత్ పాఠశాలను రాయవరం మునసబుగా పనిచేసిన వుండవల్లి సత్యనారాయణ యాభై దశకంలో స్థాపించారు. ఈ పాఠశాలలో చదివిన వారెందరో దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, శాసన సభ్యులు నల్లమిల్లి మూలారెడ్డి, పడాల అమ్మిరెడ్డి, సినీ రచయిత సత్యమూర్తి వంటి ఎందరో ప్రముఖులు ఈ పాఠశాలలో చదివినవారే. వుండవల్లి వారు తమ ఊరిలో ఈ బడిని పెట్టకపోతే తమలాంటి ఎందరో ప్రస్తుత స్థాయిలో వుండే వారం కాదని సత్య తెంటు చెబుతుంటారు. పాఠశాల అభివృద్ధికి మిత్రులతో కలిసి ఆయన కృషి చేస్తున్నారు. వుండవల్లి సత్యనారాయణపై ప్రేమాభిమానాలతో తెంటు సత్యనారాయణ మిత్రులతో కలిసి రాయవరం గ్రామంలో 2009 లో శ్రీ వుండవల్లి సత్యనారాయణ మూర్తి నాటక కళాపరిషత్ (వి.ఎస్.ఎం. కళా పరిషత్)ను స్థాపించారు. ఈ కళాపరిషత్ కు ఐదేళ్ళ పాటు అధ్యక్షుడిగా ఆయన సేవలు అందించారు. అధ్యక్ష హోదాలో కళాపరిషత్ తరుపున సామాజిక స్పృహ, మానవీయ విలువలు ప్రతిబింబించే రీతిలో రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికల పోటీలను నిర్వహించారు. ఎన్నో నాటికలను ప్రదర్శించారు. ఎందరో సినీ, వ్యాపార, సామాజిక రంగాలకు చెందిన ప్రతిభావంతుల్ని గుర్తించి, ఆహ్వానించి వారికి ఘన సన్మాన సత్కారాలు చేసారు.
ప్రముఖు దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, వి.వి.వినాయక్, నందిని రెడ్డి, నిర్మాతలు బెల్లంకొండ సురేష్, మల్లిడి సత్యనారాయణ రెడ్డి, ప్రముఖ వైద్యనిపుణులు నారాయణ రెడ్డి, జి.ఎస్.ఎన్.రెడ్డి, డా. నవీన్, పారిశ్రామిక వేత్తలు కే.పాపారెడ్డి, చింతా పాండురంగారెడ్డి, రాజకీయ ప్రముఖులు తేతల రామారెడ్డి, చెల్లుబోయిన వేణు, వడ్డి వీరభద్రరావు, చింతా సత్యనారాయణరెడ్డి వంటి ఎందరో ప్రముఖులకు తెంటు సత్యనారాయణ కళాపరిషత్ ద్వారా సన్మాన సత్కారాలు, దీపికలను అందజేసారు. తెలుగు భాష మీద.. పుట్టిన గడ్డ మీద మమకారంతో సత్య తెంటు రాయవరం గ్రామంలో 2017 లో తెలుగుతల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
సామాజిక సేవా కార్యక్రమాలు:
తెంటు సత్యనారాయణ పరివర్తన ఫౌండేషన్ ద్వారా తండ్రి లేని పిల్లల విద్యాభ్యాసానికి ఆర్ధిక సహకారం అందించడం, నిరుపేద క్రీడాకారులకు ఆర్ధిక ప్రోత్సాహం అందించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతూ క్రీడల్లో పాల్గొనాలనే ఉత్సాహం వున్న నిరుపేద చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ఆర్ధిక సహకారం అందిస్తున్నారు.
• సంఘ సేవ లక్ష్యంగా 2016 నుంచి రాజమండ్రిలో రాజమహేంద్రి ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు.
• 1985 లో అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ లో చేరి 1991లో బెంగుళూరు నగర అధ్యక్షుడిగా పనిచేశారు.
• బెంగూళూర్ ఇస్కాన్ సంస్థలో జీవిత కాల సభ్యత్వం పొంది వున్నారు.