తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం
తెలుగు శాఖ తరగతి గది
రకంవిశ్వవిద్యాలయ సాహిత్య శాఖ
స్థాపితం1919
అధ్యక్షుడుఆచార్య సి.కాశీం
స్థానంహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
కాంపస్ఉస్మానియా విశ్వవిద్యాలయం
అనుబంధాలుఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం అనగానే మొదటగా గుర్తొచ్చేది ఆర్ట్స్ కళాశాల, ఈ కళాశాల సామాజిక శాస్త్రాలు, మానవీయ శాస్రాలు కలిసి ఏర్పడింది. ఈ కళాశాలలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన తెలుగు శాఖ ఉంది. ఈ శాఖ 1919లో రాయప్రోలు సుబ్బారావు తొలి అధ్యక్షులుగా ఏర్పడింది.[1] ఈ శాఖ తెలుగు సాహిత్య విద్యార్థులకు స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) ను అందించడంతో పాటు తెలుగు భాష పై పరిశోధన (పీ.హెచ్.డి) లను ప్రోత్సహిస్తూ డాక్టరేట్ పట్టాలను అందిస్తుంది. వివిధ సిద్ధాంత గ్రంథాలు, పరిశోధనా గ్రంథాలు తెలుగు శాఖ పరిశోధనాలయంలో అందుబాటులో ఉన్నాయి.[2]

ప్రస్తుత అధ్యక్షులు[మార్చు]

ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు ఆచార్య చింతకింది కాశీం అధ్యక్షత వహిస్తున్నారు. వీరు ఆచార్య సూర్యా ధనుంజయ్ గారి తర్వాత ప్రస్తుతం 26వ శాఖాధ్యక్షులుగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

ప్రస్తుత ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులు[మార్చు]

స్నాతకోత్తర విద్య (ఎం.ఏ)గా తెలుగు[మార్చు]

ఎం.ఏ. తెలుగు 1940లో ప్రారంభించబడింది. 1940లో ఎం.ఏ. (తెలుగు)లో చేరిన పల్లా దుర్గయ్య 1942లో ఉత్తీర్ణుడైన ప్రప్రథమ ఎం.ఏ. తెలుగు విద్యార్థి. 1949లో ఎం.ఏ తెలుగులో రెగ్యులర్‌ విద్యార్థులుగా చేరి 1951లో 532 మార్కులతో డిస్టింక్షన్‌లో పాసైన విద్యార్థి ఆచార్య డా. బి.రామరాజు (రూల్‌ నెం. 131), 477 మార్కులతో ద్వితీయశ్రేణిలో పాసైన విద్యార్థిని ఇల్లిందల సుజాత (రూల్‌ నెం 132) చరిత్రలో నిలిచారు.[3]

స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) గా తెలుగు అభ్యసనం అనేది భాషలో ఎంతగానో ప్రావీణ్యం సంపాదించటానికి తోడ్పడుతుంది. ఇక్కడ విద్యార్థులు "ప్రాచీన తెలుగు సాహిత్యం" నుండి "ఆధునిక తెలుగు సాహిత్యం" వరకు అధ్యయనం చేస్తారు. అంతే కాకుండా "తెలుగు శాసనాలు", "తెలుగు వ్యాకరణం-అలంకారాలు-ఛందస్సు", "వివిద తెలుగు సాహిత్య ప్రక్రియలు", "తెలుగు భాషా చరిత్ర", "తెలుగు సాహిత్య విమర్శ" వంటి అంశాలను క్షుణ్ణంగా నేర్చుకుంటారు.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. మనతెలంగాణ (24 April 2018). "నూరేళ్ల ఒయు తెలుగు శాఖ". Archived from the original on 25 April 2018. Retrieved 25 April 2018.
  2. "ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సిద్ధాంతగ్రంథాలు". Retrieved 2018-12-18.
  3. నవతెలంగాణ, సోపతి-స్టోరి (5 March 2016). "తొలి తెలుగు ఎం.ఏ. విద్యార్థిని ఇల్లిందల సుజాత". వెలుదండ నిత్యానందరావు. Archived from the original on 2 February 2019. Retrieved 2 February 2019.