తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం (టెస్కో)
టెస్కో
రకంవస్త్ర పరిశ్రమ
పరిశ్రమచేనేత
స్థాపన1976
ప్రధాన కార్యాలయం,
కీలక వ్యక్తులు
చింతా ప్రభాకర్ (చైర్మన్)
ఉత్పత్తులుపట్టు, కాటన్ వస్త్రాలు
యజమానిsప్రభుత్వ సంస్థ
వెబ్‌సైట్టెస్కో అధికారిక జాలగూడు

తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం (టెస్కో) తెలంగాణ రాష్ట్రంలోని చేనేతరంగ అభివృద్ధికోసం ఏర్పాటుచేయబడిన సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సహకార సంఘం (ఆప్కో) నుండి విడిపోయింది.[1]

అనుబంధ సంస్థలు

[మార్చు]

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 380 ప్రాథమిక చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిల్లో సుమారుగా 13,000 చేనేత కార్మికులు చేనేతరంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వీరందరికి పని కల్పంచడమే టెస్కో లక్ష్యం.

పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, వరంగల్ & కరీంనగర్ లలో ప్రధాన చేనేత క్లస్టర్లు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో 9, తెలంగాణ రాష్ట్రంలో 37 శాఖలను టెస్కో నిర్వహిస్తుంది.

చేనేత లక్ష్మి పథకం

[మార్చు]

తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకునే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ఈ చేనేత లక్ష్మి పథకం. చేనేత లక్ష్మి పథకంలో వస్ర్తాలను తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం షోరూంలలో కొనుగోలు చేయవచ్చు. ఈ పథకం కింద ప్రతి నెలా రూ.1000 చొప్పున 9 నెలలు చెల్లిస్తే.. తదుపరి రూ. 14400 విలువ వస్ర్తాలను అందిస్తారు. ఒకవేళ నెలకు రూ. 1000 వంతున నాలుగు నెలలు రూ. 4000 చెల్లిస్తే, తదుపరి రూ. 5400 విలువైన వస్ర్తాలు అందిస్తారు.

చేనేత బ్రాండ్ అంబాసిడర్స్

[మార్చు]
చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా సినీనటి సమంత

చేనేత రంగాన్ని ప్రోత్సహించడంకోసం తెలంగాణ రాష్ట్ర చేనేత శాఖ మంత్రి కల్వకుంట్ల చేనేతకు చేయూత అనే కార్యక్రమాన్ని రూపొందించారు.[2] చేనేతల ప్రోత్సాహించేందుకు కేటిఆర్ రూపొందించిన ఈ కార్యక్రమానికి సినీనటి సమంత తన మద్దుతు ప్రకటిస్తూ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని ప్రకటించింది.[3][4]

ఇతర వివరాలు

[మార్చు]
  • ప్రైవేటు దుకాణాలకు దీటుగా టెస్కో కార్యాలయాలు: రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో ప్రైవేటు దుకాణాలకు దీటుగా టెస్కో కార్యాలయాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రైవేటు షాపుల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని మార్కెట్లో నిలదొక్కుకునేందుకు వీలుగా దీర్ఘకాలిక వ్యూహంతో టెస్కో కార్యాలయాలు, దుకాణాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు.[5]
  • వారంలో ఒక రోజు చేనేత వస్ర్తాలు: చేనేత వస్ర్తాలను ప్రోత్సహించేందుకు 'వారంలో ఒక రోజు చేనేత' కార్యక్రమాన్ని చేనేత, టెక్స్ టైల్ శాఖ మంత్రి కేటీఆర్ నిర్వహించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలందరూ చేనేత వస్ర్తాలను వినియోగించి చేనేత వస్ర్తాలను ప్రోత్సహించాలని కోరారు.[6]

మూలాలు

[మార్చు]
  1. వి6 న్యూస్. "టెస్కో గా ఏర్పడిన ఆప్కో". Archived from the original on 4 డిసెంబరు 2015. Retrieved 15 March 2017. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)CS1 maint: numeric names: authors list (link)
  2. ఆంధ్రావిల్లాస్. "చేనేత బ్రాండ్ అంబాసిడర్ కేటిఆర్". /www.andhravilas.net. Archived from the original on 4 జనవరి 2017. Retrieved 15 March 2017. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. New Indian Express. "Actress Samantha is brand ambassador for Telangana handlooms". Retrieved 15 March 2017.
  4. తెలుగు తెలంగాణ99. "చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా సమంతా". telugu.telangana99.com. Retrieved 15 March 2017.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link]
  5. నమస్తే తెలంగాణ. "ప్రైవేటుకు దీటుగా టెస్కో షోరూమ్‌లు". Archived from the original on 20 అక్టోబరు 2016. Retrieved 15 March 2017. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. జెడిటీవిన్యూస్. "చేనేత వస్ర్తాలకు చేయూతనిచ్చేందుకు కలసి రావాలి". jdtvnews.com. Retrieved 15 March 2017.[permanent dead link]