Jump to content

చింతా ప్రభాకర్

వికీపీడియా నుండి
చింతా ప్రభాకర్
చింతా ప్రభాకర్


చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్[1]
పదవీ కాలం
12 సెప్టెంబర్ 2022 – 05 డిసెంబర్ 2023

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 నుండి 2018 వరకు
03 డిసెంబర్ 2023 - ప్రస్తుతం
నియోజకవర్గం సంగారెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం 1959 ఆగస్టు 10
సదాశివపేట, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
వృత్తి రాజకీయ నాయకుడు

చింతా ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.[2] చింతా ప్రభాకర్ 2022 జనవరి 26న టిఆర్ఎస్ పార్టీ, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

చింతా ప్రభాకర్ 1959 ఆగస్టు 10న తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, సదాశివపేటలో జన్మించాడు. ఆయన సదాశివపేట లోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాడు.[4]

రాజకీయ జీవితం

[మార్చు]

చింతా ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన సదాశివపేట మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్‌గా పనిచేశాడు. చింతా ప్రభాకర్ 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డి చేతిలో 6772 ఓట్ల తేడాతో ఓటమి పాల్యయాడు. ఆయన 2011లో టిఆర్ఎస్ లో చేరి సంగారెడ్డి టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమితుడయ్యాడు.

చింతా ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డి పై 29,814 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[5][6][7] ఆయన 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డి చేతిలో 2589 ఓట్ల తేడాతో ఓటమి పాల్యయాడు.[8]

చింత ప్రభాకర్ 2022 సెప్టెంబరు 12న తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమితుడై [9][10] 2022 సెప్టెంబరు 27న బాధ్యతలు స్వీకరించాడు.[11] ఆయన 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి[12], డిసెంబరు 05న తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశాడు.[13]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (13 September 2022). "హ్యాండ్లూమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ప్రభాకర్‌". Archived from the original on 13 September 2022. Retrieved 13 September 2022.
  2. Sakshi (18 November 2018). "కాంగ్రెస్‌ కంచుకోట సంగారెడ్డి". Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  3. Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
  4. Eenadu (14 November 2023). "అత్యధికులు పట్టభద్రులే". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  5. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  6. Sakshi (18 May 2014). "కాంగ్రెస్‌లో నైరాశ్యం". Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  7. Sakshi (23 October 2015). "దసరా కలిపింది ఇద్దరిని." Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  8. Andrajyothy (24 May 2019). "సంగారెడ్డిలో పుంజుకుంటున్న టీఆర్‌ఎస్‌". Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
  9. Namasthe Telangana (13 September 2022). "హ్యాండ్లూమ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా చింతా ప్రభాకర్‌". Archived from the original on 13 September 2022. Retrieved 13 September 2022.
  10. Eenadu (13 September 2022). "రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా చింతా ప్రభాకర్‌". Archived from the original on 13 September 2022. Retrieved 13 September 2022.
  11. Namasthe Telangana (28 September 2022). "అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్‌: చింతా ప్రభాకర్‌". Archived from the original on 28 September 2022. Retrieved 28 September 2022.
  12. BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.
  13. Namaste Telangana (5 December 2023). "టీఎస్‌హెచ్‌డీసీ చైర్మన్ పదవికి చింతా ప్రభాకర్ రాజీనామా". Archived from the original on 7 December 2023. Retrieved 7 December 2023.